




Best Web Hosting Provider In India 2024

ఏపీ పాలిసెట్ – 2025 ప్రవేశాలు – ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలపై తాజా అప్డేట్ ఇదే
ఏపీ పాలిసెట్ 2025 పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఎగ్జామ్ పూర్తి కాగా… మే 10వ తేదీ తర్వాత ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
ఏపీ పాలిసెట్ – 2025 పరీక్ష ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాల విడుదలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. మే 10వ తేదీ తర్వాత రిజల్ట్స్ ను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఫలితాలతో పాటే ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లోని వివిధ ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ 2025 పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,749 మంది పరీక్ష రాశారు. ఇందుకు 89 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇవాళ ప్రాథమిక కీ విడుదల…!
ఏపీ పాలిసెట్ 2025 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ ఇవాళ(మే 2) అందుబాటులోకి రానుంది. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు. అధికారిక వెబ్ సైట్ లోకి వెెళ్లి కీని పొందవచ్చు.
ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్ ను 120 మార్కులకు నిర్వహించారు. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. వీటే ఆధారంగానే సీట్లను కేటాయిస్తారు.
ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలి:
- విద్యార్థులు ఏపీ పాలిసెట్ – 2025 అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఇక్కడ పాలిసెట్ – 2025 రిజల్ట్స్ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ తో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ మార్కులతో పాటు ర్యాంక్ వివరాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ పాలిసెట్ ప్రాథమిక కీతో పాటు ఫలితాల అప్డేట్ తెలుసుకోవచ్చు….
టాపిక్