బ్రహ్మముడి మే 3 ఎపిసోడ్: రిసార్టుకు రామ్, కావ్య- జోలికి రుద్రాణి రాకుండా స్వప్న ప్లాన్- రాజ్‌ను హగ్ చేసుకున్న కల్యాణ్!

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి మే 3 ఎపిసోడ్: రిసార్టుకు రామ్, కావ్య- జోలికి రుద్రాణి రాకుండా స్వప్న ప్లాన్- రాజ్‌ను హగ్ చేసుకున్న కల్యాణ్!

 

బ్రహ్మముడి మే 3 ఎపిసోడ్‌లో రామ్, కావ్య ఇద్దరు అబద్ధాలు చెప్పి రిసార్టుకు బయలుదేరుతారు. కావ్య ఎక్కడికి వెళ్లిందో కనుక్కోడానికి రాహుల్, రుద్రాణి ప్లాన్ చేస్తే.. తన జోలికి రాకుండా స్వప్న తిప్పికొడుతుంది. రాజ్‌పై తన ఫ్రెండ్స్ రివేంజ్ ప్లాన్ చేస్తారు. శ్రుతి శాడిస్ట్‌లా బిహేవ్ చేస్తుంది.

 
బ్రహ్మముడి సీరియల్‌ మే 3వ తేది ఎపిసోడ్
 

 

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యతో యామిని కాల్ మాట్లాడి పెట్టేస్తుంది. రాజ్ నాలుగు మాటలు మంచిగా మాట్లాడేసరికి ఈజీగా గతం గుర్తు చేసేయొచ్చు అనుకుంటుంది. చెబుతా దీని సంగతి అని యామిని అనుకుంటుంది. మరోవైపు కావ్య లగేజ్‌తో బయలుదేరుతుంది. ఆ విషయం కల్యాణ్‌కు చెప్పి మొత్తం రెడీయేగా అని అడుగుతుంది.

 

మొగుడు చచ్చిపోతే

కల్యాణ్ అంతా రెడీగా ఉందంటాడు. కావ్యను చూసిన రుద్రాణి ఎక్కడికి వెళ్తుందో.. కట్టు బొట్టు కొత్తగా ఉంది అని అంటుంది. ఫంక్షన్ ఉందని చెప్పాగా అక్కడికి వెళ్తున్నాను అని అపర్ణకు చెబుతుంది కావ్య. వావ్.. అద్భుతం.. మహాద్భుతం.. మొగుడు చచ్చిపోతే బాధపడాలి. కోడలి పార్టీలు, ఫంక్షన్స్ అని తిరుగుతుంది. అత్తేమో ఈజీగా పర్మిషన్ ఇచ్చేస్తుంది అని రుద్రాణి అంటుంది.

పార్టీలో మొగుడు ఏమయ్యాడని అడిగితే.. నిజం చెప్పాల్సిరాదా. అప్పుడు పరువు పోదా. ఏదో గోల్డ్ మెడల్ సాధించడానికి వెళ్తున్నట్లు పంపిస్తున్నారు అని రుద్రాణి అంటుంది.అవునే, గోల్డ్ మెడల్ సాధించడానికే వెళ్తుంది. ఇప్పుడిప్పుడే ఆనందంగా ఉంటోందని సంతోషించకా దెప్పి పొడుస్తావేంటీ అని రుద్రాణిని ఇందిరాదేవి తిడుతుంది. ఇవేం పట్టించుకోక నీ ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేసి రా అని అపర్ణ అంటుంది.

ఇంతలో కావ్యకు రాజ్ కాల్ చేస్తాడు. అందరూ ఉన్నారని కావ్య లిఫ్ట్ చేయదు. అందరికి వెళ్లొస్తానని చెప్పి వెళ్తుంది కావ్య. ఒక్కసారైన కనీసం మనిషిగా ఆలోచించు. ఎవరైనా సంతోషంగా ఉంటే చాలు నిప్పులు పోస్తావ్ అని అపర్ణ చివాట్లు పెడుతుంది. ఒరేయ్ రాహుల్ ఇది ఇంత టిప్ టాప్‌గా రెడీ అయి వెళ్తుందంటే నాకు ఎక్కడో కొడుతుందిరా. ఇవాళ దాని డెస్టినేషన్ ఏంటో తెలుసుకుని దాని డెస్టినీ మార్చేద్దాం అని రుద్రాణి అంటుంది.

 

డౌట్‌గా చూస్తున్నారు

కావ్యకు రాజ్ తెగ కాల్ చేస్తాడు. రోజురోజుకీ కాలేజ్ కుర్రాడిలా చేస్తున్నారు. కలుద్దామన్న పాపానికి ఫోన్ చేసి చంపేయొచ్చు అనేలా చేస్తున్నారు అని కావ్య కాల్ లిఫ్ట్ చేస్తుంది. నేను వస్తున్నాను. త్వరగా రండి అని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. వస్తున్నట్లు కావ్య చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇంతలో కావ్య వెళ్తుంటే హాయ్ అని రుద్రాణి వాళ్లు ఎంట్రీ ఇస్తారు. ఏంటీ అలా డౌట్‌గా చూస్తున్నారు అని కావ్య అంటుంది.

