ఓటీటీలో ఈ మలయాళ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ మూవీ ఎంట్రీ కోసం కొనసాగుతున్న వెయిటింగ్.. ఎప్పుడు రావొచ్చు!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో ఈ మలయాళ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ మూవీ ఎంట్రీ కోసం కొనసాగుతున్న వెయిటింగ్.. ఎప్పుడు రావొచ్చు!

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. కానీ ఆలస్యమవుతూనే ఉంది. దీంతో స్ట్రీమింగ్‍పై మరోసారి రూమర్లు వస్తున్నాయి.

ఓటీటీలో ఈ మలయాళ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ మూవీ ఎంట్రీ కోసం కొనసాగుతున్న వెయిటింగ్.. ఎప్పుడు రావొచ్చు!

మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి హీరోగా నటించిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా ఈ ఏడాది జనవరి 23వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ మూవీకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. మోస్తరుగా వసూళ్లు దక్కాయి. అయితే, డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు ఆలస్యమవుతోంది. నిరీక్షణ ఇంకా కొనసాగుతోంది.

ఈ ఓటీటీ దగ్గరే రైట్స్!

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ దగ్గర ఉన్నాయని సమాచారం. మార్చి 7నే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందని రూమర్లు వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం అప్పుడు ఓటీటీలోకి రాలేదు. ఇంకా ఈ మూవీ స్ట్రీమింగ్ కోసం నిరీక్షణ సాగుతోంది.

ఎప్పుడు రావొచ్చు!

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍పై మళ్లీ రూమర్లు వస్తున్నాయి. మే రెండో వారంలో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందని బజ్ నెలకొంది. మరి ఈసారైనా ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతుందా.. ఇంకా ఆలస్యమవుతుందా అనేది చూడాలి. ఇంత ఆలస్యం కావడంతో వేరే ఓటీటీకి ఏమైనా మారుతుందా అనే డౌట్లు కూడా ఉన్నాయి.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ చిత్రంలో మమ్మూట్టితో పాటు గోకుల్ సురేశ్, షైన్ టామ్ చాకో, సుష్మిత భట్, మీనాక్షి ఉన్ని కృష్ణన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్ట్ గౌతమ్ మీనన్ డైరెక్షన్ చేశారు. మమ్మూట్టితో దర్శకుడిగా ఆయన తొలిసారి మూవీ చేయడంతో మంచి బజ్ నెలకొంది. ప్రైవేట్ డిటెక్టివ్‍గా నటించారు మమ్మూట్టి. పోయిన ఓ పర్సును కనుగొనడం, ఆ తర్వాత కేసు బయటపడడం, మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ సినిమా సాగుతుంది.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ కలెక్షన్లు

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా సుమారు రూ.19కోట్ల బడ్జెట్ ఖర్చయింది. ఈ మూవీ ఫుల్ రన్‍లో దాదాపు రూ.19.6కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. సినిమాకు మంచి క్రేజ్ ఉన్నా మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లు దక్కించుకోలేకపోయింది. మమ్మూట్టి మాత్రం డిఫరెంట్ రోల్‍లో యాక్టింగ్‍తో మెప్పించారని కామెంట్లు వచ్చాయి.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ చిత్రాన్ని మమ్మూట్టి కంపెనీ పతాకంపై హీరో మమ్మూట్టినే ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి దర్బూక శివ సంగీతం అందించగా.. విష్ణు దేవ్ సినిమాటోగ్రఫీ చేశారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024