నీట్ పేపర్ లీక్ అంటూ తప్పుడు ప్రచారం.. 120పైగా ఇన్‌స్టా, టెలిగ్రామ్ ఛానళ్లపై చర్యలు!

Best Web Hosting Provider In India 2024


నీట్ పేపర్ లీక్ అంటూ తప్పుడు ప్రచారం.. 120పైగా ఇన్‌స్టా, టెలిగ్రామ్ ఛానళ్లపై చర్యలు!

Anand Sai HT Telugu

నీట్ యూజీ పరీక్ష మే 4న జరగనుంది. అయితే మరోవైపు పేపర్ లీకేజీకి సంబంధించి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న 120పైగా ఖాతాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) చర్యలు చేపట్టింది.

ప్రతీకాత్మక చిత్రం (Pixabay)

వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీకి సంబంధించి అసత్యాలు ప్రచారం అవుతున్నాయి. ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సోషల్ మీడియా ఛానళ్లపై ఎన్టీఏ చర్యలు చేపట్టింది. నీట్ యూజీ పరీక్ష మే 4న జరగనుంది. 550 నగరాల్లో 5 వేలకు పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కొంతమంది పేపర్ లీకేజీకి సంబంధించి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారు. ఇలాంటి 120పైగా ఖాతాలను ఎన్టీఏ గుర్తించింది. ఈ మేరకు కేసులు కూడా నమోదు అయ్యాయి.

ఇలా సమాచారం ఇవ్వొచ్చు

కొత్తగా ప్రారంభించిన అనుమానాస్పద క్లెయిమ్స్ రిపోర్టింగ్ పోర్టల్(https://neetclaim.centralindia.cloudapp.azure.com/) ద్వారా తమకు సమాచారం అందిందని ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. పరీక్షకు సంబంధించిన నకిలీ స్టేట్‌మెంట్స్ ఫార్వర్డ్ చేస్తున్న 106 టెలిగ్రామ్ ఛానళ్లు, 16 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ఎన్టీఏ గుర్తించింది. తప్పుడు సమాచారంపై అణచివేతలో భాగంగానే ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్షకు ముందు అభ్యర్థులను తప్పుదోవ పట్టించి భయాందోళనలు సృష్టించడమే ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉద్దేశంగా కనిపిస్తుంది.

అడ్మిన్లపై చర్యలు

నీట్ యూజీ 2025 ప్రశ్నాపత్రం అందుబాటులో ఉందని ఈ ఛానళ్లు తప్పుడు ప్రచారం చేసి విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ కేసులన్నింటినీ కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ)కు రిఫర్ చేశారు. అందుకే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ఈ ఛానళ్లను తక్షణమే తొలగించాలని టెలిగ్రామ్, ఇన్‌స్టాకు కూడా ఆదేశాలు వెళ్లాయి. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ గ్రూపుల వెనక ఉన్న అడ్మిన్ల వివరాలను పంచుకోవాలని ఎన్టీఏ తెలిపింది.

ఏప్రిల్ 26న ప్రారంభించిన క్లెయిమ్స్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఇప్పటికే 1,500 కంటే ఎక్కువ సబ్మిషన్లు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం టెలిగ్రామ్ ఆధారిత నకిలీ లీక్ క్లెయిమ్‌లతో ముడిపడి ఉన్నాయి.

Anand Sai

eMail

టాపిక్


Best Web Hosting Provider In India 2024


Source link