Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపకు సారీ చెప్పిన శ్రీధర్ – జ్యోత్స్నకు ఎదురుతిరిగిన దశరథ్ – సీన్ మొత్తం రివర్స్
కార్తీక దీపం 2 మే 2 ఎపిసోడ్‌లో దీప జైలు నుంచి రిలీజైన ఆనందాన్ని చెడగొట్టాలని శ్రీధర్ అనుకుంటాడు. కానీ అతడి ప్లాన్ రివర్స్ అవుతుంది. దీపను బాధపెట్టినందుకు శ్రీధర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని, లేదంటే చీపురుతో కొడతామని కార్తీక్, అనసూయ అతడికి వార్నింగ్ ఇస్తారు.
దీప జైలు నుంచి రిలీజ్ కావడంతో కాంచన, అనసూయతో పాటు కార్తీక్ ఆనందపడతాడు. శ్రీధర్ వారి సంతోషాన్ని చెడగొడతాడు. దీపకు వచ్చింది బెయిల్ మాత్రమే అంట, ఏ మాత్రం అటు ఇటు అయినా జైలుకు వెళ్లచ్చు అని పబ్లిక్ టాక్ వినిపిస్తుందని చెబుతాడు. జైలులో ఇలాగే తిక్కతిక్కగా మాట్లాడారని, కార్తీక్‌కు విడాకులు ఇస్తే వేరే పెళ్లి చేసుకుంటాడని దీపతో ఆ రోజు ఇలాగే అన్నారని కావేరి అసలు నిజం బయటపడుతుంది.
పెద్ద మనిషిగా సలహా ఇచ్చా…
దీపకు ఈ సలహా ఇచ్చిందా నువ్వా అని కార్తీక్ షాకవుతాడు. నీ కొడుకు పెళ్లాం దగ్గరకు వెళ్లి నీ మొగుడుకి విడాకులు ఇవ్వు…రెండో పెళ్లి చేస్తానని అనడానికి సిగ్గులేదా అని శ్రీధర్‌ను దులిపేస్తుంది అనసూయ. అందులో తప్పేం ఉందని శ్రీధర్ అంటాడు. దీపకు శిక్షకు పడితే కార్తీక్, శౌర్య పరిస్థితి ఏమిటి? అందుకే పెద్ద మనిషిగా మంచి సలహా ఇచ్చానని తన తప్పును సమర్థించుకుంటాడు.
నువ్వు నా కొడుకువి…
అదే నేను జైలులో ఉంటే ఇలాంటి సలహానే ఇస్తావా, దీపను మళ్లీ పెళ్లిచేసుకోమని అంటావా, భర్త కోసం ఎదురుచూడమని చెబుతావా అని తండ్రిని అడుగుతాడు కార్తీక్. నువ్వు నా కొడుకువి, నువ్వు బాగుంటే చాలని శ్రీధర్ సమాధానమిస్తాడు. నిన్ను ఏ చీపురు కట్టతో కొట్టాలో చెప్పు అని తండ్రిపై కార్తీక్ ఫైర్ అవుతాడు.
చీపురు కట్ట రెడీ…
ఇన్నాళ్లు మీ నాన్న అని వెనకడుగు వేశా…మీరు ఊ అనండి..చీపురు కట్ట రెడీగా ఉందని అనసూయ అంటుంది. అయితే ఇంకెందుకు లేటు తలో చీపురు కట్ట తీసుకొని నన్ను చావబాదండి అని తన్నులు తినడానికి శ్రీధర్ రెడీ అయిపోతాడు. తండ్రిగా నీ గురించి ఆలోచించడంలో నా స్వార్థం నాది, నేను మారనని ఇలాగే ఉంటానని శ్రీధర్ అంటాడు.
