



Best Web Hosting Provider In India 2024
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు దిల్లీ కోర్టు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి దిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్‌పై అవతలి పక్షంవారు తమ వాదనాలను వినిపించే హక్కు ఉంటుందని పేర్కొంది.
ేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి దిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే సమయంలో తమ వాదనలు వినిపించే హక్కు సోనియా, రాహుల్‌లకు ఉందని కోర్టు పేర్కొంది. ఏ స్థాయిలోనైనా తనను తాను సమర్థించుకునే హక్కు నిష్పాక్షిక విచారణకు జీవనాడి అని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే అన్నారు. ఛార్జిషీట్‌పై న్యాయబద్ధమైన విచారణ జరిగే సమయంలో అవతలి పక్షంవారు తమ వాదనలను వినిపించే హక్కు ఉంటుందని చెప్పారు. దీని మీద తదుపరి విచారణనను మే8కి వాయిదా వేస్తున్నట్టుగా తెలిపారు.
నోటీసులు జారీ
నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ పరిగణనలోకి తీసుకోలేమని, విచారణకు హాజరయ్యేలా వారికి నోటీసులు ఇవ్వాలని దిల్లీ కోర్టును ఈడీ ఆశ్రయించింది. అయితే గతవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈడీ సమర్పించిన ఛార్జిషీట్లో సరైన పత్రాలు లేని కారణంగా నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా విచారణ చేసి నోటీసులు జారీ చేసింది.
నేషనల్ హెరాల్డ్ కేసు బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రారంభమైంది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక, దాని ప్రచురణకర్త అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్), యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన కేసు ఇది. 1938లో జవహర్ లాల్ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది.
ఏ1, ఏ2
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2021లో మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించింది. 2025 ఏప్రిల్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వరుసగా ఏ1, ఏ2 నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేశారు.
మనీలాండరింగ్!
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్‌కు రూ.90.21 కోట్ల వడ్డీలేని రుణం ఇచ్చిందని, దాన్ని తిరిగి చెల్లించలేదని పేర్కొంది. తర్వాత యంగ్ ఇండియన్ లిమిటెడ్ ద్వారా ఏజేఎల్‌కు చెందిన రూ.2000 వేల కోట్ల విలువైన ఆస్తులను రూ .50 లక్షలకు సోనియా, రాహుల్ గాంధీ కొనుగోలు చేశారని ఈడీ అభియోగాలు మోపింది. యంగ్ ఇండియన్ లిమిటెడ్‌లో రాహుల్‌కు 38 శాతం, సోనియాకు 38 శాతం షేర్లు ఉన్నాయి. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. ఇది మనీలాండరింగ్‌లో భాగమని ఈడీ ఆరోపణ.
Best Web Hosting Provider In India 2024
Source link