ఓటీటీలో దుమ్ములేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. టాప్ 1లో ట్రెండింగ్.. 6.8 ఐఎమ్‌డీబీ రేటింగ్!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో దుమ్ములేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. టాప్ 1లో ట్రెండింగ్.. 6.8 ఐఎమ్‌డీబీ రేటింగ్!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలో తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గరుడ 2.0 టాప్ 1లో ట్రెండింగ్ అవుతోంది. సంక్రాంతి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్‌లో నటించిన గరుడ 2.0 ఓటీటీలోకి రీసెంట్‌గా వచ్చేసింది. తమిళ పాపులర్ హీరో అరుళ్ నిధి హీరోగా చేసిన గరుడ 2.0 ఓటీటీ ప్లాట్‌‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలో దుమ్ములేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. టాప్ 1లో ట్రెండింగ్.. 6.8 ఐఎమ్‌డీబీ రేటింగ్!

ఓటీటీలో వచ్చే సినిమాల్లో ఆడియెన్స్‌కు నచ్చే జోనర్స్‌లో క్రైమ్ థ్రిల్లర్స్ ఒకటి. మంచి ట్విస్టులు, ఊహించని థ్రిల్లింగ్ సీన్లతో తెరకెక్కిస్తే వాటికి మంచి ఆదరణ వస్తుంటుంది. అయితే, ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువగా ఓటీటీలో మంచి పేరు తెచ్చుకుంటాయి.

9 సంవత్సరాల క్రితం

ఇప్పుడు అలాగే, ఓటీటీలో దుమ్ములేపుతోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గరుడ 2.0. సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే 2016లో ఫ్రిబ్రవరి 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. అయితే, ఈ సినిమా తమిళంలో ఆరతు సినమ్ అనే టైటిల్‌తో ముందుగా రిలీజ్ అయింది.

ఐఎమ్‌డీబీ నుంచి మంచి రేటింగ్

తమిళంలో ఆరతు సినమ్ మంచి హిట్ కొట్టింది. అలాగే, అదిరిపోయే కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద ఆరతు సినమ్ మంచి విజయం సాధించింది. అయితే ఐఎమ్‌డీబీ నుంచి ఆరతు సినమ్ 6.8 రేటింగ్ సాధించుకుంది. అలాంటి ఆరతు సినమ్ తొమ్మిదేళ్లకు ఓటీటీలోకి వచ్చింది. అది కూడా తెలుగులో గరుడ 2.0 అనే టైటిల్‌తో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్

గరుడ 2.0లో సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్ రోల్ పోషించడంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. దీంతో గరుడ 2.0 ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఏప్రిల్ 29న ఆహాలో గరుడ 2.0 ఓటీటీ రిలీజ్ అయింది. తాజాగా ఆహాలో టాప్ 1 ప్లేస్‌లో గరుడ 2.0 ఓటీటీ ట్రెండింగ్‌లో ఉందని మేకర్స్ తెలిపారు.

ఐశ్వర్య రాజేష్ నటన

ఇందులో ఐశ్వర్య రాజేష్ తన నటనతో ఆకట్టుకుందని, అద్భుతంగా ఉందని కామెంట్స్ వినిపించాయి. ఇక ఈ సినిమాలో హీరోగా తమిళ పాపులర్ కథానాయకుడు అరుళ్ నిధి చేశాడు. డిమాంటీ కాలనీ, డిమాంటీ కాలనీ 2 వంటి హారర్ సినిమాలతో పాటు ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్స్ చేసే హీరోగా అరుళ్ నిధి పేరు తెచ్చుకున్నాడు.

అనేక సినిమాలు

గరుడ 2.0 సినిమాను హనుమాన్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ బ్యానర్‌పై గతంలో సూపర్ మచ్చి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనెజర్స్, కథ కంచికి మనం ఇంటికి లాంటి ఎన్నో సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలతో సక్సెస్‌ఫుల్ నిర్మాత బాలు చరణ్ గరుడ 2.0 సినిమాను తెలుగులో విడుదల చేశారు.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

ఆరతు సినమ్ సినిమాకు అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న గరుడ 2.0 సినిమాపై కచ్చితంగా లుక్కేయవచ్చు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024