నా కోసం చచ్చిపోతుంది…
అసలే దీపకు నేనంటే ప్రాణమని, నా కోసం చస్తావా అంటే…మాట పూర్తవ్వకుండానే చచ్చేరకం…అలాంటి మనిషితో నువ్వు జీవితాంతం జైలులోనే ఉంటావని, నీ భర్తకు అన్యాయం జరుగుతుందని, విడాకులు ఇవ్వమంటే విడాకులు ఇవ్వదా అని తండ్రిపై కోప్పడుతాడు కార్తీక్. ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇచ్చిన సన్నాసి ఎవరని ఆ రోజే దీపను అడిగానని కార్తీక్ చెబుతాడు. ఇలాంటి సలహాలు ఇచ్చే వాళ్లను సన్నాసులు అనే అంటారని కాంచన అంటుంది.
శ్రీధర్ క్షమాపణలు…
మంచి సలహా ఇవ్వడం కోసం నేరం అయిపోయింది అని శ్రీధర్ సెటైర్లు వేస్తాడు. అందరూ శ్రీధర్‌పై విరుచుకుపడతారు. దీపను బాధపెట్టినందుకు శ్రీధర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని అందరూ పట్టుపడతారు. అనసూయ చీపురు పట్టుకొని సిద్ధమవుతుంది. నేను మూడు లెక్కపెట్టేలోపు శ్రీధర్ నోటి నుంచి సారీ అనే మాట రాకపోతే చీపురుకు పని చెప్పమని అనసూయతో కార్తీక్ చెబుతాడు. కార్తీక్‌ను ఆపబోతుంది దీప.
మీ అందరికి ఓ దండం…
నిజంగానే చీపురుతో అనసూయ కొడుతుందని భయపడిన శ్రీధర్…దీపకు సారీ చెప్పేస్తాడు. నాకేం వినపడలేదని కావేరి అంటుంది. అమ్మ దీప సారీ అని గట్టిగా అంటాడు శ్రీధర్. బుద్ది గడ్డి తిని ఆ రోజు అలా వాగానని అంటాడు. నోరు ఉంది కదా ఎలా పడితే అలా వాగితే చీపురు కట్టలు విరిగిపోతాయని అందరూ అంటారు. మీ అందరికి ఓ దండం అని భయంతో అక్కడి నుంచి జారుకుంటాడు శ్రీధర్.
నా వాళ్లే మీరు మీ వాళ్లందరికి శత్రువు అవుతున్నారని, అందరిని తానే కలుపుతానని దీప మనసులో అనుకుంటుంది.
దొంగ సాక్ష్యాలు సృష్టించి…
దీపపై తన కుటుంబ సభ్యుల మనసుల్లో ద్వేషాన్ని నింపే ప్రయత్నంలో ఉంటుంది జ్యోత్స్న.కార్తీక్‌ను సొంత బిడ్డలా చూసుకుంటే అతడే మనకు ఎదురుతిరిగాడని, దొంగ సాక్ష్యాలు సృష్టించి భార్యను జైలు నుంచి విడిపించాడని పారిజాతం అంటుంది. దీప తప్పు చేసిన అది కరెక్ట్ అని కార్తీక్ ఎలా సమర్థించగలుగుతున్నాడో అర్థం కావడం లేదని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ ఎన్ని తెలివితేటలు వాడిన దీప జైలుకు వెళ్లక తప్పదని శివన్నారాయణ కోపంగా చెబుతాడు.
గన్ పేలలేదు…
దీప పట్టుకున్న గన్‌లో బుల్లెట్ వేరు…నాకు తగిలిన బుల్లెట్ వేరు అయినప్పుడు దీప ఎలా జైలుకు వెళుతుందని దశరథ్ అంటాడు. అసలు దీప చేతిలో ఉన్న గన్ పేలలేదని చెబుతాడు. నన్ను కాల్చిన మనిషి దీప కాకుండా వేరే ఎవరో అయి ఉంటారని దశరథ్ అనుమానపడతాడు. నాన్ను కాల్చే అవసరం ఎవరికి ఉంది అంటే ఏం చెప్పగలం అని దశరథ్ చెబుతాడు.
