Best Web Hosting Provider In India 2024
సీబీఎస్ఈ ఫలితాలు త్వరలోనే- ఈ క్రెడెన్షియల్స్‌తో చెక్ చేసుకోవాలి..
సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నాయి. వాటిని చెక్ చేసుకోవాడానికి కొన్ని క్రెడెన్షియల్స్ అవసరం పడతాయి. ఫలితాలు వెలువడకముందే వాటి గురించి తెలుసుకుని దగ్గర పెట్టుకోవాలి. అవేంటంటే..
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల ఫలితాల కోసం క్లాస్ 10, క్లాస్ 12 విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారి. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, సీబీఎస్ఈ 10, 12 ఫలితాలు ఈ నెలలో లాంచ్ అవుతాయని గత ట్రెండ్స్ సూచిస్తున్నాయి. ఈ ఏడాది పరీక్షలు రాసిన విద్యార్థులు తమ స్కోర్లను బోర్డు అధికారిక వెబ్సైట్లలో చూసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్లు, కావాల్సిన క్రెడెన్షియల్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సీబీఎస్ఈ ఫలితాలను చెక్ చేయడానికి వెబ్సైట్లు..
సీబీఎస్ఈ ఫలితాలను విద్యార్థులు ఈ కింద ఇచ్చిన వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు..
- cbse.gov.in
- results.cbse.nic.in.
results.digilocker.gov.in డిజిలాకర్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో చెక్ చేసుకోవచ్చు. లేదా umang.gov.in ఉమాంగ్ పోర్టల్లో కూడా ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
ఈ క్రెడెన్షియల్స్ దగ్గర పెట్టుకోండి..
సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 ఫలితాలు తనిఖీ చేయడానికి, విద్యార్థులకు ఈ కింద ఇచ్చిన క్రెడెన్షియల్స్ అవసరం పడతాయి.
- రోల్ నెంబరు
- పుట్టిన తేది
- అడ్మిట్ కార్డు వివరాలు
ఈ ఏడాది దాదాపు 44 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 10వ తరగతి బోర్డు పరీక్ష ఫిబ్రవరి 15న ప్రారంభమై మార్చి 18, 2025న ముగిసింది. ఇక సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్ష ఫిబ్రవరి 15న ప్రారంభమై ఏప్రిల్ 4, 2025న ముగిసింది.
సీబీఎస్ఈ ఫలితాలు 2025: 10, 12వ తరగతి ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
- cbse.gov.in అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో విద్యార్థులు సీబీఎస్ఈ 10 లేదా 12 వ తరగతి ఫలితాలను తనిఖీ చేయడానికి కావాల్సిన లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ సీబీఎస్ఈ 10వ తరగతి లేదా 12వ తరగతి స్కోర్‌కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. చెక్ చేసుకోండి.
- భవిష్యత్తు రిఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసి ప్రింటౌట్ తీసి పెట్టుకోండి.
సీబీఎస్ఈ ఫలితాలకు సంబంధించిన మరిన్ని వివరాలకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించారు.
Best Web Hosting Provider In India 2024
Source link