





Best Web Hosting Provider In India 2024

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్: తెలుగులో నంబర్ వన్ సీరియల్ మళ్లీ మారింది.. టాప్ 4లో హోరాహోరీ.. వారం వారం మారుతూ..
స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. మరోసారి నంబర్ వన్ సీరియల్ హోదా చేతులు మారింది. వారం వారం రేటింగ్స్ మారుతూ.. టాప్ 4లో హోరాహోరీ నెలకొంది. అయితే కార్తీకదీపం వరుసగా మూడో వారం కూడా మళ్లీ అగ్రస్థానాన్ని అందుకోలేకపోయింది.
తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ప్రతి వారం తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా టాప్ 4లో ఉన్న సీరియల్స్ స్థానాలు మారిపోతూ ఉన్నాయి. తాజాగా 16వ వారం రేటింగ్స్ లో గుండెనిండా గుడిగంటలు సీరియల్ మరోసారి అగ్రస్థానానికి దూసుకొచ్చింది. కార్తీకదీపం 2, ఇల్లు ఇల్లాలు పిల్లలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మళ్లీ చేతులు మారిన అగ్రస్థానం
స్టార్ మా సీరియల్స్ 16వ వారం టీఆర్పీ రేటింగ్స్ చూస్తే.. ఈసారి 11.18తో గుండెనిండా గుడిగంటలు సీరియల్ మరోసారి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. గతంలో ఒకటి, రెండు వారాలు ఈ స్థానంలో ఉన్న ఈ సీరియల్ పడుతూ లేస్తూ ఇప్పుడు మరోసారి తొలి స్థానానికి వచ్చింది.
ఇక గత వారం టాప్ లో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ వారం మూడో స్థానానికి పడిపోయింది. ఆ సీరియల్ కు 10.82 రేటింగ్ నమోదైంది. కార్తీకదీపం సీరియల్ రెండో స్థానానికి చేరింది. ఆ సీరియల్ కు 10.95 రేటింగ్ వచ్చింది. మూడు వారాల కిందట తన టాప్ స్థానాన్ని కోల్పోయిన ఆ సీరియల్.. మళ్లీ దానిని అందుకోలేకపోతోంది.
బ్రహ్మముడి మళ్లీ..
ఇక తర్వాతి స్థానాల్లో ఉన్న సీరియల్స్ సంగతి ఒకసారి చూస్తే.. ఇంటింటి రామాయణం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆ సీరియల్ కు 10.6 రేటింగ్ నమోదైంది. ఐదో స్థానంలో చిన్ని సీరియల్ ఉంది. దానికి 7.87 రేటింగ్ నమోదైంది.
అయితే ఈ సీరియల్ క్రమంగా తన ఐదో ర్యాంకును కోల్పోయే ప్రమాదంలో కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత నువ్వుంటే నా జతగా 7.59తో ఆరో స్థానంలో నిలిచింది. బ్రహ్మముడి రేటింగ్ మళ్లీ 7 దాటింది. ఈ మధ్యకాలంలో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించేలా సాగుతున్న ఈ సీరియల్ తాజాగా 7.27 రేటింగ్ తో ఏడో స్థానంలో ఉంది. ఈసారి అనూహ్యంగా పలుకే బంగారమాయెనా సీరియల్ 6.57 రేటింగ్ తో టాప్ 10లోకి దూసుకొచ్చింది. ఆ సీరియల్ ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. 16వ వారం కూడా ఆ ఛానెల్ కు చెందిన ఒక్క సీరియల్ కూడా 7 రేటింగ్ దాటలేకపోయింది. టాప్ 10లో ఉన్న ఆ సీరియల్స్ సంఖ్య రెండుకు పడిపోయింది. అత్యధికంగా మేఘ సందేశం సీరియల్ 6.39 రేటింగ్ సాధించింది.
ఓవరాల్ గా 9వ స్థానంలో ఉంది. ఇక చామంతి 6.32తో పదో స్థానంతో సరిపెట్టుకుంది. పడమటి సంధ్యారాగం 6.00, జగద్ధాత్రి 5.84, లక్ష్మీనివాసం 5.08 రేటింగ్స్ సాధించాయి. క్రమంగా జీ తెలుగు సీరియల్స్ తమ పట్టు కోల్పోతుండగా.. స్టార్ మా దూకుడు పెంచుతోంది. టాప్ 10లో 8 సీరియల్స్ ఆ ఛానెల్ కు చెందినవే ఉండటం విశేషం.
సంబంధిత కథనం