నువ్వేంటీ అనుమానస్పదంగా మాట్లాడుతున్నావ్ అని రుద్రాణి అంటుంది. నాకేం అంత కర్మ పట్టలేదు. నా ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోడానికి వెళ్తున్నాను అని కావ్య అంటుంది. కావ్యకు పార్టీలు నచ్చుతాయా అని రాహుల్ అంటాడు. నచ్చవని నీకు చెప్పానా అని కావ్య అంటుంది. నిన్ను చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. వింటేజ్‌కు ఎక్కువ వెస్ట్రన్‌కి తక్కువ. వేశాలు వేయకుండా నిజమేంటో చెప్పండి. ఏంటీ కొత్త వేశం అని రుద్రాణి నిలదీస్తుంది.

మరి ఇంత పూర్‌గా ఆలోచిస్తున్నారేంటీ రుద్రాణి గారు. ఏదో దుగ్గిరాల ఇంటికి కోడలిగా వచ్చానని నాలోని వెస్ట్రన్ కావ్యను దాచా. కానీ, ఇక్కడ అందరికోసం కష్టపడి నా ఆనందాన్ని వదిలేసుకుంటున్నాను అని ఈ మధ్య రియలైజ్ అయ్యాను. అందుకే ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటున్నాను. రిసార్టులో ఫుల్‌గా ఎంజాయ్ చేసి వస్తా. మీకు ఏమైన అభ్యంతరా.. వచ్చేస్తాను అని కావ్య వెళ్లిపోతుంది.

 

ఆలోచనలో రుద్రాణి, రాహుల్

ఇది పార్టీ బ్యాచ్ కాదు. వనభోజనాల బ్యాచ్. దీన్ని అస్సలు నమ్మకూడదు. రాజ్ బతికే ఉన్నాడని చెబుతోంది. ఎక్కడ ఉన్నాడో చెప్పట్లేదు. సులువుగా దీన్ని వదులుకోవద్దురా. ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాలి అని రుద్రాణి అంటుంది. ఎలా తెలుసుకోవడం అని రాహుల్, రుద్రాణి ఆలోచనలో పడతారు. మరోవైపు కారులో రాజ్, కావ్య బయలుదేరుతారు. సరదాగా మాట్లాడుకుంటారు.

నాతో వస్తున్నాని చెప్పడానికి ఇబ్బంది పడి ఇంట్లో అబద్ధం చెప్పొచ్చారన్న మాట అని రాజ్ అంటే.. ఛ.. యామినికి నాతో కలిసి రిసార్టుకు వెళ్తున్నాని మీరేమైనా నిజం చెప్పి వచ్చారా అని కావ్య అంటుంది. దాంతో రాజ్ తడబడతాడు. అలా ఇద్దరు అబద్ధం చెప్పి వచ్చామని, కొన్ని పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వస్తుందని కావ్య అంటుంది. దాంతో పర్లేదు. కళావతి గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అని మనసులో అనుకుంటాడు రామ్.

ఏదేమైనా సరే రిసార్టు నుంచి తిరిగి వచ్చేసరికి తన మనసులో ఏముందో తెలుసుకోవాలి అని రాజ్ మనసులో అనుకుంటే.. ఆయనకు ఏ ప్రమాదం జరగకుండా గతం గుర్తుకు వచ్చేలా చేయమని కావ్య కోరుకుంటుంది. మరోవైపు హాల్లో కావ్య గురించే రుద్రాణి, రాహుల్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తారు. కావ్య ఎక్కడికి వెళ్లిందో త్వరగా కనుక్కోని చావు అని రాహుల్‌తో అంటుంది రుద్రాణి.

 

మనవరాలితో ఆడుకోండి

ఇంతలో స్వప్న వచ్చి ఓహో.. ఇక్కడ ఉన్నారా బాబుతో వస్తుంది. రుద్రాణిని చేతులు చాపమని చెప్పి కూతురుని పెడుతుంది. జనాలతో ఆడుకోవడం ఇష్టం కదా కాసేపు మనవరాలితో ఆడుకోండి. మీరు పాపకి తలంటుస్నానం చేయించండి. ఏవండి మీరు బట్టలు వేయండి. అప్పుడప్పుడు మీరు నానమ్మని అయ్యాయని గుర్తు చేసుకోండి అత్తయ్య అని ఆర్డర్ వేస్తుంది స్వప్న.

హమ్మయ్యా. పాపను చూసుకుంటూ వీళ్లు ఇక్కడే బిజీగా ఉంటారు. కావ్య జోలికి వెళ్లరు అని స్వప్న ప్లాన్ ప్రకారం బిడ్డను ఇస్తుంది. కావ్య ఎక్కడికి వెళ్లిందో అని టెన్షన్ పడుతుంటే దీన్ని అంటగట్టింది మాకు అని రుద్రాణి అనుకుంటుంది. దాంతో పాప ఒక్కసారిగా ఏడుస్తుంది. ఆపవే. నేనే అందరిని ఏడిపిస్తాను. నువ్వు నన్ను ఏడిపిస్తున్నావా అని రుద్రాణి అంటుంది.

