తెలుగులోకి వ‌స్తోన్న త‌మిళ డార్క్ కామెడీ మూవీ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ – శ‌వంతో బ్యాంకు స్కామ్ – న‌వ్విస్తూనే థ్రిల్

Best Web Hosting Provider In India 2024

తెలుగులోకి వ‌స్తోన్న త‌మిళ డార్క్ కామెడీ మూవీ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ – శ‌వంతో బ్యాంకు స్కామ్ – న‌వ్విస్తూనే థ్రిల్

Nelki Naresh HT Telugu

ప్ర‌భుదేవా హీరోగా న‌టించిన త‌మిళ మూవీ జాలీ ఓ జింఖానా తెలుగులోకి వ‌స్తోంది. నేరుగా ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీలో మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, అభిరామి కీల‌క పాత్ర‌లు పోషించారు.

జాలీ ఓ జింఖానా తెలుగు ఓటీటీ

ప్ర‌భుదేవా హీరోగా న‌టించిన త‌మిళ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ జాలీ ఓ జింఖానా తెలుగులోకి వ‌స్తోంది. థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జాలీ ఓ జింఖానా మూవీ తెలుగు పోస్ట‌ర్‌ను ఆహా ఓటీటీ అభిమానుల‌తో పంచుకున్న‌ది. త్వ‌ర‌లోనే ఈ మూవీ ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. జాలీ ఓ జింఖానా త‌మిళ వెర్ష‌న్ కూడా ఆహా ఓటీటీలోనే అందుబాటులో ఉంది.

మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్‌…

జాలీ ఓ జింఖానా మూవీలో ప్రేమ‌మ్ ఫేమ్ మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. అభిరామి, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ కామెడీ థ్రిల్ల‌ర్‌ మూవీకి శ‌క్తి చిదంబ‌రం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది నెలాఖ‌రున థియేట‌ర్ల‌లో రిలీజైన జాలీ ఓ జింఖానా మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో పాటు ప్ర‌భుదేవా, మ‌డోన్నా సెబాస్టియ‌న్ కామెడీ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ను మిగిల్చింది. విజ‌య్ బీస్ట్ మూవీలోని జాలీ ఓ జింఖానా అనే పాట నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ మూవీకి టైటిల్‌ను ఫిక్స్ చేశారు. .

మ‌ర్డ‌ర్ కేసులో…

తాంగ‌సామి త‌న కూతురు చెల‌మ్మ‌, (అభిరామి) మ‌న‌వ‌రాళ్లు భ‌వానీ, య‌జానీ, శివానీ(మ‌డోన్నా సెబాస్టియ‌న్‌) తో క‌లిసి ఓ బిర్యానీ సెంట‌ర్ న‌డుపుతుంటాడు. అనుకోకుండా లోక‌ల్ ఎమ్మెల్యేతో చెల్లమ్మ గొడ‌వ‌ప‌డుతుంది. తాంగ‌సామిని ఆ ఎమ్మెల్యే మ‌నుషులు కొట్ట‌డంతో హాస్పిట‌ల్ పాల‌వుతాడు. ఎమ్మెల్యేపై చ‌ట్ట ప్ర‌కారం పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న చెల్ల‌మ్మ, ఆమె కూతుళ్లు ఓ లాయ‌ర్‌(ప్ర‌భుదేవా)ను క‌లుస్తారు.

అనుకోకుండా భ‌వానీ, శివానీతో ఆమె ఫ్యామిలీ ఓ మ‌ర్డ‌ర్ చేస్తారు. ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు శ‌వాన్ని బ‌తికున్న వ్య‌క్తిగా న‌మ్మిస్తారు. అస‌లు వారు హ‌త్య చేసింది ఎవ‌రిని? బ్యాంకును బురిడి కొట్టించి ప‌దికోట్లు ఎలా దోచుకున్నారు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ప్రేమ‌మ్ మూవీతో…

మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ప్రేమ‌మ్‌లో సాయిప‌ల్ల‌వి, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో పాటు మ‌రో హీరోయిన్‌గా న‌టించింది మ‌డోన్నా సెబాస్టియ‌న్‌. ప్రేమ‌మ్ త‌ర్వాత త‌మిళ‌, మ‌ల‌యాళంతో పాటు తెలుగులో కొన్ని సినిమాలు చేసింది మ‌డోన్సా సెబాస్టియ‌న్‌. కానీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, సాయిప‌ల్ల‌వి స్థాయిలో గుర్తింపును మాత్రం సొంతం చేసుకోలేక‌పోయింది. ప‌రాజ‌యాల కార‌ణంగా కెరీర్‌లో వెనుక‌బ‌డిపోయింది. తెలుగులో ప్రేమ‌మ్‌తో పాటు నాని శ్యామ్‌సింగ‌రాయ్‌లో న‌టించింది. ద‌ళ‌ప‌తి విజ‌య్ లియోతో పాటు మ‌రికొన్ని త‌మిళ సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేసింది.

మ‌ల్టీ టాలెంటెడ్‌…

హీరో, డైరెక్ట‌ర్‌, కొరియోగ్రాఫ‌ర్‌…ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ మ‌ల్టీటాలెంటెడ్‌గా పేరుతో ప్ర‌భుదేవా. కొన్నాళ్లుగా యాక్టింగ్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతోన్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భుదేవా న‌టిస్తోన్న ఆరు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024