




Best Web Hosting Provider In India 2024
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. సిట్ కస్టడీకి రాజ్ కసిరెడ్డి.. ఈనెల 8వ తేదీ వరకు విచారణ
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా.. ప్రధాన పాత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 8వ తేదీవరకు ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. రాజ్ కసిరెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టేలా సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. ఆయన్ను జైలు నుంచి విచారణ నిమిత్తం సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయన్ను విచారణ కోసం సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లారు.
ఉదయం 8 నుంచి సాయంత్ర 6 వరకు..
గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో అన్నీ తానై వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజులపాటు సిట్ కస్టడీకి ఇస్తూ.. విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయన్ను శుక్రవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకూ సిట్ కస్టడీకి అప్పగించింది. రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆరోపణలు, అభియోగాలు ఇవీ..
మద్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డారు.
సిండికేట్‌గా ఏర్పడి మద్యం వ్యాపారంలో గుత్తాధిపత్యం సాధించారు.
మద్యం ధరలను పెంచడంలో కీలక పాత్ర పోషించారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు.
అక్రమ మద్యం అమ్మకాల ద్వారా.. భారీగా డబ్బులు సంపాదించారు.
ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేశారు.
మద్యం విధానాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు.
రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అక్రమాలకు పాల్పడ్డారు.
ఇతరులతో కలిసి సిండికేట్‌గా ఏర్పడి అక్రమాలకు పాల్పడ్డారు.
మిథున్ రెడ్డిపై..
2019-24 మధ్య ఎంపిక చేసిన సంస్థల బ్రాండ్ల మద్యం మాత్రమే అమ్ముడయ్యేలా చేసి.. కొందరు నాయకులు ముడుపులుగా దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్రధారి అని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
మద్యం తయారు చేసేది, దాన్ని ఏపీఎస్బీసీఎల్ తో కొనుగోలు చేయించింది మిథున్ రెడ్డేనని ఫిర్యాదులు ఉన్నాయి.
ఈ స్కామ్ వెనక పెద్ద పెద్ద నేతల హస్తం ఉందని అనుమానిస్తున్నారు.
నాసిరకం మద్యం అమ్మడంతో పాటు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు రాకుండా దారి మళ్లించారనే అభియోగాలు ఉన్నాయి.
రాజ్ కసిరెడ్డికి చెందిన అదాన్ డిస్టిలరీ, డికార్ట్ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎంతమేర కొనుగోళ్లు చేసింది అనే దానిపై మిథున్ రెడ్డిని ప్రశ్నించారు.
రాజ్ కసిరెడ్డి, ఆయన అనుచరులు చాణక్య రాజ్, అవినాష్ రెడ్డిలతో మిథున్ రెడ్డికి ఉన్న సంబంధాలు, ఇతర ఆర్థిక లావాదేవీలపై సిట్ అధికారులు ప్రశ్నించారు.
అయితే.. కొన్ని ప్రశ్నలకు మిథున్ రెడ్డి సమాధానాలు దాటవేశారని సమాచారం.
సంబంధిత కథనం
టాపిక్