





Best Web Hosting Provider In India 2024

వేసవిలో షాంపూను తలకు ఎన్నిసార్లు పెట్టుకోవాలి? రోజూ వాడితే జుట్టు రాలిపోతుందా?
వేసవి కేవలం చర్మానికి మాత్రమే కాదు, మన జుట్టు ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. వేసవిలో జుట్టును ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎన్నిసారు షాంపూ చేసుకోవాలి? ఎక్కువ సార్లు షాంపూ చేయడం వల్ల జరిగే నష్టాలేమిటి? అనే విషయాలు తెలుసుకోండి.
వేసవిలోని వేడిగాలికి కేవలం చర్మమే కాదు జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. జుట్టు రాలడం, తలలో చుండ్రు, పొడి జుట్టు వంటి సమస్యలకు పెరుగుతున్న బయటి ఉష్ణోగ్రతే కారణం.
సూర్యుని అతినీలలోహిత కిరణాలు కూడా జుట్టును పొడిగా, గట్టిగా, బలహీనంగా చేస్తాయి. అందువల్ల, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం.
మీ జుట్టు అధికంగా రాలిపోతుంటే, వేడి ఒక్కటే కారణం కాదు… మీ శరీరంలో విటమిన్-డి3, విటమిన్-బి, బి12, ఇనుము వంటి పోషకాల లోపం ప్రధానంగా కారణం కావచ్చు.
వేసవి కారణంగా నిరంతరం చెమట పట్టడం, తలలో చెత్త పేరుకుపోవడం, చుండ్రు పట్టడం వంటివి కూడా జుట్టు రాలే సమస్యను మరింత పెంచుతుంది. ఈ సంవత్సరం వేసవిలో మీ అందమైన జుట్టు దెబ్బతినకుండా ఉండటానికి, మీ జీవనశైలిలో ఏ విధమైన మార్పులు చేయాలో తెలుసుకుందాం:
షాంపూ వాడవచ్చా?
మనమందరం వేసవిలో ఎక్కువ సార్లు తలకు స్నానం చేస్తారు. అలాగే ఎక్కువగా షాంపూను వాడుతారు. వేడి కారణంగా జుట్టులో చెమట పట్టేస్తుంది. దురదగా కూడా అనిపిస్తుంది. అందుకే తలకు స్నానం ప్రతిరోజూ చేసేవారు ఉన్నారు. కానీ షాంపూను అధికంగా వాడితే సమస్యలు వస్తాయి.
షాంపూ రోజూ వాడితే ఏమవుతుంది?
సూర్యకాంతి, నీటిలో ఉన్న క్లోరిన్, షాంపూలోని రసాయనాలు కలిపి జుట్టు త్వరగా పొడిగా మారేలా చేస్తాయి. ఈ పొడి జుట్టును నిర్వహించడం కష్టంగా మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవిలో ప్రతిరోజూ షాంపూ వాడే అలవాటును వదిలేయాలి. అలాగే గాఢమైన షాంపూ కన్నా మైల్డ్ షాంపూతో జుట్టును వాష్ చేసుకోవాలి. తరువాత కండిషనర్ వాడటం మర్చిపోకండి.
వేసవిలో మీ జుట్టు తేమను కోల్పోతుంది. అధిక కాస్మెటిక్స్ వాడటం వల్ల జుట్టు ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. ముఖ్యంగా వేసవిలో జుట్టుకు రంగులు వేయడం మానుకోండి.
కండిషనర్ వాడండి
వేసవిలో ఎండలకు జుట్టులోని తేమ మొత్తం ఇంకిపోతూ ఉంటుంది. కాబట్టి కండిషనర్ ద్వారా తేమను తిరిగి భర్తీ చేసేందుకు ప్రయత్నించండి. మీ జుట్టు స్వభావానికి తగిన కండిషనర్‌ను ఎంచుకోండి. దాన్ని క్రమం తప్పకుండా వాడండి. వేడి నుండి తప్పించుకోవడానికి ఈత కొట్టడానికి వెళుతున్నట్లయితే, లీవ్-ఇన్ కండిషనర్ వేసుకున్న తర్వాత స్విమ్మింగ్ కాప్ ధరించి ఈత కొట్టండి.
హీట్ స్టైలింగ్ వద్దు
సూర్యకాంతి మీ జుట్టును ఇప్పటికే పొడగా మార్చేస్తుంది. కాబట్టి హీట్ స్టైలింగ్ నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. హీట్ స్టైలింగ్ కొంత సమయం వరకు మీ జుట్టును అందంగా చేస్తుంది, కానీ తరువాత జుట్టుపై దాని ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది.
ట్రిమ్మింగ్ చేయండి
జుట్టు పొడిగా ఉంటే, చివరలు చిట్లిపోతాయి. చిట్లిపోయిన జుట్టు మంచిది కాదు. ముఖ్యంగా వేసవిలో క్రమం తప్పకుండా జుట్టును ట్రిమ్ చేయించుకోండి. దీనివల్ల చిట్లిపోయిన జుట్టు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది.
ఎక్కువ ద్రవాహారం
మీరు ఈ పద్ధతులన్నీ అనుసరిస్తున్నప్పటికీ, మీ జుట్టు ఆరోగ్యంగా ఉండకపోతే, మీరు తగినంత నీరు తాగడం లేదని అర్థం. వేసవిలో ముఖ్యంగా ఎక్కువగా నీరు, ద్రవాహారాలను తీసుకోండి. తగినంత నీరు మీ జుట్టు, చర్మం రెండింటి ఆరోగ్యానికి అవసరం.
వేసవిలో చెమట, మురికి, సూర్యకాంతి కారణంగా చాలా మంది తలలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీని నుండి తప్పించుకోవడానికి, మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టండి. ఉదయం వాటిని పేస్ట్ చేసి, అందులో కొద్దిగా పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని తలలో కొంత సేపు పెట్టి కడగాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
మీ జుట్టు జిడ్డుగా మారితే pH బ్యాలెన్స్ చూసుకుని కండిషనర్ కొనండి. అలాగే, జుట్టును తెల్లని వెనిగర్ తో వాష్ చేయడం కూడా చాలా ముఖ్యం.
సూర్యుని తీవ్రమైన కిరణాల వల్ల జుట్టు మాత్రమే కాదు, హెయిర్ కలర్ వాడేవారి జుట్టు రంగు కూడా దెబ్బతింటుంది. అందుకే జుట్టులో హెయిర్ సీరం వేసుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళండి.
వేసవిలో వెంట్రుకలు చిట్లిపోతూ ఉంటే బార్లీ నీటితో వాష్ చేయండి. అరటిపండులో తేనె, నిమ్మరసం కలిపి జుట్టుకు మాస్క్ లాగా వేయడం కూడా ప్రభావవంతంగా ఉంటుంది.