Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి మే 2 ఎపిసోడ్: సీసీ కెమెరాతో నిజం తెలుసుకున్న రఘురాం- శ్రీరాజ్‌తో చంపించిన వరదరాజులు- చంద్రకళ ప్లాన్ లీక్!
నిన్ను కోరి సీరియల్ మే 2 ఎపిసోడ్లో డబ్బు ఎలా మాయమైందో తెలుసుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజ్ చూసిన రఘురాంకు అంతా చేసింది వరదరాజులే అని నిజం తెలుస్తుంది. ఆ విషయం చంద్రకళను కలిసి రఘురాం చెబుతాడు. ఆ మాటలు విన్న శ్రీరాజ్ తండ్రికి చెప్పడంతో చంపేయమని వరదరాజులు అంటాడు. రఘురాంను లారీతో గుద్దుతాడు శ్రీరాజ్.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో తమ ప్లాన్ గురించి వరదరాజులు, శ్రీరాజ్ మాట్లాడుకుంటారు. ఆ విరాట్ ఆవేశపరుడు కాబట్టి మనం వేసే ఎత్తుగడలు తెలియక మళ్లీ నీతో ఏదో విషయంలో గొడవ పడతాడు. కానీ, ఈసారి మనం సృష్టించే గొడవ ఎలా ఉండాలంటే చంద్రముందే విరాట్ నీ మీద చేయి చేసుకునేలా ఉండాలి. చంద్రే విరాట్‌ను తప్పు పట్టాలి. వాన్ని నిందించాలి. చంద్రే ఈ పెళ్లి వద్దేనేలా చేయాలి అని వరదరాజులు అంటాడు.
చంద్ర మనవైపు ఉన్నంతవరకే
వరదరాజులు మాటలను చంద్రకళ విని తెగ షాక్ అవుతుంది. మన ఊరిలో మనం చూసిన సంబంధమే చేసుకోవాలి. పోయిన మన పరువు నిలబెట్టుకోవాలి. నేను నాలా ఉండటమే కరెక్ట్ అని కుటుంబం అంతా అనుకోవాలి అని వరదరాజులు అంటాడు. ఏదోటి చేసి మళ్లీ విరాట్ నా మీద చేయి చేసుకునేలా చేస్తాను అని శ్రీరాజ్ అంటే.. ఏం చేసినా మన పథకం చంద్రకు తెలియొద్దు. తను మనవైపు ఉన్నంతసేపే ఆట మనది అని వరదరాజులు వెళ్లిపోతాడు.
ఇదంతా విన్న చంద్రకళ ఏడుస్తుంది. ఇంతపెద్ద మోసం చేస్తారనుకోలేదు. కలిసిన మనసులను విడగొట్టాలని చూస్తారా. ఇప్పుడు నేను విరాట్ బావకు, అత్తయ్యకు ఎలా ఈ విషయం చెప్పను. ఇదంతా నాటకం అని తెలిస్తే విరాట్ బావ ఆవేశపడతాడు. అత్తయ్య పెళ్లికి ఒప్పుకోదు. పెద్దనాన్నను నిలదీస్తే నిజం తెలిసిందని విరాట్ బావ వాళ్లకు హానీ కలిగేలా చేస్తాడు. ఎవరికి చెప్పిన గొడవే అవుతుంది అని సతమతం అవుతుంది చంద్రకళ.
ముందు శ్రీరాజ్ అన్నయ్య విరాట్ బావ రెచ్చగొట్టకుండా చూడాలి. వాళ్లకు అనుమానం రాకుండా పెద్దనాన్న వేసిన ప్లాన్లను తిప్పి కొట్టాలి. ఎంత పనిచేశావ్ పెద్దనాన్న. నీ పరువు కోసం కుటుంబాన్ని మోసం చేస్తావా అని అనుకుంటుంది చంద్రకళ. క్యాన్సిల్ అయిన కాంట్రాక్ట్‌ను తిరిగిరప్పించాలని చంద్రకళ బయలుదేరుతుంది. క్రాంతి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్న రఘురాం ఆలోచిస్తుంటాడు.
సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి
శ్రీరాజ్ ప్రవర్తన ముందు నుంచి తేడాగా ఉంది. క్రాంతి అన్నట్లు కావాలనే చేస్తున్నాడా అని జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటాడు రఘురాం. ఇదంతా ఆ రెండు కోట్ల మిస్ అయిన నుంచే మొదలైంది. ఇంట్లోంచి తీసుకొచ్చారు. మధ్యలో ఎక్కడ మారలేదు. మరి డబ్బు ఎక్కడ మాయమైనట్లు. సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి అని చూస్తాడు రఘురాం. కారులో నుంచి రూ. 2 కోట్లు తీసింది వరదరాజులు అని తెలుస్తుంది. దాంతో రఘురామ్ షాక్ అవుతాడు.
అంటే ఆరోజు వరదరాజులు బావ డబ్బే ఇవ్వలేదన్నమాట. ఇదంతా కావాలనే చేశాడు. కలుపుకోడానికి రాలేదు. పగతో వచ్చాడు. పాపం చంద్రను కూడా మోసం చేస్తున్నారు. ఈ విషయం జగదీశ్వరికి తెలిస్తే గుండె పగులుతుంది. వాళ్ల పూర్తి నాటకం ఏంటో తెలుసుకోవాలి. ఇది సున్నితంగా పరిష్కరించాలి. ముందు చంద్రతో మాట్లాడాలి అని కాల్ చేస్తాడు రఘురాం. అర్జంట్‌గా కలిసి మాట్లాడాలని రఘురాం అనడంతో చంద్రకళ సరేనంటుంది.
ముందు క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్‌ను కలిసి కాంట్రాక్ట్ వచ్చేలా చేయాలని వెళ్తుంది చంద్రకళ. అక్కడ శ్రీరాజ్ ఉంటాడు. పది లక్షలు మీరిస్తాను అన్నాక మీరు చెప్పింది చేయనా అని కాంట్రాక్టర్ అంటాడు. మొత్తానికి కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది. నా ఆలోచన ఫలించింది. ఇస్తానన్న పది లక్షలు అని కాంట్రాక్టర్‌కి శ్రీరాజ్ డబ్బు ఇస్తాడు. అదంతా చూసిన చంద్రకళ షాక్ అవుతుంది.
రోడ్డు మీదకు లాగే వరకు
విరాట్‌కు నాకు పాత లెక్కలు ఉన్నాయి. అవి తీరాలంటే తీరని నష్టాలు జరగాలి. ఆ విరాట్ గాడిని రోడ్డు మీదకు లాగకుండా ఉండను అని శ్రీరాజ్ అంటాడు. శ్రీరాజ్ వెళ్లిపోతాడు. అదంతా చూసిన చంద్రకళ ఇక కాంట్రాక్టర్‌కు చెప్పి లాభం లేదని వెళ్లిపోతుంది. గొడవలు జరగకుండా ఉండాలంటే నిజం దాచాలి. కానీ, నిజం దాచితే విరాట్ సర్ని మోసం చేసినట్లు అవుతుంది. ముందు మావయ్యను కలుద్దాం అని వెళ్తుంది చంద్రకళ.
రోడ్ మీద చంద్రకళ ఎదురుచూడటం చూసి కారు ఆపుతాడు శ్రీరాజ్. చంద్ర ఇక్కడ ఏం చేస్తుందని దగ్గరికి వెళ్తాడు. ఇంతలో రఘురాం వస్తాడు. అది చూసి శ్రీరాజ్ ఆగిపోతాడు. దారుణం జరుగుతోంది చంద్ర. మీ పెద్దనాన్న మారలేదు. మారినట్లు నటిస్తున్నాడు అంతే. పగతో వచ్చాడు అని సీసీ టీవీ ఫుటేజ్ గురించి చెబుతాడు. డబ్బున్న బ్యాగ్‌ను మార్చేశాడు అని రఘురాం చెబుతాడు.
