ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. వెరైటీ టైటిల్.. ఇంట్రెస్టింగ్ ట్రైలర్.. మలయాళం హీరో కీలకపాత్రలో..

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. వెరైటీ టైటిల్.. ఇంట్రెస్టింగ్ ట్రైలర్.. మలయాళం హీరో కీలకపాత్రలో..

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఓ వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఇందులో మలయాళం స్టార్ నటుడు కీలకపాత్ర పోషించడం విశేషం.

ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. వెరైటీ టైటిల్.. ఇంట్రెస్టింగ్ ట్రైలర్.. మలయాళం హీరో కీలకపాత్రలో..

క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఓటీటీలోకి మరో వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు కంఖజూరా (Kankhajura). అంటే తెలుగులో మనం జెర్రీ అని పిలుస్తాం కదా అది. ఆ పురుగు పేరునే టైటిల్ గా పెట్టి తీసిన ఈ సిరీస్ ట్రైలర్ ను శుక్రవారం (మే 2) రిలీజ్ చేశారు. వెరైటీ టైటిల్ కు తగినట్లుగానే ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగింది.

కంఖజురా వెబ్ సిరీస్ ట్రైలర్

కంఖజురా వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. గతేడాది జనవరిలో ఈ కొత్త సిరీస్ ను అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ.. మొత్తానికి మే 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సిరీస్ లో మోహిత్ రైనా, సారా జేన్ డయాస్, మలయాళ స్టార్ నటుడు రోషన్ మాథ్యూలాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించారు. ఇజ్రాయెల్ వెబ్ సిరీస్ మ్యాగ్‌పై (Magpie) ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది. కంఖజురా అంటే జెర్రీ అనే పురుగు.

ఈ సిరీస్ ట్రైలర్ శుక్రవారం (మే 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జెర్రీ పురుగును ఎవరూ అంత సీరియస్ గా పట్టించుకోరు. సులువుగా నలిపేస్తారు. కానీ అది ఒక్కసారి మనలోకి వెళ్లిందంటే ఇక అంతే. ప్రాణాలు పోతాయి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సిరీస్ ఇది. అలాంటి జెర్రీలాంటి ఓ సాధారణ వ్యక్తి జైలు జీవితం గడిపి బయటకు వచ్చి పోలీస్ ఇన్ఫార్మర్ గా మారి ఎంతో మంది జీవితాలను అల్లకల్లోలం చేస్తాడు.

చందన్ అరోరా డైరెక్ట్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో ఆశు అనే పాత్రలో రోషన్ మాథ్యూ నటిస్తున్నాడు. ఓ నిస్సహాయుడైన అతన్ని మొదట్లో అందరూ ఆడుకుంటారు. కానీ అతడు పోలీస్ ఇన్ఫార్మర్ గా మారి వాళ్ల జీవితాలను బజారుకీడుస్తాడు. ట్రైలర్ చూస్తుంటే కంఖజురా వెబ్ సిరీస్ కాన్సెప్ట్ ఇదే అన్నట్లుగా స్పష్టమవుతోంది.

కంఖజురా వెబ్ సిరీస్ గురించి..

కంఖజురా వెబ్ సిరీస్ ను అజయ్ రాయ్ నిర్మించగా.. చందన్ అరోరా డైరెక్ట్ చేశాడు. ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించే ఖైదీ.. తాను పోలీస్ ఇన్ఫార్మర్ గా మారతానన్న హామీ మేరకు ముందుగానే జైలు నుంచి విడుదలవుతాడు. అప్పటి వరకూ అతడు జైల్లో చేసిన పనినే బయటకు వచ్చిన తర్వాత కూడా చేస్తాడు.

అది అతనితోపాటు ఇతరు జీవితాలను ఎలా మార్చేయబోతుందన్నదే ఈ కంఖజురా వెబ్ సిరీస్. మే 30 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మోహిత్ రైనా, సారా జేన్ డయాస్, మాథ్యూ రోషన్ లాంటి వాళ్లు నటిస్తుండటంతో ఈ సిరీస్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024