కుమ్మేసిన హిట్ 3.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? నాని కెరీర్ లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్!

Best Web Hosting Provider In India 2024

కుమ్మేసిన హిట్ 3.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? నాని కెరీర్ లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్!

హిట్ 3 ఫస్ట్ డే కలెక్షన్: ఫుల్ వైలెన్స్ మోడ్ లో థియేటర్లకు దూసుకొచ్చిన నాని అదరగొడుతున్నారు. హిట్ 3 మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనాలను అందుకున్నాయి. నాని కెరీర్ లో ఇది సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది.

హిట్ 3 మూవీలో నాని

అర్జున్ సర్కార్ ఐపీఎస్ గా నాని యాక్షన్ విశ్వరూపం చూపించారు. హిట్ 3 మూవీలో మునుపెన్నడూ లేని విధంగా ఫుల్ రక్తపాతంతో ఇంటెన్సివ్ యాక్షన్ సీన్స్ లో నాని ఇరగదీశారు. గురువారం (మే 1) థియేటర్లకు వచ్చిన ఈ మూవీపై మిక్స్ డ్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ మరింత బెటర్ గా ఉంటే బాగుండేదనే కామెంట్లు వస్తున్నాయి. అయితే రిలీజైన ఫస్ట్ రోజు మాత్రం హిట్ 3 కలెక్లన్ల దుమ్ము రేపింది. నాని కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది.

ఎన్ని కోట్లంటే

హిట్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడో మూవీ హిట్ 3. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాని, శ్రీనిధి శెట్టి, ప్రతీక్ స్మితా పాటిల్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీ ఫస్ట్ డే ఇండియాలో రూ.18 కోట్ల నెట్ కలెక్ట్ చేసిందని సక్నిల్క్ తెలిపింది. ఇది నాని కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం.

ఆ మూవీస్ ను దాటి

హిట్ 3 సినిమాకు 87.82% తెలుగు ఆక్యుపెన్సీ ఉండగా, మధ్యాహ్నం షోలో 92.37% ఆక్యుపెన్సీ నమోదైంది. తొలిరోజు రూ.23.2 కోట్లు కలెక్ట్ చేసిన దసరా (2023)కు నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్. హిట్ 3 ఆ మూవీకి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అయితే నాని సినిమాల్లో సరిపోదా శనివారం (రూ.9 కోట్లు), అంటే సుందరానికి (రూ.6.25 కోట్లు), హాయ్ నాన్న (రూ.4.9 కోట్లు) ఫస్ట్ డే కలెక్షన్లను హిట్ 3 దాటేసింది.

నాని గత చిత్రాలుఓపెనింగ్స్
దసరా (2023)రూ. 23.2 కోట్లు
సరిపోదా శనివారం (2024)రూ. 9 కోట్లు
అంటే సుందరానికి (2022)రూ. 6.25 కోట్లు
హాయ్ నాన్న (2023)రూ. 4.9 కోట్లు

అద్భుతమన్న నాని

హిట్ 3లో వీర లెవెల్ యాక్షన్ తో అదరగొట్టిన నాని ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ పట్ల థ్రిల్ అయ్యారు. నాని తన ఇన్ స్టాగ్రామ్ లో ‘ఇది బాక్సాఫీస్ వద్ద అద్భుతం’ అని రాసుకొచ్చాడు. ‘‘ఐ లవ్ యూ ఆల్. ఈ రోజు అర్జున్ వంతు వచ్చింది. ఇది నిజంగా చిరస్మరణీయం. ముందుకు, పైకి (హార్ట్ ఎమోజీ)’’ అని నాని పోస్టు చేశాడు.

కథ ఏమిటంటే?

హిట్ 3 లో ఎస్పీ అర్జున్ సర్కార్ (నాని) దేశవ్యాప్తంగా ఒకేలా జరిగే వరుస హత్యలను పరిష్కరించేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ హత్యల వెనుక ఉన్న మిస్టరీ సీరియల్ కిల్లర్ కంటే భయంకరమైంది. ఈ కేసులను సాల్వ్ చేసి, క్రిమినల్స్ ను నాని ఎలా మట్టికరిపించాడన్నది కథ. ఈ క్రైమ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రంలో శ్రీనిధి మృదులగా, ప్రతీక్ ఆల్ఫాగా నటించారు. లాస్ట్ లో తమిళ స్టార్ హీరో కార్తీ తళుక్కుమన్నారు. హిట్ 4లో ఆయన హీరోగా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024