




Best Web Hosting Provider In India 2024

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన కన్నడ సూపర్‌హిట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ – ఊహలకు అందని మలుపులతో…
కన్నడ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కాలపత్తర్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. విక్కీ వరుణ్ హీరోగా నటిస్తూ ఈ కన్నడ మూవీకి దర్శకత్వం వహించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.8 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
కన్నడ సూపర్ హిట్ మూవీ కాలాపత్తర్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. విక్కీ వరుణ్ హీరోగా నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ధన్యరామ్‌కుమార్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో టీఎస్ నాగభరణ, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.
పాజిటివ్ టాక్…
2024 సెప్టెంబర్‌లో థియేటర్లలో రిలీజైన కాలపత్తర్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. 2022లోనే షూటింగ్‌ను పూర్తిచేసుకున్న మూవీ అనివార్య కారణాల వల్ల వాయిదాపడుతూ 2024లో రిలీజైంది.
విగ్రహ రాజకీయాలు…
విగ్రహాలపై రాజకీయాలు ఎలా ఉంటాయి? రాజకీయ ఎత్తుగడల కారణంగా పల్లెటూళ్లలో ఎలాంటి విధ్వేషాలు చెలరేగుతున్నాయనే మెసేజ్‌ను ఈ మూవీ ద్వారా చూపించారు దర్శకుడు.
సైనికుడిగా…
శంకర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో వంట మనిషిగా పనిచేస్తుంటాడు. సైనికుడిగా దేశం కోసం పోరాడాలని కలలు కంటుంటాడు. ఓ రోజు టెర్రరిస్ట్‌లు చేసిన మెరుపు దాడిని ధైర్యంగా తిప్పికొడతాడు శంకర్. అతడి ధైర్యాన్ని, తెగువను మెచ్చుకున్న ఆర్మీ అధికారులు… శంకర్‌కు ప్రమోషన్ ఇస్తారు. ఆర్మీ నుంచి వచ్చిన శంకర్‌కు ఊరివాళ్లు ఘనంగా స్వాగతం పలుకుతారు. శంకర్ విగ్రహాన్ని ఊరిలో ఏర్పాటుచేయలని నిర్ణయించుకుంటారు. ఆ విగ్రహం వల్ల ఊరిలో ఎలాంటి గొడవలు జరిగాయి? ఊరి సమస్యలపై శంకర్ ఎలాంటి పోరాటం చేశాడు? తాను ప్రేమించిన గంగను శంకర్ పెళ్లిచేసుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
8.8 రేటింగ్…
కాలపత్తర్ మూవీ ఐఎమ్‌డీబీలో 8.8 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. కమర్షియల్‌గా ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కన్నడంలో గత ఏడాది రిలీజైన బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.
కన్నడంలో హీరోగా…
దర్శకుడిగా విక్కీ వరుణ్‌కు ఇదే మొదటి మూవీ. గతంలో హీరోగా కన్నడంలో కాలేజీ కుమార్, కడ్డీపూడి, కెండసంపిగే అనే సినిమాలు చేశాడు విక్కీ వరుణ్. ధన్యరామ్‌కుమార్ హైడ్ అండ్ సీక్, ది జడ్జ్‌మెంట్‌తో పాటు మరికొన్ని కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
సంబంధిత కథనం