




Best Web Hosting Provider In India 2024

పహల్గామ్ ఉగ్రదాడిపై వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో విజయ్ దేవరకొండ; విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు
ఇటీవల ఒక సినిమా కార్యక్రమంలో సినీ నటుడువిజయ్ దేవరకొండ పహల్గామ్ ఉగ్రదాడి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై గిరిజన సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ప్రముఖ తెలుగు సినీ నటుడు విజయ్ దేవరకొండ గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ కు చెందిన లాల్ చౌహాన్ అనే న్యాయవాది హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పహల్గామ్ ఉగ్ర దాడి వందల సంవత్సరాల క్రితం గిరిజన వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను పోలి ఉన్నాయని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారని తన ఫిర్యాదులో చౌహాన్ ఆరోపించారు.
గిరిజనులను కించపరిచేలా ఉన్నాయా?
రెట్రో సినిమా కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రదాడి వందల ఏళ్ల క్రితం గిరిజన వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను తలపించేలా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై గిరిజన సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయ్ వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, విజయ్ దేవరకొండపై వచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇంతకీ విజయ్ దేవరకొండ ఏమన్నారంటే.
రెట్రో కార్యక్రమంలో విజయ్ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు, “కాశ్మీర్ లో జరుగుతున్నదానికి పరిష్కారం వారికి (ఉగ్రవాదులకు) అవగాహన కల్పించడం, వారు బ్రెయిన్ వాష్ కాకుండా చూసుకోవడం. వారు ఏమి సాధిస్తారు? కశ్మీర్ భారత్ దే, కశ్మీరీలు మనవాళ్లే’’ అని అన్నారు.
ఐక్యంగా ఉండాలి..
తన ప్రసంగంలో పాకిస్తాన్ పై, టెర్రరిస్టులపై ఆయన విరుచుకుపడ్డారు. పొరుగు దేశం తన పౌరులకు కనీస అవసరాలను అందించడానికి కష్టపడుతోందని ఆయన అన్నారు. మనం ప్రజలుగా ఐక్యంగా ఉండి ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మనం ఎల్లప్పుడూ ప్రజలుగా ముందుకు సాగాలి మరియు ఐక్యంగా ఉండాలి. విద్య చాలా కీలకం. అందరం సంతోషంగా ఉండి తల్లిదండ్రులను సంతోషంగా ఉంచుదాం. అప్పుడే మనం పురోగతి సాధించగలం’ అని పేర్కొన్నారు.
పాక్ ప్రజలు విసిగిపోయారు
పాకిస్తాన్ పై దాడి చేయాల్సిన అవసరం కూడా భారత్ కు లేదని, పాకిస్తానీలే తమ ప్రభుత్వంతో విసిగిపోయారని, ఇది ఇలాగే కొనసాగితే వారిపై ప్రజలే దాడి చేస్తారని విజయ్ దేవరకొండ హెచ్చరించారు. ‘‘అసలు 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు, వీళ్లు (ఉగ్రవాదులు) బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా పనులు చేస్తున్నారు’’ అన్నారు. రెండేళ్ల క్రితం ఖుషి సినిమా షూటింగ్ సమయంలో పహల్గామ్ ను సందర్శించిన విషయాన్ని విజయ్ దేవరకొండ తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు.
ఉగ్రదాడిలో 26 మంది మృతి
ఏప్రిల్ 22న కశ్మీర్ లోని పహల్గామ్ లోని పచ్చిక మైదానంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సెలబ్రిటీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్