అది విన్న చంద్ర షాక్ అవుతుంది. ఆ మాటలు శ్రీరాజ్ విని మరింత షాక్ అవుతాడు. దాంతో అక్కడి నుంచి శ్రీరాజ్ వెళ్లిపోతాడు. నాకు ఈ విషయం ఈరోజే తెలిసింది మావయ్య అని చెబుతుంది చంద్రకళ. మరోవైపు రఘురాంకి మనమే డబ్బు మార్చిందని, చెల్లిని పిలిచి నిజం చెప్పాడు అని వరదరాజులుకు కాల్ చేసి శ్రీరాజ్ చెబుతాడు. ఉదయం అన్నయ్య, పెద్దనాన్న మాట్లాడుకుంటే విన్నాను. ఎవరికి ఈ విషయం చెప్పాలో కుమిలిపోతున్నాను అని చంద్రకళ చెబుతుంది.
గొడవను వాళ్లే సృష్టించారు
జరిగిన ప్రతి గొడవను వాళ్లే సృష్టించారు. నన్ను ఒక పావులా వాడుకున్నారు. ద్వేషంతో నేను పెళ్లి క్యాన్సిల్ చేయాలని చూస్తున్నారు అని చంద్రకళ అంటుంది. చంద్రకు నిజం తెలియడం మనకు మంచిదికాదు. రఘురాం తప్పుడు సాక్ష్యాలు చూపిస్తున్నాడని చంద్రను మార్చు. రఘురాంను నమ్మొద్దని చెప్పు అని వరదరాజులు చెబుతాడు. కాంట్రాక్టర్ విషయం గురించి కూడా చంద్రకళ చెబుతుంది.
ఈ విషయం కూడా శ్రీరాజ్ వింటాడు. ఈ విషయం విరాట్ బావకు తెలిస్తే శ్రీరాజ్ అన్నయ్యను చంపేస్తాడు. అత్తయ్య మోసపోయానని కృంగిపోతుంది. ఎలా ఈ విషయాన్ని దాచుకోవడం అని చంద్రకళ అంటుంది. విరాట్ ఆవేశపడతాడు. కానీ, జగదీశ్వరికి నిజం చెప్పాలి. అత్తయ్యను కన్విన్స్ చేసి మీ పెళ్లి చేసేలా చేస్తాను. నిజం చెప్పాల్సిందే అని రఘురాం అంటాడు.
అది విని షాక్ అయిన శ్రీరాజ్ మన ప్లాన్ మొత్తం లీక్ అయిందని వరదరాజులుకు చెబుతాడు. చంద్రకళ, రఘురాం ప్లాన్ లీక్ అవుతుంది. చంద్రకళకు మొత్తం తెలిసిపోయింది. చంద్రకు పెళ్లి చేస్తానని రఘురాం అంటున్నాడు అని శ్రీరాజ్ అంటాడు. అయితే, వాడు ఇంటికి చేరుకోకూడదు. జగదీశ్వరికి నిజం తెలిస్తే చంద్ర పెళ్లి చేస్తుంది. మన పరువు పోతుంది. రఘురాం నోరు మూయిస్తే సరిపోతుంది. వాన్ని చంపేయ్ శ్రీరాజ్. అదొక్కటే మార్గం. వాడు పోతే విరాట్ పెళ్లి ఎలా చేస్తారు అని వరదరాజులు అంటాడు.
లారీతో గుద్దేసిన శ్రీరాజ్
ఏదో ఒకరోజు చంద్ర రివర్స్ అవుతుంది. అప్పుడు చేరదీయడానికి వాళ్లు ఉండకూడదు. వాడిది హత్యలా ఉండకూడదు. కర్మఫలితంలా ఉండాలి అని వరదరాజులు అంటాడు. నేను చూసుకుంటాను అని శ్రీరాజ్ కాల్ కట్ చేస్తాడు. నువ్వే మా ఇంటి పెద్దకోడలు. మాటిస్తున్నాను. వెంటనే వెళ్లి అత్తయ్యకు నిజం చెబుతాను అని రఘురాం అంటాడు. రఘురాంని లారీతో గుద్దుతాడు శ్రీరాజ్. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.