ఇలాంటి ఆహారాలు తింటే 32 రకాల వ్యాధులు వచ్చే అవకాశం, చెబుతున్న కొత్త అధ్యయనం

Best Web Hosting Provider In India 2024

ఇలాంటి ఆహారాలు తింటే 32 రకాల వ్యాధులు వచ్చే అవకాశం, చెబుతున్న కొత్త అధ్యయనం

 

మన తినే ఆహారమే మన ఆయుష్షును నిర్ణయిస్తుంది. అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాలు అధికంగా తినడం వల్ల ఆరోగ్యం క్షీణించి రోగాల బారిన పడే అవకాశం ఉంది. దీని వల్ల ఆయుర్ధాయం తగ్గిపోతుంది. చిన్న వయసులోనే తీవ్రమైన వ్యాధుల బారిన పడి మరణించే ఛాన్స్ ఉంది అని కొత్త అధ్యయనం చెబుతోంది.

 
మీరు ఎలాంటి ఆహారాన్ని తింటున్నారు? 

ఆహార ప్రియులకు షాక్ ఇచ్చే అధ్యయనం ఇది. సాయంత్రంమైన బర్గర్లు, పిజ్జాలు, నూనెలో వేయించిన ఆహారాలు తినే వారు ఇకపై చాలా జాగ్రత్గా ఉండాలి. వాటిని తగ్గించుకోవాలి. లేకుంటే ఆయుష్షు తగ్గిపోతుంది. నిండు నూరేళ్లు కాదు కదా… అరవై ఏళ్లు బతకడమే కష్టంగా మారిపోతుంది.

 

ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలీ, కొలంబియా, మెక్సికో, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ దేశాల నుండి జాతీయ ప్రాతినిధ్య ఆహార సర్వేలు, మరణాల డేటా నుండి డేటాను విశ్లేషించిన ఒక అధ్యయనం అల్ట్రాప్రాసెసెస్డ్ ఫుడ్స్ (యుపిఎఫ్) వినియోగం వల్ల అకాల మరణాలు సంభవిస్తున్నట్టు కనిపెట్టాయి.

అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ప్రచురితమైన కొత్త అధ్యయనం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినే వారిలో వచ్చే రోగాల జాబితా పెద్దగా ఉంటుందని, చిన్న వయసులోనే వారు కొన్ని రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిర్ధారించింది.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీ-టు-ఈట్ ఆహారాలు… ప్రయోగశాలలలో సంశ్లేషణ చేసిన పదార్థాలతో తయారు చేస్తారు. వాటిలో హానికరమైన సమ్మేళనాలు చేరుతాయి. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఉండవు.

ఇవి క్రమంగా సాంప్రదాయ ఆహారాలు, తాజాగా తక్కువ ప్రాసెస్ చేసిన పదార్థాలతో తయారైన భోజనం స్థానంలోకి వచ్చేస్తున్నాయి.

పారిశ్రామిక ప్రాసెసింగ్ సమయంలో ఆహారాలలో మార్పులు, రంగులు, కృత్రిమ రుచులు, స్వీటెనర్లతో సహా కృత్రిమ పదార్ధాల వాడకం కారణంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ లో సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెర శాతం అధికంగా ఉంటోంది. ఇవి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

 

అధ్యయనం ఫలితాలు

మునుపటి అధ్యయనాలు ఆహార నమూనాలకు బదులుగా నిర్దిష్ట ఆహార ప్రమాద కారకాలపై దృష్టి సారించగా, ప్రస్తుత అధ్యయనం పారిశ్రామిక ఆహార ప్రాసెసింగ్ పరిధి, ఉద్దేశ్యాన్ని పరిగణనలోకి తీసుకుంది. వివిధ దేశాల నుండి జాతీయ ప్రాతినిధ్య ఆహార సర్వేలు, మరణాల డేటా సేకరించింది. ఆ నివేదిక ఆధారంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో అంచనా వేసింది.

ఇలాంటి ఆహారం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు, డిప్రెషన్ సహా 32 వేర్వేరు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది.

ప్రజలంతా అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార వినియోగాన్ని తగ్గించడం ప్రపంచ ప్రజా పోషకాహార ప్రాధాన్యతగా ఉండాలని ఈ అధ్యయనం చెబుతోంది.

కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్ తినడం మాని ఇంట్లో వండిన సాంప్రదాయపు వంటకాలనే తినడం ఆరోగ్యకరం. మీ ఆహారంలో నూనె, ఉప్పు తగ్గించుకుంటే చాలు ఎన్నో రకాల వ్యాధులు మీకు దూరంగా ఉంటాయి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024