



Best Web Hosting Provider In India 2024

ఓయూ పీహెచ్డీ 2025 ప్రవేశ పరీక్షలు – ప్రిలిమినరీ కీ, రెస్పాన్ష్ షీట్లు విడుదల, ఇవిగో లింక్స్
ఓయూ పీహెచ్డీ 2025 ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
ఉస్మానియా యూనివర్శిటీ పీహెచ్డీ – 2025 ప్రవేశాలపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్ష ప్రిలిమినరీ కీని అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్స్ ను కూడా విడుదల చేశారు. ప్రాథమిక కీలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే…. మే 5వ తేదీలోపు పంపాలని అధికారులు తెలిపారు.
సరైన ఆధారాలను ఓయూలోని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ లో ఇవ్వొచ్చు. లేదా ouphd2025@gmail.com కు మెయిల్ చేయవచ్చని అధికారులు సూచించారు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కాగా…. ఏప్రిల్ 27వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తయ్యాయి.
కీ ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- అభ్యర్థులు ఉస్మానియా యూనివర్శిటీ అడ్మిషన్స్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే Ph.D. Entrance Test – 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ ప్రిలిమినరీ కీ (మాస్టర్ క్వశ్చన్ పేర్ )అనే ఆప్షన్ పై నొక్కాలి.
- ఇక్కడ సబ్జెక్టుల వారీగా కీలు కనిపిస్తాయి. మీరు రాసిన సబ్జెక్ ను ఎంచుకోని ప్రాథమిక కీ ని పొందవచ్చు.
- రెస్పాన్స్ షీట్ కోసం కూడా ఇదే వెబ్ సైట్ లోకి వెళ్లాలి. రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ పై నొక్కాలి.
- ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయాలి. సబ్మిట్ చేస్తే మీ రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది.
అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్‌గా గుర్తిస్తారు. ఓసీ అభ్యర్ధులకు కనీసం 35 మార్కులు రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్ క్యాటగిరీలలో 32 మార్కులు రావాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.
ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ,ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఒరియంటల్ లాంగ్వేజేస్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్ మెంట్, ఎడ్యుకేషన్, లా, టెక్నాలజీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మెటిక్స్ డిపార్ట్ మెంట్ లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ పరీక్ష ప్రిలిమినరీ కీని పొందవచ్చు.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ రెస్పాన్స్ షీట్ ను పొందవచ్చు
సంబంధిత కథనం
టాపిక్