



Best Web Hosting Provider In India 2024
ప్రయాణికులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ – ఈ ఛాన్స్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే…!
హైదరాబాద్ పరిధిలోని జనరల్ బస్ పాస్ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రూ. 20 కాంబినేషన్ టికెట్ తో మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును కలిపించింది. ఈ మేరకు ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ నగర పరిధిలోని జనరల్ బస్ పాస్ వినియోదారులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రూ.20 కాంబినేషన్ టికెట్ తో మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్ పాస్ కలిగిన వారు ఈ కాంబినేషన్ సదుపాయాన్ని మెట్రో డీలక్స్ బస్సులలో పొందవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
సమ్మెకు సిద్ధమవుతున్న కార్మికులు..!
మరోవైపు తెలంగాణలోని ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె బాటపట్టనున్నాయి. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు.
మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఇవాళ్టి వరకు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పడలేదని నోటీసుల్లో తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదని జేఏసీ నేతలు అంటున్నారు. ఈ సమ్మెకు అన్ని వర్గాలు సహకరించాలని కోరుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారితో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉంది. అయితే వీరి సమ్మె నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని… ఇలాంటి సమయంలో సమ్మె నిర్ణయం తీసుకోవద్దని కోరారు.
రాజకీయంగా ఎవరైనా ప్రోత్సహిస్తే, ఏదైనా తప్పుగా నిర్ణయం తీసుకుంటే మొత్తం వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి ఉందన్న విషయాన్ని ఆలోచన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సమ్మెల పేరుతో ఏదైనా పొరపాటు జరిగితే, మళ్లీ పునరుద్ధరించడానికి అవకాశం కూడా లేని పరిస్థితులు తలెత్తుతాయని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనతో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆలోచిస్తాయా..? సమ్మెపై వెనక్కి తగ్గుతాయా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు వారు ఇచ్చిన గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో…. ప్రభుత్వం తరపున చర్చలు జరిపేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్