టార్గెట్ 82 కోట్లు – వ‌చ్చింది 16 కోట్లు – నాని హిట్ 3 దెబ్బ‌కు కుదేలైన సూర్య‌ రెట్రో!

Best Web Hosting Provider In India 2024

టార్గెట్ 82 కోట్లు – వ‌చ్చింది 16 కోట్లు – నాని హిట్ 3 దెబ్బ‌కు కుదేలైన సూర్య‌ రెట్రో!

Nelki Naresh HT Telugu

సూర్య రెట్రో తొలిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద డిస‌పాయింట్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఫ‌స్ట్ డే 16 కోట్ల లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. రెట్రో తెలుగు వెర్ష‌న్‌కు గురువారం రోజు రెండు కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

రెట్రో కలెక్షన్స్

సూర్య ఫ్లాప్‌ల‌ ప‌రంప‌ర కొన‌సాగుతోంది. లేటెస్ట్ మూవీ రెట్రో మొద‌టిరోజే డిస‌పాయింట్ చేసింది. నాని హిట్ 3 వ‌ర‌ల్డ్ వైడ్‌గా మొద‌టిరోజు 38 కోట్ల నుంచి న‌ల‌భై కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ అందుకోగా…సూర్య రెట్రో మాత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి ఫ‌స్ట్ డే ప‌ద‌హారు కోట్ల‌తోనే స‌రిపెట్టుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. తెలుగులో హిట్ 3కి రెట్రో ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. సూర్య కెరీర్‌లో ఫ‌స్ట్ డే లోయెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా రెట్రో నిలిచింది.

82 కోట్లు టార్గెట్‌…

తెలుగులో రెట్రో ప్రీ రిలీజ్ బిజినెస్ తొమ్మిదిన్న‌ర కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. తెలుగులో ప‌ది కోట్లు, వ‌ర‌ల్డ్ వైడ్‌గా 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రెట్రో మూవీ రిలీజైంది. కంగువ త‌ర్వాత సూర్య కెరీర్‌లో హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా రెట్రో నిలిచింది.

తెలుగులో రెండు కోట్లు…

తొలిరోజు ప్రీమియ‌ర్స్ నుంచే నెగెటివ్ టాక్ రావ‌డంతో రెట్రో ఓపెనింగ్స్‌పై గ‌ట్టిగానే ప్ర‌భావం ప‌డింది. త‌మిళ‌నాడు మిన‌హా మిగిలిన రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మాత్రం సంద‌డి చేయ‌లేక‌పోయింది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల‌ గ్రాస్‌, కోటివ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది.

హిందీలో యాభై ల‌క్ష‌ల లోపే సూర్య మూవీకి వ‌సూళ్లు వ‌చ్చాయి. క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌ల‌లో కూడా మొద‌టి రోజు కోటి మార్కును కూడా ట‌చ్ చేయ‌లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. త‌మిళ‌నాడులో మాత్రం ఈ మూవీ 14 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది.

కంగువ కంటే త‌క్కువే…

తెలుగులో బ్రేక్ ఈవెన్ కావాంటే ఈ మూవీకి ఇంకో తొమ్మిది కోట్ల‌పైనే క‌లెక్ష‌న్స్ రావాల్సివుంది. రెండో రోజు బ‌ట్టే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌పై ఓ క్లారిటీ రానున్న‌ట్లు చెబుతోన్నారు. సూర్య గ‌త మూవీ కంగువ ఫ‌స్ట్ డే తెలుగులో ఆరు కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. కంగువ కంటే రెట్రో నాలుగు కోట్లు త‌క్కువే రెట్రోకు క‌లెక్ష‌న్స్ రావ‌డం గ‌మ‌నార్హం.

పూజా హెగ్డే హీరోయిన్‌…

రెట్రో మూవీకి కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో మ‌ల‌యాళం హీరో జోజు జార్జ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. ఈ మూవీని సూర్య‌తో క‌లిసి కార్తీక్ సుబ్బ‌రాజు స్వ‌యంగా నిర్మించాడు.

రెట్రో క‌థ ఇదే…

చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రుల‌కు దూర‌మ‌వుతాడు పారి. అత‌డిని తిల‌క్ అనే గ్యాంగ్‌స్ట‌ర్ ద‌త్త‌త తీసుకుంటాడు. పారిని సొంత కొడుకులా పెంచుతాడు. తిల‌క్ మాదిరిగానే పారి ఓ పెద్ద గ్యాంగ్‌స్ట‌ర్ అవుతాడు. రుక్మిణిని ప్రాణంగా ప్రేమించిన పారి…గ్యాంగ్‌స్ట‌ర్ లైఫ్‌ను వ‌దిలేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. పారి గ్యాంగ్‌స్ట‌ర్ అనే నిజం తెలిసి అత‌డికి దూరం వెళ్లిపోతుంది రుక్మిణి. ఆ త‌ర్వాత ఏమైంది? తిల‌క్‌కు పారి ఎదురుతిర‌గ‌డానికి కార‌ణం ఏమిటి? పారి, రుక్మిణి పెళ్లిని తిల‌క్ ఎందుకు అడ్డుకున్నాడు? గోల్డ్‌ఫిష్ డీల్ వెనుక క‌థేమిటి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024