




Best Web Hosting Provider In India 2024

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – మే 4న స్థానికులకు దర్శన టోకెన్లు జారీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. మే 4వ తేదీన స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లను జారీ చేయనుంది. ఈ మేరకు కౌంటర్ కేంద్రాల వివరాలను వెల్లడించింది.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. మే 4వ తేదీన స్థానిక దర్శన కోటా టోకెన్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రతి నెలా మొదటి మంగళవారం (మే 6వ తేదీ) స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా ఈ టోకెన్లను జారీ చేయనున్నట్లు వెల్లడించింది.
కౌంటర్ల వివరాలు….
తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలో టోకెన్లు అందజేస్తారు. ఇక తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఇస్తారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేస్తారని టీటీడీ తెలిపింది.
ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
తిరుమలలో పరిణయోత్సవాలు – పలు సేవలు రద్దు:
మే 6 నుంచి 8వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాల ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ వివరాలను తెలిపింది. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
3 రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల్లో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా పలు సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మే 6 నుంచి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు వెల్లడించింది.
సంబంధిత కథనం
టాపిక్