విరాట్ కోహ్లి బయోపిక్.. హీరోగా ఆ స్టార్ నటుడు.. బజ్ వైరల్

Best Web Hosting Provider In India 2024

విరాట్ కోహ్లి బయోపిక్.. హీరోగా ఆ స్టార్ నటుడు.. బజ్ వైరల్

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బయోపిక్ అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడీ బయోపిక్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఓ స్టార్ హీరో కోహ్లి రోల్ చేయబోతున్నారనే టాక్ వస్తోంది.

విరాట్ కోహ్లి (PTI)

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బయోపిక్ రాబోతుందా? ఈ మూవీలో తమిళ స్టార్ హీరో లీడ్ రోల్ ప్లే చేయబోతున్నారా? అంటే సినీ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయి. సడన్ గా కోహ్లి బయోపిక్ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై క్రేజీ బజ్ వినిపిస్తోంది.కోహ్లి బయోపిక్ చర్చలు వైరల్ గా మారాయి. తాజాగా ఓ చాట్ షోలో కోహ్లి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఇందుకు కారణం.

ఆ సాంగ్ అంటే ఇష్టం

ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల ఓ చాట్ షోలో మాట్లాడుతూ.. ‘నీ సింగం దాన్’ సాంగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. ఈ పాటను సోషల్ మీడియా రీల్స్‌లో, క్రికెట్ వీడియోల్లో చాలా సార్లు వాడుతున్నారు కూడా. ‘పత్తు తల’ మూవీలోనిది ఈ సాంగ్. ఈ ఫిల్మ్ లో సిలంబరసన్ టీఆర్ (శింబు) హీరో. కోహ్లి కామెంట్ల తర్వాత ఈ సాంగ్ మరోసారి వైరలైంది. అంతే కాకుండా కోహ్లి బయోపిక్ లో శింబు యాక్ట్ చేస్తారనే చర్చ జోరందుకుంది.

శింబు రియాక్షన్

‘నీ సింగం దాన్’ పాట ఇష్టమంటూ కోహ్లి చెప్పిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీనికి శింబు స్పందించారు. “నీ సింగం దాన్” అంటే “నువ్వు నిజమైన సింహం” అని వ్యాఖ్యానించారు. దీంతో విరాట్ అభిమానులు అతని బయోపిక్ లో శింబు నటిస్తే బాగుంటుందనే కామెంట్లు చేస్తున్నారు.

ఇక శింబు కూడా విరాట్ లాంటి గడ్డంతో స్టయిలిస్ గా తయారయ్యారు. తన ఫిట్ నెస్ ను కూడా పెంచుకున్నారు. దీంతో అతని లుక్ లుక్ కొంతవరకు విరాట్ కోహ్లీని తలపిస్తోంది.

జోరుగా చర్చ

ప్రస్తుత పరిణామాలతో విరాట్ కోహ్లి బయోపిక్ లో శింబు లీడ్ రోల్ ప్లే చేయబోతున్నాడా అని ముంబయి వర్గాల్లో ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల వీరి మధ్య సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న సంభాషణల ప్రకారం చూస్తే.. విరాట్, అనుష్క ప్రొడ్యూసర్లకు ఓకే అంటే శింబు ఈ బయోపిక్‌కు ఎంపిక అయ్యే అవకాశముంది.

ఒకవైపు విరాట్ ఐపీఎల్‌ 2025లో విజృంభిస్తుండగా, మరోవైపు శింబు “థగ్ లైఫ్”, “ఎస్టీఆర్49”, “ఎస్టీఆర్50”, “ఎస్టీఆర్51” సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. దీనికి విరాట్ కోహ్లీ బయోపిక్ కూడా చేరితే, ఇది పాన్ ఇండియా స్థాయిలో ఓ పండుగ అవుతుంది.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024