



Best Web Hosting Provider In India 2024
జేఈఈ స్కోర్ లేకున్నా ఐఐటీలో ప్రవేశం.. ఈ డిగ్రీ కోర్సు చేసేయెుచ్చు!
ఐఐటీ మద్రాస్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) డిగ్రీ కోర్సులో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్ లేకుండా కూడా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దీనికోసం ఎగ్జామ్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది.
ఐటీ మద్రాస్‌లో బీఎస్ డిగ్రీ కోర్సులో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్ లేకుండా కూడా ఎంట్రీ కావొచ్చు. ఐఐటీ మద్రాస్ ఈ ప్రత్యేక కోర్సు పూర్తి పేరు బీఎస్ ప్రోగ్రామ్ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్, బీఎస్ ఇన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. ఈ కోర్సు ఆన్లైన్ కోర్సు. ఆన్లైన్ విధానంలో అధ్యయనాలు నిర్వహించనున్నారు. కోర్సులో ప్రవేశం కోసం జేఈఈ మెయిన్ లేదా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో స్కోర్ ఉండాల్సిన అవసరం లేదు. దరఖాస్తుకు చివరి తేదీ- 2025 మే 20. study.iitm.ac.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
జేఈఈ లేకుంటే క్వాలిఫయర్ పరీక్ష
ఈ కోర్సులో జేఈఈ స్కోరు లేకుండా కూడా ఎంట్రీ ఇవ్వొచ్చు. అయితే జేఈఈ మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు ఇందులో డైరెక్ట్ ఎంట్రీ కూడా లభిస్తుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించనివారు, జేఈఈ మెయిన్ రాయని వారు క్వాలిఫయర్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఫౌండేషన్ స్థాయి నుంచే
జేఈఈ మెయిన్ లేకుండా డేటా సైన్స్‌లో బీఎస్ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించవచ్చు. బీఎస్ కోర్సు ఫౌండేషన్ స్థాయి నుంచే ప్రారంభమవుతుంది. ఫౌండేషన్ స్థాయిలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన వారికి డైరెక్ట్ ఎంట్రీ లభిస్తుంది. అయితే ఇతర విద్యార్థులు క్వాలిఫయర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం నాలుగు వారాల ఆన్లైన్ సన్నాహక మాడ్యూల్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఫుల్ టైమ్ జాబ్స్
భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో గ్రాడ్యుయేట్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం ఈ కోర్సు లక్ష్యం. ఈసారి ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ బీఎస్ కోర్సులో నాలుగో బ్యాచ్‌కు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఫుల్ టైమ్ జాబ్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సును రూపొందించారు డిగ్రీ పూర్తి చేయని వారికి కూడా సర్టిఫికెట్ లేదా డిప్లొమా పొందే అవకాశం ఉంటుంది. డేటా సైన్స్ ప్రోగ్రామ్ 10వ తరగతి స్థాయి గణితం, ఆంగ్లంతో ఏదైనా అకడమిక్ స్ట్రీమ్ విద్యార్థులకు ఓపెన్ ఉంటుంది. అయితే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ప్రోగ్రామ్‌కు 12వ తరగతి ఫిజిక్స్, గణితంలో నేపథ్యం అవసరం. పూర్తి వివరాల కోసం ఐఐటీ మద్రాస్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
Best Web Hosting Provider In India 2024
Source link