మమ్మీ కావ్య ఎక్కడికి వెళ్లిందో తెలుసుకునే ఛాన్స్ దొరికింది. స్వప్న మొబైల్. ఇందాక దాని నుంచి కొట్టేశాను. ఈ మొబైల్‌తో ఏమైనా చేయొచ్చు. ఇదిగో ఓపెన్ అయింది. స్వప్న, కావ్య కామన్ ఫ్రెండ్స్ ఒక్కరైనా దొరుకుతారు అని కాల్ చేస్తాడు రాహుల్. నందిని అనే అమ్మాయికి రాహుల్ చేస్తే తన భర్త ఎన్నాళ్లుగా యవ్వారం జరుపుతున్నారు. నీ నెంబర్ ఎంత అని ఫైర్ అవుతాడు.

 

అమ్మ సపోర్ట్‌తోనా

అలాంటి వాన్ని కాదు. కావాలంటే మా మమ్మీని అడగండి. పక్కనే ఉంది అని రాహుల్ అంటే.. హో ఇవన్నీ మీ మమ్మీ సపోర్ట్‌తోనే చేస్తున్నావా. అయితే నిన్ను కాదురా మీ మమ్మీని అనాలి. ఎక్కడున్నారో చెప్పు వచ్చి మీ సంగతి చేస్తా అని తన భర్త అంటాడు. దాంతో రాహుల్ కాల్ కట్ చేస్తాడు. ఇంతలో స్వప్న ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అది చూసి కావ్య ఎక్కడుందో తెలిసిపోయింది. ప్రగతి నగర్ రోడ్ నెంబర్ 2లో ఉన్న రిసార్టుకు వెళ్లింది అని రాహుల్ అంటాడు.

మరి పాపను ఏం చేద్దామని ధాన్యలక్ష్మీ వైపు చూసి ఇవ్వాలనుకుంటారు. మరోవైపు రాజ్ గతం మర్చిపోయినట్లు ఫ్రెండ్స్ అందరికి చెబుతాడు కల్యాణ్. దాంతో శ్రుతి తెగ సంతోషిస్తుంది. ఆఫీస్‌లో ఎక్కడ కనిపిస్తే అక్కడ తిట్టేవారు. ఇప్పుడు తిట్టడానికి ఆయనకు గుర్తులేదుగా అని శ్రుతి అంటుంది. ఇంత శాడిజమా. అన్నయ్యకు గతం గుర్తుకు వచ్చాక ఇదంతా చెబుతా. అప్పుడుంటుంది స్వరాజ్ 2.0 అని కల్యాణ్ అంటాడు.

అమ్మో వద్దని శ్రుతి అంటుంది. ఇంతలో టోనీ వాకర్ అనే పేరులతో కృష్ణ, అర్జున్ మందు తాగుతూ ఎంటర్ అవుతారు. టోనీ వాకర్‌కు బ్రాండ్ అంబాసిడర్స్ అని బాటిల్ ఫినిష్ చేస్తారు. ఇంతకీ మెమోరీ లాస్ ఏడి. కాలేజ్‌లో ప్రిన్సిపల్ కంటే ఎక్కువ స్ట్రిక్ట్‌గా రాజ్ గాడు ఉండేవాడు. వాడి చిప్పు దొబ్బిందట కదా. వాడి వల్ల తాగేవాళ్లం కాదు, స్మోక్ చేసేవాళ్లం కాదు. పదేళ్ల తర్వాత వాడి మీద రివేంజ్ తీసుకునే టైమ్ వచ్చింది. ఈరోజు ఎలాగైనా వాడితో మందు తాగించి, స్మోక్ చేయిస్తాం అని కృష్ణ, అర్జున్ అంటారు.

 

దెబ్బకు గతం గుర్తుకు రావాలి.

మీరేంటీ ఇంత క్రూరంగా ఉన్నారు అని కల్యాణ్ అంటే.. ఫ్రెండ్స్ అని ఇద్దరు అంటారు. దెబ్బకు రాజ్ గాడికి గతం గుర్తు రావాలి. అలా చేసే బాధ్యత మాది అని వాళ్లిద్దరు అంటారు. వీళ్లని నమ్మి బావను చేతిలో పెడితే సమస్య కాదుగా. బావగారికి ఏ ప్రమాదం లేకుండా గతం గుర్తుకు రావడం ముఖ్యం అని అప్పు అంటుంది. ఇంతలో కావ్య, రాజ్ వస్తారు. అప్పును పొట్టి అని పరిచయం చేస్తూ అన్నయ్య అంటాడు కల్యాణ్.

మీరు అచ్చం మా అన్నయ్యలానే ఉన్నారు. అందుకే పిలిచా అని కల్యాణ్ అంటే.. తమ్ముడే అనుకుంటా అని రాజ్ అంటాడు. దాంతో రాజ్‌ను ప్రేమగా కౌగిలించుకుంటాడు కల్యాణ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.