





Best Web Hosting Provider In India 2024

హంగర్ కామెడీ కాన్సెప్ట్‌తో బకాసుర రెస్టారెంట్ – హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ కమెడియన్ – ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ కమెడియన్ ప్రవీణ్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. బకాసుర రెస్టారెంట్ పేరుతో ఓ హారర్ కామెడీ మూవీ చేస్తోన్నాడు. శుక్రవారం ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. బుకాసుర రెస్టారెంట్‌లో వైవా హర్ష, షైనింగ్ ఫణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టాలీవుడ్ కమెడియన్ ప్రవీణ్ త్వరలోనే బకాసుర అనే పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. నటుడిగా బిజీగా ప్రవీణ్ హోటల్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం అందరిలో ఆసక్తిని కలిగించింది. తాజాగా ఈ వార్తలపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రవీణ్ ఎటువంటి రెస్టారెంట్‌ను పెట్టడం లేదు.. బకాసుర రెస్టారెంట్ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ శుక్రవారం రిలీజైంది
ఫస్ట్ లుక్ రిలీజ్…
. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రవీణ్ పెద్ద గరిటెతో వంట చేస్తుండటం.. ఆ పక్కనే విచిత్రమైన ఆకారాలతో వైవా హర్ష, షైనింగ్ ఫణి కనిపించడం ఆసక్తిని పంచింది. పోస్టర్‌లోని పాతకాలం నాటి బంగళా, మర్రిచెట్టు చూస్తుంటే సినిమాలో కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బకాసుర మూవీతో ప్రవీణ్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ మూవీలో బకాసురగా టైటిల్ రోల్‌లో వైవా హర్ష కనిపిస్తున్నాడు. కృష్ణభగవాన్ , కేజీఎఫ్ గరుడరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి ఎస్‌జే శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
షూటింగ్ కంప్లీట్…
బకాసుర షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమాను థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ” హంగర్ కామెడీ అనే కొత్త కాన్సెప్ట్‌తో బకాసుర మూవీని తెరకెక్కిస్తున్నాం. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా తెలుగు ఆడియెన్స్‌ను ఈ మూవీ మెప్పిస్తుంది. నవ్విస్తూనే థ్రిల్‌ను పంచుతుంది. ప్రవీణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా బకారసుర నిలుస్తుంది. నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారు అని పేర్కొన్నారు.
కమెడియన్‌గా…
ఈ మూవీలో శ్రీకాంత్ అయ్యంగార్, ఉప్పెన జయకృష్ణ, వివేక్ దండు,, రమ్య, ప్రాచీ ఠాకూర్, జబర్థస్త్ అప్పారావు ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీకి వికాస్ బాడిస మ్యూజిక్ అందిస్తోన్నాడు.
తెలుగులో రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథమ్, ప్రేమకథా చిత్రమ్‌తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్‌గా కనిపించాడు ప్రవీణ్, గోదావరి యాసలో ప్రవీణ్ వేసే పంచ్‌లు, ప్రాసలు పలు సినిమాల్లో హిలేరియస్‌గా తెలుగు ప్రేక్షకులను నవ్వించాయి.
సంబంధిత కథనం