బాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? స్ట్రీమింగ్ ఎక్కడంటే

Best Web Hosting Provider In India 2024

బాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? స్ట్రీమింగ్ ఎక్కడంటే

 

ఓటీటీ న్యూస్: డిఫరెంట్ క్యారెక్టర్స్ తో సాగిపోతున్న అజయ్ దేవ్‌గణ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘రైడ్ 2’. మే 1న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కలెక్షన్లలోనూ సత్తాచాటింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్, డేట్ పై ఆసక్తి నెలకొంది.

 
అజయ్ దేవ్‌గణ్, రితేష్ దేశ్ ముఖ్

‘రైడ్ 2’తో థియేటర్లలో సందడి చేస్తున్నారు అజయ్ దేవ్‌గణ్. ఆయన హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ మే 1న థియేటర్లకు వచ్చేసింది. మూవీపై పాజిటివ్ టాక్ తో మంచి బజ్ క్రియేట్ అయింది. రైడ్ మూవీకి సీక్వెల్ వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లలోనూ తన మార్క్ చూపించింది. ఈ ఫిల్మ్ ఏ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వివరాలు ఇవే.

 

ఆ ఓటీటీలోకి

రైడ్ 2 మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను మంచి ధరకు నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ మూవీస్ ఓటీటీలోకి రెండు నెలల తర్వాతే వస్తున్న సంగతి తెలిసిందే. రైడ్ 2 కూడా ఇదే బాటలో సాగే అవకాశముంది. అంటే ఈ మూవీ జూన్ లాస్ట్ లో లేదా జులై ఆరంభంలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రావొచ్చు. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు.

ఫస్ట్ డే కలెక్షన్స్

అజయ్ దేవ్‌గణ్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రైడ్ 2’ ఫస్ట్ డే కలెక్షన్లలో అదరగొట్టింది. ఇండియాలో ఈ మూవీ తొలి రోజు రూ.19.2 కోట్లు కలెక్ట్ చేసినట్లు సక్నిల్క్ పేర్కొంది. ఇది అజయ్ దేవ్‌గణ్ కెరీర్ లో నాలుగో బిగ్గెస్ట్ ఓపెనింగ్. సింగమ్ అగైన్ (రూ.43 కోట్లు), సింగమ్ రిటర్న్స్ (రూ.32.10 కోట్లు), గోల్ మాల్ అగైన్ (రూ.30.14 కోట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

2025లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో రైడ్ 2 మూడో స్థానంలో నిలిచింది. విక్కీ కౌశల్ ‘ఛావా’ (రూ.31 కోట్లు), సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ (రూ.26 కోట్లు) ఫస్ట్, సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి.

 

ఆ మూవీకి సీక్వెల్

2018లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘రైడ్’కు సీక్వెల్ గా ఇప్పుడు ‘రైడ్ 2’ ఫిల్మ్ వచ్చింది. ‘రైడ్’ మూవీని తెలుగులో రవితేజ హీరోగా ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. రైడ్ మూవీ రూ.140 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు రైడ్ 2లో అజయ్ దేవ్‌గణ్ మరోసారి యాక్టింగ్ ఇరగదీశారనే కామెంట్లు వస్తున్నాయి.

సిన్సియర్ ఇన్ కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ గా అజయ్ దేవ్‌గణ్ యాక్టింగ్ తో మెప్పించారు. ఇక రైడ్ 2లో రితేష్ దేశ్ ముఖ్ యాక్టింగ్ కూడా మరో లెవల్ లో ఉందనే టాక్ వినిపిస్తోంది. అవినీతి పవర్ ఫుల్ పొలిటీషియన్ గా రితేశ్ నటించారు. అజయ్, రితేశ్ మధ్య సాగే థ్రిల్లింగ్ కథ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. ఈ మూవీలో అరుణ్ దేవ్‌గణ్ భార్యగా వాణీ కపూర్ నటించారు. రాజ్ కుమార్ గుప్తా ఈ మూవీకి డైరెక్టర్.

 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024