





Best Web Hosting Provider In India 2024

తెనాలిలో దారుణం.. ప్రియుడి కోసం ప్రేమించి పెళ్లాడిన భర్తను హత్య చేయించిన భార్య..
తెనాలిలో దారుణ హత్య వెలుగు చూసింది. ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడి మోజులో హత్య చేయించిన భార్య ఉదంతం వెలుగు చూసింది. చెడు అలవాటు పడిన భార్య.. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించింది. మృతుడి తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగు చూసింది.
తెనాలిలో దారుణ హత్య వెలుగు చూసింది. ప్రేమించి పెళ్లాడిన భార్యే భర్తను బలి తీసుకుంది. దూరపు బంధువైన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు చివరకు ఆమె వల్ల ప్రాణాలు కోల్పోయాడు.
గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేయించిన భార్య చివరకు పోలీసులకు పట్టుబడింది. వివాహేతర సంబంధాన్ని వదులుకోలేక ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య చివరకు కటకటాల పాలైంది. కేసు వివరాలను తెనాలి త్రీ టౌన్ పోలీసులు గురువారం వివరించారు.
సీఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం తెనాలికి చెందిన వెంకటమణి పృథ్వీరాజ్ కు అతని దూరపు బంధువైన వెంకటలక్ష్మితో 5 ఏళ్ల క్రితం పెళ్లైంది. వెంకటలక్ష్మీ మొదటి భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ప్రధృీరాజ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు పిల్లలు లేరు.
కొద్ది నెలల క్రితం బెంగళూరు వెళ్లిన దంపతులు అక్కడ భవన నిర్మాణ పనిలో చేరారు. అక్కడ పనిచేస్తున్న పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన కోటేశ్వరరావుతో వెంకటలక్ష్మీకి పరిచయం అయ్యాడు. బెంగళూరులో భార్య ప్రవర్తన నచ్చక పోవడంతో పృథ్వీరాజ్ కొద్ది రోజులకే తెనాలి వచ్చేశాడు.
అక్కడే ఉండిపోయిన వెంకటలక్ష్మి కోటేశ్వరరావుల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడటంతో ఇద్దరు కలిసి నాలుగు నెలల క్రితం వెల్లటూరు వచ్చేశారు.
మూడు నెలలు ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ తర్వాత కోటేశ్వరరావు మద్యం తాగి వచ్చి ఆమెను కొడుతూ ఉండడంతో మార్చిలో అక్కడి నుంచి వచ్చేసింది. ఇన్నాళ్లు తాను పుట్టింటికి వెళ్లానని భర్తతో అబద్ధం చెప్పింది. వెల్లటూరు నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా కోటేశ్వరరావు వెంకటలక్ష్మికి ఫోన్లు చేస్తూ ఉండేవాడు.
దీంతో ఆమె భర్తకు అనుమానం రాకుండా అన్నయ్య అంటూ అతనితో మాట్లాడుతూ అప్పడప్పడు భర్తతో మాట్లాడించేది. వెంకటలక్ష్మీతో కలిసి ఉండాలనుకున్న కోటేశ్వరరావు తమకు అడ్డుగా ఉన్న పృథ్వీరాజ్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు వెంకటలక్ష్మీ కూడా అంగీకరించింది.
దీంతో కోటేశ్వరరావు, వెంకటలక్ష్మి గత నెల 27న హత్యకు ప్లాన్ చేశారు. కోటేశ్వరరావు, గుంటూరుకు చెందిన అతని బంధువు 19 సంవత్సరాల ఉదయ కిరణ్, అతని స్నేహితుడు గుంటూరుకే చెందిన ఆటో నడిపే 15 సంవత్సరాల బాలుడు ముగ్గురు కలిసి బస్సులో తెనాలి వచ్చారు.
పృథ్వీరాజ్‌కు ఫోన్ చేసి మల్లెపాడు శివారుకు పిలిపించారు. అక్కడే అందరూ కలిసి మద్యం తాగిన తర్వాత ముగ్గురు కలిసి ప్రధ్విరాజ్‌ను కత్తితో పొడిచి రాయితో మోది హత్య చేశారు. అనంతరం మృతుడి ఫోన్ తీసుకుని, అతని ఆటోలోనే పారిపోయారు.
కోడలిపై అనుమానంతో ఫిర్యాదుతో…
కుమారుడు హత్యపై కోడలిపైనే తమకు అనుమానం ఉందని ప్రథ్విరాజ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మృతుడి ఫోన్ కాల్ డేటా, వెంకట లక్ష్మీ కాల్ రికార్డ్స్ పరిశీలించారు. ఈ కేసులో మృతుడి భార్యతో పాటు మరో ముగ్గురి ప్రమేయం ఉందని గుర్తించారు.
నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పృథ్వీరాజ్ భార్యపై ప్రేమతో ఆమె పేరును చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. చివరకు ఆమె కారణంగానే ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచి వేసింది.
సంబంధిత కథనం
టాపిక్