సినిమాలు లేక సింగిల్ స్క్రీన్స్‌ క్లోజ్ అయ్యాయి – తెలుగు సినిమా ఊపిరి పీల్చుకుంది – హిట్ 3పై దిల్‌రాజు కామెంట్స్‌

Best Web Hosting Provider In India 2024

సినిమాలు లేక సింగిల్ స్క్రీన్స్‌ క్లోజ్ అయ్యాయి – తెలుగు సినిమా ఊపిరి పీల్చుకుంది – హిట్ 3పై దిల్‌రాజు కామెంట్స్‌

Nelki Naresh HT Telugu

ఏప్రిల్ నెల‌లో స‌రైన సినిమాలు లేక ఏపీ, తెలంగాణ‌లోని చాలా సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయ‌ని నిర్మాత దిల్‌రాజు అన్నారు. హిట్ 3 స‌క్సెస్‌తో మ‌ళ్లీ తెలుగు ఇండ‌స్ట్రీ ఊపిరి పీల్చుకుంద‌ని పేర్కొన్నారు.

దిల్ రాజు, నాని

హిట్ 3 మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మ‌ళ్లీ ఊపిరి పీల్చుకుంద‌ని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ఏప్రిల్‌లో చాలా సినిమాలు రిలీజైన ఏ మూవీ కూడా ఆడియెన్స్‌ను థియేటర్స్ కి ర‌ప్పించ‌లేక‌పోయింద‌ని చెప్పారు హిట్ 3 రిలీజ్‌ను పుర‌స్క‌రించుకొని గురువారం యూనిట్ ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.

అదిరిపోయింది…

ఈ వేడుక‌లో దిల్‌రాజు మాట్లాడుతూ….ఏప్రిల్ నెలలో సరైన సినిమాలు లేక ఏపీ, తెలంగాణ‌లో చాలా సింగిల్ స్క్రీన్ థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. హిట్ 3 మీదే అన్ని ఆశ‌లు పెట్టుకొని ఎదురుచూశాం. ఈ సినిమాకి మూడు రోజులు ముందుగానే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగాయి. ఆ బుకింగ్ చూసి మంచి సినిమా వ‌స్తే మ‌ళ్లీ జనాలు థియేటర్స్ కి వ‌స్తార‌ని అర్థమైంది. హిట్ 3 మూవీ అదిరిపోయింది. ఈ స‌క్సెస్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నట్టు అయింది

ప్రొడ్యూస‌ర్‌గా… హీరోగా…

ఓవర్సీస్ లో దసరా మూవీ ఇప్ప‌టివ‌ర‌కు నాని కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా ఉండేది. ఆ సినిమాను హిట్ 3 దాటేసింది. . నానికి ఓవర్సీస్ హ‌య్యెస్ట్‌ గ్రాస‌ర్‌గా హిట్ 3 రికార్డ్ క్రియేట్ చేసింది.

హిట్ 3 మూవీతో ప్రొడ్యూసర్ కం హీరోగా సూపర్ హిట్ ఇచ్చాడు నాని. శైలేష్ కొల‌ను నాని కాంబినేషన్‌లో వ‌చ్చిన హ్యాట్రిక్ హిట్ మూవీ ఇది అని దిల్‌రాజు అన్నారు.

హీరో.. నాని మాట్లాడుతూ.. ఇప్ప‌టివ‌ర‌కు చాలా రిలీజ్ డేస్ చూసాను. కానీ ఈ రిలీజ్ డేట్ వైబ్ అదిరిపోయింది. బుకింగ్స్ బాగున్నాయి.హిట్ 3 జ‌ర్నీలో ఇది బిగినింగ్ మాత్ర‌మే. ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా ఒక సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది. ఇది ఎక్కడికెళ్లి ఆగుతుంద‌నేది మా టీంఅంచనాలకికూడా అందడం లేదు. అందుకే సినిమా రిజ‌ల్ట్‌పై ఎలాంటి స్టేట్‌మెంట్స్‌ ఇవ్వదల్చుకోలేదు.

అమెరికా నుంచి వ‌చ్చిన త‌ర్వాతే…

హిట్ 3కి వచ్చిన రెస్పాన్స్ గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇది ఇప్పుడిప్పుడే ఆగదు. ఈ సినిమాకి కనీసం నాలుగైదు సెలబ్రేషన్స్ చేయాలి. ఈసారి నేను ప్రొడ్యూసర్ కూడా కాబట్టి ఎక్స్‌ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది. హిట్ 3 ప్ర‌మోష‌న్స్ కోసం అమెరికా వెళుతున్నాను. అక్క‌డి నుంచి వ‌చ్చిన త‌ర్వాత గ్రాండ్ గా సక్సెస్ తెలుగు ప్రేక్ష‌కుల‌తో సెలబ్రేట్ చేసుకుంటాం అని నాని అన్నారు.

న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నా..

హిట్ 3 మూవీలో అంద‌రి కంటే న‌న్ను ఎక్కువ‌గా నమ్మిన నాని గారికి థాంక్యూ. ఆయన నమ్మకాన్ని హ‌నిలబెట్టాననే అనుకుంటున్నాను. థియేటర్స్ హౌజ్‌ఫుల్స్ కనిపించడం చాలా ఆనందంగా ఉంది అని డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను అన్నారు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024