ఎగ్ మంచూరియన్ ఇలా టేస్టీగా చేసేయండి, ఇంట్లో చేసే పద్ధతి ఇదిగో రెసిపీ అదిరిపోతుంది

Best Web Hosting Provider In India 2024

ఎగ్ మంచూరియన్ ఇలా టేస్టీగా చేసేయండి, ఇంట్లో చేసే పద్ధతి ఇదిగో రెసిపీ అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

ఎగ్ మంచూరియన్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఎందుకంటే కోడిగుడ్డుతో చేసిన వంటకాలు అన్ని రుచిగానే ఉంటాయి. ఇక్కడ మేము ఎగ్ మంచూరియన్ చాలా సులువుగా ఎలా ఇంట్లో చేయాలో ఇచ్చాము.

ఎగ్ మంచూరియన్ రెసిపీ (Dindigul food court/youtube)

కోడిగుడ్లతో చేసిన ఆహారాలు టేస్టీగా ఉండటమే కాదు ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. గుండె కళ్ళు, కండరాలు అన్నింటి అభివృద్ధికి గుడ్లు అవసరం.

కోడిగుడ్లను ఎప్పుడూ ఉడికించి తినడమూ, ఆమ్లెట్ వేసుకోవడం తినడం చేస్తే వాటి రుచి తెలియకపోవచ్చు. అప్పుడప్పుడు ఎగ్ మంచూరియన్ చేసుకొని చూడండి… వేడివేడిగా తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోనే దీన్ని సులభంగా చేసుకోవచ్చు.

బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ మంచూరియా దొరుకుతుంది. కానీ ఎగ్ మంచూరియన్ దొరకదు. కాబట్టి ఇంట్లోనే దీన్ని ఆరోగ్యకరమైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.

ఎగ్ మంచూరియా రెసిపీకి కావలసిన పదార్థాలు

కోడిగుడ్లు – మూడు

ఉప్పు – రుచికి సరిపడా

కారం – అర స్పూను

నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

పచ్చిమిర్చి – రెండు

ఉల్లిపాయలు – ఒకటి

రెడ్ చిల్లి సాస్ – ఒక స్పూను

సోయా సాస్ – ఒక స్పూన్

కార్న్ ఫ్లోర్ – మూడు స్పూన్లు

అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూను

నీళ్లు – తగినంత

మిరియాల పొడి – పావు స్పూను

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

టమాటా కెచప్ – ఒక స్పూను

ఎగ్ మంచూరియన్ రెసిపీ

1. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, మిరియాల పొడి, కొంచెం నీళ్లు వేసి చిక్కటి పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు గుడ్లను ఉడికించి పైన పొట్టు తీసి ముక్కలుగా కోసి గిన్నెలో ఉన్న మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.

4. అందులో కోడిగుడ్లను ముక్కలను వేసి రంగు మారేవరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

5. ఇప్పుడు మరొక కళాయిని తీసుకొని రెండు స్పూన్ల నూనె వేయాలి.

6. అందులో అల్లం వెల్లుల్లి పేస్టును వేయించాలి.

7. ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి కూడా వేసి వేయించుకోవాలి.

8. ఆ తర్వాత వెనిగర్, టమాటో కెచప్, సోయాసాస్, చిల్లీ సాస్ కూడా వేసి బాగా కలపాలి.

9. రెండు స్పూన్ల నీటిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ ముక్కలను వేసి టాస్ చేసుకోవాలి.

10. పైన కొత్తిమీర తరుగును చెల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి.

11. అంతే టేస్టీ ఎగ్ మంచూరియా రెడీ అయిపోయినట్టే.

12. దీన్ని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. తినేకొద్దీ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు క్రిస్పీగా ఉండే ఈ వంటకాన్ని ఇష్టపడతారు.

కోడిగుడ్డుతో చేసిన ఎగ్ మంచూరియా అప్పుడప్పుడు చేసుకొని తింటే కొత్తగా అనిపిస్తుంది. బయటకొనే చికెన్ మంచూరియన్ కన్నా ఇంట్లో చేసిన ఈ ఎగ్ మంచూరియానే మంచిది. ఎందుకంటే మీరు శుచిగా శుభ్రంగా చేసుకుంటారు. కాబట్టి ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్లు ఆహారంలో కలిసి అవకాశం వుండదు. వీలైనంత వరకు ఇక్కడ చెప్పినట్టు ఎగ్ మంచూరియన్ చేసేందుకు ప్రయత్నించండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/
Source / Credits

Best Web Hosting Provider In India 2024