ఎక్కిళ్లె పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. నిజాలు చెప్పే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లోని మరీ అంతగా సాంగ్ లిరిక్స్

Best Web Hosting Provider In India 2024

ఎక్కిళ్లె పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. నిజాలు చెప్పే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లోని మరీ అంతగా సాంగ్ లిరిక్స్

ఏడుస్తూ కూర్చుంటే ఏం సాధించలేం. చిరునవ్వుకు ఎలాంటి ఖర్చూ ఉండదు. ఇలాంటి నిజాలు చెప్పి, స్ఫూర్తి రగిలించేదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులోని మరీ అంతగా సాంగ్ లిరిక్స్. మీరు కూడా ఓ సారి పాడేయండి.

మరీ అంతగా సాంగ్ లో మహేష్ బాబు, వెంకటేష్ (youtube)

లెజెండరీ రైటర్ సిరివెన్నల సీతారామ శాస్త్రి రాసిన పాటలు ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం. జీవిత సత్యాలను తెలిపేవి కొన్నయితే.. స్ఫూర్తి రగిలించేవి మరికొన్ని. అలాంటి పాటే ఇదే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీలోని ‘మరీ అంతగా’ సాంగ్. నిజాలను చెప్పే ఈ సాంగ్ లిరిక్స్ మీకోసం.

సూపర్ హిట్

2013లో వచ్చిన మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సూపర్ హిట్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వెంకటేష్, మహేష్ బాబు బ్రదర్స్ గా యాక్ట్ చేశారు. ఇక రేలంగి మామయ్యగా ప్రకాశ్ రాజ్ ఐకానిక్ క్యారెక్టర్ ప్లే చేశారు. సమంత, అంజలి ఫీమేల్ లీడ్ గా నటించారు.

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలోని పాటలన్నీ హిట్ అయ్యాయి. ఇక సిరివెన్నెల రాసిన మరీ అంతగా సాంగ్ అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటోంది.

ఇదిగో లిరిక్స్

పల్లవి:

మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకోకల

పనేం తోచక పరేషానుగ గడబిడ పడకు అల

మతోయెంతగ శ్రుతే పెంచక విచారాల విల విల

సరే చాలిక అలా జాలిగ తిక మక పెడితే ఎల

కన్నీరై కురవాల మన చుట్టు ఉండే లోకం తడిసేలా

ముస్తాబే చెదరాల నిను చూడాలంటే అద్దం జడిసేలా

ఎక్కిళ్లె పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. కదా మరెందుకు గోల

అయ్యయ్యో పాపం అంటే ఎదో లాభం వస్తుందా వృథా ప్రయాస పడాలా

మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా

సరే చాలిక అలా జాలిగ తిక మక పెడితే ఎలా

చరణం1:

ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా చలినెటో తరిమేస్తామా చీ పొమ్మని

కస్సుమని కలహిస్తామ ఉస్సురని విలపిస్తామ రోజులతో రాజీ పడమ సర్లేమ్మని

సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం

పూటకొక పేచి పడుతు ఎం సాధిస్తామంటే ఎం చెబుతాం

ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోల

అయ్యయ్యో పాపం అంటే ఎదో లాభం వస్తుందా వృథా ప్రయాస పడాలా

చరణం 2:

చెమటలేం చిందించాల శ్రమపడేం పండించాల

పెదవిపై చిగురించేల చిరునవ్వులు

కండలను కరిగించాల కొండలను కదిలించాల చచ్చి చెడి సాధించాల సుఖశాంతులు

మనుషులని పించే రుజువు

మమతలను పెంచే రుతువు

మనసులను తెరిచే హితవు

వందెళ్ళయిన వాడని చిరునవ్వు

ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోల

అయ్యయ్యో పాపం అంటే ఎదో లాభం వస్తుందా వృథా ప్రయాస పడాలా

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024