సుమిత్ర, కాశీలపై ఎటాక్…
సుమిత్ర, కాశీలపై ఎటాక్ జరిగింది. వారిని ఎవరో చంపాలని చూశారు. పోలీస్ కేసు పెట్టినా చంపాలనుకున్నది ఎవరన్నది తెలియలేదని దశరథ్ అంటాడు. దశరథ్ మాటలతో పారిజాతం, జ్యోత్స్న కంగారు పడతాడు. దాసు పూర్తిగా కోలుకుంటాడని, అసలు నిజలు చెబుతాడనే నీ ఎదురుచూపులు ఎప్పటికీ నిజం కావని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది.
దీప, శౌర్యలను ఎవరో చంపబోయారు. దీప… జ్యోత్స్నపై నిందలు వేసింది. జ్యోత్స్న మన కళ్ల ముందే ఉంది కాబట్టి మనం దీప మాటలను నమ్మలేదు. దీప కావాలనే నాపై నిందలు వేసిందని జ్యోత్స్న అంటుంది. నింద అబద్ధమైనా ఎటాక్ మాత్రం నిజమే కదా దశరథ్ అంటాడు. ఆ తర్వాత నాపై ఎటాక్ జరిగిందని దశరథ్ అంటాడు.
దీపనే చంపబోయింది…
ఇవన్నీ చూస్తుంటే సుమిత్ర మీద, నా మీద ఎటాక్ చేసిన మనిషి ఒక్కరే అనిపిస్తుందని అంటాడు. దీప కాకుండా మనకు తెలిసిన మనుషులే మనల్ని చంపాలని చూసి ఉండొచ్చు కదా అని దశరథ్ అనడంతో పారిజాతం, జ్యోత్స్న కంగారు పడతారు. దశరథ్ మాటలను ఎవరు నమ్మరు. దీపనే ఈ మర్డర్ అటెంప్ట్ చేసిందని వాదిస్తారు.
కాల్చిన వాడు దొరుకుతాడు…
ఎవరు చేశారో పోలీసులు చెబుతారని, ఇప్పుడు బుల్లెట్ దొరికింది. ఆ తర్వాత కాల్చిన వాడు దొరుకుతాడు అని దశరథ్ అంటాడు. నన్ను కాల్చింది దీప కాకపోతే ఇంకెవరు అని దశరథ్ అనగానే జ్యోత్స్న ఉలిక్కిపడుతుంది. అది పారిజాతం గమనిస్తుంది.
ఆకలి మర్చిపోయి తిరిగాడు…
దీప జైలు నుంచి రిలీజ్ కావడంతో స్పెషల్‌గా వంటకాలు చేస్తుంది అనసూయ. దీప, కార్తీక్‌లకు వడ్డించబోతుంది. అనసూయను ఆపుతుంది శౌర్య. మా అమ్మనాన్నలకు నేను వడ్డిస్తానని అంటుంది. దీపను కాపాడటానికి కార్తీక్ ఆకలిని కూడా మర్చిపోయి తిరిగాడని, ఒక్కపూట కూడా పట్టెడన్నం తినలేదని అంటుంది. కార్తీక్, దీపలకు అన్నం వడ్డించిన శౌర్య తానే ముద్దలు కలిపి తినిపిస్తుంది. శౌర్య నోటిలో అన్నం ముద్ద పెట్టగానే దీప ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత శౌర్య కూడా కార్తీక్ తినిపిస్తాడు.
ప్రేమలు, అప్యాయతలు…
ఈ ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కడ దూరం అవుతాయోనని భయంగా ఉందని కాంచన అంటుంది. ఇక్కడ మనం ప్రశాంతంగా ఉంచనివాళ్లు చాలా మంది ఉన్నారని, మనం బాగుంటే వాళ్లు భరించలేరు…మనం కష్టాల్లో ఉంటే ఓదర్చేందుకు ఎదురుచూసేవాళ్లే ఎక్కువైపోయారని కాంచన అంటుంది. నువ్వేం మాట్లాడవని దీపను అడుగుతుంది శౌర్య. మనలను అభిమానించే వాళ్లు చుట్టుపక్కల ఉంటే ఏం మాట్లాడుతామని దీప అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.