హాట్ బ్యూటీ ఫ్యాన్ పేజీలో కోహ్లి లైక్.. ఏమైందో చెప్పిన విరాట్

Best Web Hosting Provider In India 2024

హాట్ బ్యూటీ ఫ్యాన్ పేజీలో కోహ్లి లైక్.. ఏమైందో చెప్పిన విరాట్

ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోస్ తో రచ్చ చేస్తుంటోంది అవ్‌నీత్ కౌర్‌. ఈ నటి ఫ్యాన్ పేజీలో విరాట్ కోహ్లి అకౌంట్ నుంచి లైక్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై విరాట్ తాజాగా స్పందించాడు.

విరాట్ కోహ్లి (AFP)

బాలీవుడ్ హాట్ బ్యూటీ అవ్‌నీత్ కౌర్‌ ఫ్యాన్ పేజీలో ఓ పోస్టుకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ నుంచి లైక్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోస్ తో రచ్చ చేసే అవ్‌నీత్.. ఇప్పుడు ఇంగ్లిష్ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. అలాంటి నట ఫ్యాన్ పేజీలో కోహ్లి లైక్ ఉండటంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటికీ కోహ్లి క్లారిటీ ఇచ్చాడు.

హాట్ టాపిక్ గా

ఇన్‌స్టాగ్రామ్‌ నటి అవ్‌నీత్ కౌర్‌ ఫ్యాన్ పేజీలోని ఒక పోస్ట్ ను కోహ్లి లైక్ చేశాడని నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన ఆన్ లైన్లో పెద్ద దుమారమే రేపడంతో పాటు కోహ్లీ సతీమణి అనుష్క శర్మను కామెంట్ సెక్షన్లో, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో అనవసరంగా ట్యాగ్ చేయడం కూడా సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన కోహ్లి ఈ ఘటనపై ఊహాగానాలు వద్దన్నాడు.

పొరపాటు కావొచ్చు

ఈ విషయంపై కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వివరణ ఇచ్చాడు. నటి పేరును గానీ, పోస్టును గానీ ప్రస్తావించకుండా నేరుగా వివాదాన్ని ప్రస్తావిస్తూ ఊహాగానాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరాడు.

“నా ఫీడ్ ను క్లియర్ చేసేటప్పుడు, అల్గారిథం పొరపాటు కారణంగా ఈ ఇంటరాక్షన్ కలగొచ్చు. ఈ విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నా. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదు. అనవసర ఊహాగానాలు చేయొద్దని కోరుతున్నా. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’’ అని కోహ్లి పేర్కొన్నాడు.

కోహ్లి వివరణ
కోహ్లి వివరణ (Virat Kohli/Instagram)

కామెంట్ల మోత

మే 2న కోహ్లీ వెరిఫైడ్ ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్ ను పలువురు యూజర్లు గమనించారు. ఈ పోస్ట్ వెంటనే వైరల్ కావడంతో చాలా మంది అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సాంకేతిక లోపం లేదా నిర్వహణ తప్పిదం అని కొందరు నవ్వగా, మరికొందరు క్రికెటర్ గురించి అనవసరమైన ఊహాగానాలు చేశారు.

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున విరాట్ కోహ్లి అదరగొడుతున్నాడు. 10 ఇన్నింగ్స్ లో 443 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఇక ఆర్సీబీ కూడా సత్తాచాటుతోంది. ఆ టీమ్ 10 మ్యాచ్ ల్లో 7 గెలిచి ప్లేఆఫ్స్ కు చేరువగా ఉంది.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024