Best Web Hosting Provider In India 2024

పవన్ కల్యాణ్ టైటిల్ తో యాంకర్ ప్రదీప్ మూవీ..ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ డ్రామా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్ మూవీ టైటిల్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో థియేటర్లలో అలరించాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. మరి కొన్ని రోజుల్లోనే స్ట్రీమింగ్ కాబోతోంది.
ఓ వైపు యాంకరింగ్ తో ఎంటర్ టైన్ చేస్తూనే మరోవైపు హీరోగా లక్ పరీక్షించుకుంటున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఆయన సెకండ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. పవన్ కల్యాణ్ ఫస్ట్ మూవీ టైటిల్ తో ప్రదీప్ ఈ మూవీ చేశాడు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన ఈ కామెడీ డ్రామా ప్రేక్షకులను బాగానే నవ్వించింది. కానీ ఓ మోస్తరు కలెక్షన్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి హీరో హీరోయిన్లుగా వచ్చిన మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలోకి ఈ మూవీ వచ్చేస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీ లో మే 8 నుంచి ఈ ఫిల్మ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఈటీవీ విన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
జబర్దస్త్ డైరెక్టర్స్
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీని ఒకప్పటి జబర్దస్త్ డైరెక్టర్లు నితిన్, భరత్ కలిసి తెరకెక్కించారు. ఈ మూవీకి స్టోరీని సందీప్ బొల్లా అందించారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు కీ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలోకి రాబోతోంది.
కథ ఏమిటంటే?
హైదరాబాద్‌లోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజీనిర్‌గా కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) పనిచేస్తుంటాడు. ఆంధ్ర-తమిళనాడు బార్డర్‌లోని ఓ గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ తన పనిచేస్తున్న కంపెనీకి వస్తుంది. దాంతో తన డ్రైవర్ (సత్య)తో కలిసి కృష్ణ ఆ ఊరికి వెళ్తాడు. అయితే, ఆ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటిని బట్టి ఆ ఊరిలోకి కొత్త వాళ్లను రానివ్వరు.
60 మందికి ఒక్క అమ్మాయి
కానీ, ప్రభుత్వ పని కావడంతో కొన్ని నిబంధనల మేరకు వారిని లోపలికి రాణిస్తారు. నిజానికి ఆ ఊరిలో 60 మంది కుర్రాళ్లు పెళ్లి చేసుకోడానికి ఏకైక అమ్మాయి రాజా (దీపిక పిల్లి) ఉంటుంది. రాజాను ఆ గ్రామానికి అదృష్ట దేవతగా భావిస్తారు. ఆ 60 మంది కుర్రాళ్లలో ఎవరో ఒకరిని రాజా వివాహం చేసుకోవాలని, ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తిని ప్రెసిడెంట్‌గా చేయాలని ఊరి వారంతా ముందే ఫిక్స్ అవుతారు.
ఇలాంటి సమయంలో రాజా, కృష్ణ మధ్య ప్రేమ ఎలా చిగిరించింది? వారి ప్రేమ గురించి తెలిసిన ఊరివాళ్ల రియాక్షన్ ఏంటీ? కృష్ణ, రాజా ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.