గోవా ఆలయంలో తొక్కిసలాట- ఆరుగురు మృతి, అనేక మందికి గాయాలు..

Best Web Hosting Provider In India 2024

గోవా ఆలయంలో తొక్కిసలాట- ఆరుగురు మృతి, అనేక మందికి గాయాలు..

 

గోవా శ్రీగావ్​లోని లైరాయ్ దేవి ఆలయం వద్ద శనివారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. 15 మందికి పైగా గాయపడ్డారు.

 
గోవాా ఆలయంలో తొక్కిసలాట..
 

గోవాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. శ్రీగావ్​లోని లైరాయ్ దేవి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. 15 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని నార్త్ గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ తెలిపారు.

 

శ్రీదేవి లైరాయ్​ జాతర శుక్రవారం మొదలైంది. జాతర పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కాగా శనివారం ఇక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది.

జాతర నేపథ్యంలో సుమారు 1,000 మంది పోలీసు అధికారులు విధుల్లో ఉన్నారని, రద్దీని నియంత్రించడానికి డ్రోన్లను ఉపయోగించారని అధికారు తెలిపారు. అయినప్పటికీ తొక్కిసలాట జరగడం గమనార్హం.

అంతకుముందు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆయన సతీమణి సులక్షణ, ఎంపీ సదానంద్ షెట్ తనవాడే, ఎమ్మెల్యేలు ప్రేమేంద్ర షెట్, కార్లోస్ ఫెరీరా జాతర కార్యక్రమానికి హాజరయ్యారు.

గోవాలోని ఈ ఆలయం ఉత్తర, దక్షిణ నిర్మాణ శైలుల కలయికకు ప్రసిద్ది చెందింది. ప్రతి మే నెలలో ఈ జాతరను నిర్వహిస్తారు. సాంప్రదాయ అగ్నిపై నడక ఆచారాన్ని కలిగి ఉన్న ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.

గోవా టూరిజం వెబ్సైట్​లో పేర్కొన్నట్లుగా మౌలింగెం సహా సమీప ప్రాంతాలకు చెందిన గ్రామస్థులు రోజంతా లైరాయ్​ దేవికి అంకితం చేసే మతపరమైన ఆచారాలు పాటిస్తారు.

లైరాయ్​ జాతర సందర్భంగా అర్ధరాత్రి సమీపిస్తున్న సమయంలో భక్తులు ఆలయం లోపల ఉత్సాహభరితమైన వృత్తాకార నృత్యం చేస్తారు.

నృత్య సెషన్ల చివరలో, ఎంపిక చేసిన వ్యక్తి ఆలయం సమీపంలో భారీ మంటలను వెలిగిస్తాడు. తెల్లవారుజామున మంటలు ఆరిన తర్వాత వేడివేడి వాతావరణంలో చెప్పులు లేకుండా నడిచే ఆచారం మొదలవుతుంది.

 

దేవి లైరాయ్ పేరును జపిస్తూ భక్తులు బొగ్గుల గుండా పరిగెత్తుతారు. కొందరు ఈ చర్యను అనేకసార్లు పునరావృతం చేస్తారు. సూర్యోదయం సమీపిస్తున్నప్పుడు పండుగ ముగుస్తుంది. ప్రజలు మర్రిచెట్టుపై పూలదండలు వేసి ఇంటికి వెళతారు.


Best Web Hosting Provider In India 2024


Source link