




Best Web Hosting Provider In India 2024

మనదేశంలోని ఈ ఆలయాన్ని కూల్చేసేందుకు ఔరంగజేబు 1000 మందిని పంపించాడు, కానీ విఫలమయ్యాడు
ఔరంగజేబు ఎన్నో హిందూ దేవాలయాలను కూల్చిన చరిత్ర ఉంది. కానీ మనదేశంలోని ఒక ఆలయాన్ని మాత్రం మూడేళ్లే పాటూ ప్రయత్నించినా కూడా కూల్చలేకపోయాడు.
మొఘల్ చక్రవర్తులు అనగానే ఎక్కువమందికి గుర్తుకు వచ్చే పేరు ఔరంగజేబు. ఆయన మంచి క పేరు కన్నా చెడ్డ పేరునే ఎక్కువ సంపాదించుకున్నారు. హిందువులను ద్వేషించే వ్యక్తిగా పేరుపొందాడు.
ఔరంగజేబు పదవి కోసం తన అన్నని చంపిన క్రూరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. తన తండ్రి షాజహాన్ ను ఖైదీ చేసి కుటుంబ విలువలు లేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అదే ఔరంగజేబు హిందువులపై ద్వేషంతోనే ఎన్నో హిందూ దేవాలయాలను కూల్చాడని కూడా అంటారు.
ఔరంగజేబు 48 ఏళ్ల పాటు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. షాజహాన్ కు ఔరంగజేబు మూడో సంతానం. ముంతాజ్ మహల్ లోనే పుట్టారు. ఇస్లాం మత సాహిత్యాన్ని ఎంతో ఇష్టంగా చదివేవాడు ఔరంగజేబు.
షాజహాన్ కు నలుగురు కొడుకులు. ఆ నలుగురికి మధ్య చిన్న వయసు నుంచే తండ్రి తర్వాత వచ్చే సింహాసనం కోసం పోటీ ఏర్పడింది.
ఈ ఆలయాన్ని కూల్చలేక
షాజహాన్ చక్రవర్తి గా మారిన తర్వాత హిందూ ఆలయాలపై దృష్టి పెట్టినట్టు చరిత్ర చెబుతోంది. ఎన్నో హిందూ ఆలయాలను ఆయన ఆధ్వర్యంలోనే నాశనం చేశారు. అయితే ఒక ఆలయాన్ని మాత్రం ఆయన ఏమీ చేయలేకపోయారు. ఏకంగా వెయ్యి మంది మనుషులను పెట్టి ఆ ఆలయాన్ని పడగొట్టాలని చూసారు. కానీ అతని వల్ల కాలేక వదిలేసారు. ఇప్పటికీ ఆ ఆలయం ఉంది. అదే ఎల్లోరాలోని కైలాస ఆలయం.
కైలాస ఆలయం ఎక్కడుంది?
కైలాస ఆలయం మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉంది. ఈ అందమైన గుడిని రాష్ట్రకూట రాజులు ఏడవ శతాబ్దంలో కట్టించినట్టు చెబుతారు. దాన్ని శివుని గౌరవార్థం ఒకే రాతితో చెక్కించి నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం అని అంటారు.
కైలాస ఆలయ పునాది ప్రతి వైపు 31 మీటర్లు ఉంటుంది. ఇక ఎత్తు 30 మీటర్లు ఉంటుంది. అద్భుతమైన నిర్మాణంతో పాటు రామాయణ, మహాభారతంలోని ఇతిహాసాల దృశ్యాలను వర్ణించే శిల్పాలు కూడా ఈ గుహలో ఎన్నో ఉన్నాయి.
మూడేళ్లు కూలగొట్టే పనిలోనే…
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నాశనం చేద్దామని మూడేళ్ల పాటు ప్రయత్నించాడు. ఈ మూడేళ్ల సమయంలో 1000 మంది పనివారిని అక్కడే పెట్టి ఆ ఆలయాన్ని పడగొట్టాలని చూశాడు. మూడేళ్ల పాటు ఆ 1,000 మంది పనివారు కలిసి ఆలయంలో ఐదు శాతం భాగాన్ని మాత్రమే నాశనం చేయగలిగారు. ఇక వారి వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో ఔరంగజేబు కూడా ఏమీ చేయలేక ఆలయాన్ని వదిలేశాడు. ఒకే కొండను తొలిచి నిర్మించిన మొట్టమొదటి ఆలయంగా కైలాసానికి పేరు ఉంది. 2000 ఏళ్ల వయసున్న ఈ ఆలయం ఇప్పటికీ అంతే వైభవంగా కనిపిస్తుంది.
ఎల్లోరా గుహల్లోని కైలాసాలయం నిర్మించడానికి 18 సంవత్సరాలు పట్టిందని చెబుతారు. ఈ ఆలయంలోని శివుడు తన నిజమైన రూపంలో… ఒక వైపు భార్య పార్వతితో నృత్యం చేస్తూ డప్పు వాయిస్తున్నట్టు భారీ విగ్రహం ఉంటుంది. అలాగే బ్రహ్మ, విష్ణువు, కృష్ణుడు, దుర్గ, నందిశ్వరుల విగ్రహాలు కూడా అక్కడ శిల్పాల రూపంలో చిత్రీకరించి ఉంటాయి.
కైలాస ఆలయాన్ని గ్రేట్ కేవ్ అని కూడా పిలుచుకుంటారు. ఔరంగజేబు 17వ శతాబ్దం చివరిలో మొఘల్ చక్రవర్తి అయ్యాడు. అప్పటినుంచి భారతదేశంలో ఉన్న అనేక దేవాలయాలను నాశనం చేయాలని ఆదేశించినట్టు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అలా ఆయన ఆదేశించిన ఆలయాల్లో ఈ కైలాసాలయం ఒకటి. కానీ ఆలయాన్ని ఏమీ చేయలేకపోయారు ఔరంగజేబు.
మరొక కథ
మరొక కథ ఆధారంగా ఔరంగజేబు శివునికి భయపడ్డాడని, దేశమంతటా ఉన్న హిందువులు భక్తితో పూజించే శివుని ఆలయాన్ని విచ్ఛిన్నం చేసే ధైర్యం ఆయనకు రాలేదని కూడా అంటారు. ఆ ఆలయం మాయా రాళ్లతో నిర్మించారని, దాన్ని నిర్మించిన వారికే దాన్ని నాశనం చేసే దారి కూడా తెలుస్తుందని కూడా అప్పట్లో ఔరంగజేబు అనుకునేవాడని చెబుతారు. ఏది ఏమైనా ఔరంగజేబు చేతుల్లోంచి సురక్షితంగా బయటపడిన ఆలయం ఇదొక్కటే.