




Best Web Hosting Provider In India 2024

కాఫీ వాసన అంటే మీకు ఇష్టమా? అయితే కాఫీ బీన్స్‌తో రూం ఫ్రెషనర్ తయారు చేసుకోండి!
DIY కాఫీ ఎయిర్ ఫ్రెషనర్: ఇంట్లో కెమికల్స్‌తో నిండిన ఎయిర్ ఫ్రెషనర్స్ వాడటం ఇష్టం లేదా? అయితే తియ్యటి కాఫీ వాసనతో కూడిన ఎయిర్ ఫ్రెషనర్ తయారు చేసుకోండి. ఇవి ఇంటిని మంచి సువాసనతో నింపడం మాత్రమే కాదు, నెగెటివిటీని, దోమలనీ కూడా దూరం చేస్తాయి.
ఇంట్లో కిటికీలు, తలుపు చాలా కాలంగా మూసి ఉండటం వల్ల కొన్ని సార్లు ఇబ్బందికరమైన వాసనలు రావొచ్చు. లేదా సహజంగానే వెంటిలేషన్ తక్కువగా ఉన్న ఇళ్లలోనూ తాజా గాలి చొరబడక దుర్వాసనలు రావొచ్చు. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్ ఉన్న గదుల్లో ఇటువంటి వాసనలు వచ్చే అవకాశం ఎక్కువ. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్‌గా ఉండి తాజా వాసనలు లేక అసౌర్యంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు రోజంతా ఎయిర్ కండిషనర్ వేసుకోవడం అసాధ్యం. అలాంటి సమయాల్లో మూసి ఉన్న గదిలో వాసనలు పీల్చుకోవడం కంటే బయట కూర్చోవడమే బెటర్ అనిపిస్తుంది. కానీ, వాతావరణంలో ఉష్ణోగ్రతలు గదిలోకి వెళ్లాల్సిందేనని భయపెడుతుంటాయి. అలాంటప్పుడు వాసనల ద్వారా కలిగే సమస్యల నుంచి పరిష్కారాన్ని ఇంటి చిట్కాలతో పొందొచ్చు.
గదిలో వచ్చే దుర్వాసనలను తొలగించడానికి కాఫీని ఉపయోగించవచ్చు. కాఫీ సహజ డీయోడరైజర్ గా పనిచేస్తుంది. దీని సహాయంతో మీ గదులే కాదు. కారు, పర్సు, ఇతర వస్తువుల నుండి వచ్చే దుర్వాసనను కూడా తొలగించవచ్చు. ఇంకెందుకు లేటు.. కాఫీతో ఎయిర్ ఫ్రెషనర్ ఎలా తయారు చేయాలా అని ఆలోచిస్తున్నారా.. రండి తెలుసుకుందాం.
కాఫీతో ఎయిర్ ఫ్రెషనర్ తయారు చేసే విధానం
కాఫీ పౌడర్‌ను చిన్న కుండలో వేయండి. దానితో పాటు దాల్చిన చెక్క ముక్కలు రెండింటిని వేసి వాటితో పాటు నారింజ నూనె కలపండి. ఇప్పుడు ఈ కుండను అలంకార దీపం మీద లేదా ఏదైనా సేఫ్ ప్లేస్‌లో ఉంచి వెలిగించండి. ఉంచండి. కాసేపటికే కాఫీ పౌడర్ వేడెక్కి నూనె విడుదల అవుతుంది. సహజంగానే సువాసన వెదజల్లే కాఫీ పౌడర్.. వేడి చేయడం వల్ల మరింత వేగంగా ఇంటి అంతటా కాఫీ వాసన వ్యాపిస్తుంది.
లవంగాలు, కాఫీతో నెగెటివిటీని తొలగించే ఎయిర్ ఫ్రెషనర్ తయారు చేయడం
కాఫీతో వచ్చే సువాసనతో మీలో ఉన్న నెగెటివ్ ఆలోచనలను కూడా తరిమేయొచ్చు. అదెలా అంటే, ఒక కుండ తీసుకుని అందులో రెండు లేదా మూడు కర్పూరం గోళీలు, నాలుగు లేదా ఐదు లవంగాలు వేయండి. ఇప్పుడు అందులో కాఫీ పౌడర్ వేసి దీపం మీద లేదా కాస్త సెగ తగిలే ప్రదేశంలో ఉంచండి. ఇవి మండుతుండటం వల్ల వేడిని పొంది వాసన ఇంటి అంతటా వ్యాపిస్తుంది. దీనిలో కాస్త దాల్చిన చెక్క పౌడర్ కూడా కలుపుకుని వేడి చేస్తే దోమలు పారిపోవడానికి కూడా సహాయపడుతుంది.
నిమ్మకాయ, కాఫీ వాసనతో కూడిన ఫ్రెషనర్
అదే విధంగా, చిన్న గిన్నెలో కాఫీ పౌడర్, నిమ్మరసం, వెనీలా ఎస్సెన్స్ మూడు నుండి నాలుగు చుక్కలను కలపండి. ఇప్పుడు ఆ గిన్నెను వేడి తగిలే ప్రదేశంలో లేదా ఏదైనా హోమ్ డెకార్ లాంప్ మీద ఉంచండి. దీనికి వేడి తగులుతుండటం వల్ల వాసన గది మొత్తం వ్యాపిస్తుంది. గది సువాసనాభరితంగా మారిపోతుంది.
పాట్ పూరీ తయారు చేయడం
కాఫీ గ్రౌండ్‌ను మళ్ళీ వేడి చేసి చిన్న చిన్న క్లాత్ పాకెట్లలో నింపండి. మార్కెట్లో సులభంగా నెట్ పాకెట్లు దొరుకుతాయి. వీటిని మీరు పర్సు, వార్డ్రోబ్ వంటి ప్రదేశాలలో ఉంచుకోండి. కాఫీ వాసనతో దుర్వాసన తొలగిపోతుంది.