Best Web Hosting Provider In India 2024

ఏపీ ట్రిపుల్ ఐటీ 2025 నోటిఫికేషన్ విడుదల – మెరిట్ ఆధారంగా సీట్లు, ముఖ్య తేదీలివే
ఏపీ ఐఐఐటీ నోటిఫికేషన్ వచ్చేసింది. 2025-26 అకడమిక్ ఇయర్‌కి సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే 20వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ 5వ తేదీన విడుదల చేస్తారు.
ఏపీ ఐఐఐటీ నోటిఫికేషన్ 2025
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ IIITల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సెలెక్ట్ అయ్యే విద్యార్థులు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో అడ్మిషన్లు పొందుతారు.
దరఖాస్తు విధానం…
పదవ తరగతిలో మార్కుల ఆధారంగా 6 ఏళ్ల బీటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు మే 20వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు జనరల్ అభ్యర్థులు రూ. 300, రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు రూ. 200, ఇతర రాష్ట్రాల అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. www.rgukt.in లేదా ఏపీ ఆన్ లైన్ కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించటంతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.
ముఖ్య తేదీలు :
- ప్రవేశాలు – ఏపీ ఐఐఐటీ
- నోటిఫికేషన్ విడుదల – 24 ఏప్రిల్ 2025
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ – 20 మే 2025(సాయంత్రం 5 గంటల వరకు)
- ఒక్కో క్యాంపస్‌లో 1000 సీట్లు, అదనంగా ఈడబ్ల్యూఎస్ సీట్లు మరో 100 ఉన్నాయి.
- మొత్తం 4 క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి
- ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన – 5 జూన్ 2025
- సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ – 11 జూన్, 2025 నుంచి ఉంటాయి. క్యాంపస్ ల వారీగా వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు.
- జూన్ 30వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
- అధికారిక వెబ్ సైట్ – https://admissions25.rgukt.in
ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఐఐఐటీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు