నిన్ను కోరి మే 3 ఎపిసోడ్: తనను శ్రీరాజ్ చంపడం చూసిన రఘురాం- ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా మళ్లీ హత్యాప్రయత్నం- షాలిని డౌట్!

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి మే 3 ఎపిసోడ్: తనను శ్రీరాజ్ చంపడం చూసిన రఘురాం- ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా మళ్లీ హత్యాప్రయత్నం- షాలిని డౌట్!

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ మే 3 ఎపిసోడ్‌లో తనను వ్యాన్‌తో గుద్ది చంపాలనుకుని శ్రీరాజ్ చేయడాన్ని రఘురాం చూస్తాడు. హాస్పిటల్‌లో ఉన్న రఘురాం స్పృహలో ఉండడు. దాంతో భయపడిపోయిన శ్రీరాజ్ వార్డ్ బాయ్ వేషం వేసుకుని మళ్లీ రఘురాంను చంపాలని ప్రయత్నిస్తాడు. శ్రీరాజ్‌పై శాలిని డౌట్ పడుతుంటుంది.

నిన్ను కోరి సీరియల్ మే 3 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జగదీశ్వరికి నిజం చెబుతాను. నువ్వు వెళ్లు అని చంద్రకళతో అంటాడు రఘురాం. దాంతో చంద్రకళ వెళ్లిపోతుంది. జరిగిన విషయాల గురించి రఘురాం ఆలోచిస్తుంటాడు. అది చూసిన శ్రీరాజ్ పక్కనే ఉన్న వ్యాన్ ఎక్కుతాడు. కానీ, దానికి కీ ఉండదు.

శ్రీరాజ్‌ను చూసిన రఘురాం

రెండు వైర్స్ జాయింట్ చేసి వ్యాన్ స్టార్ట్ అయ్యేలా చేస్తాడు శ్రీరాజ్. వరదరాజులు విషయం గురించి విరాట్‌కు తెలిస్తే ఎలా అంటూ ఆలోచిస్తూ రోడ్డుపై నడుస్తున్న రఘురాంను వ్యాన్‌తో గుద్దుతాడు శ్రీరాజ్. తనను వ్యాన్‌తో యాక్సిడెంట్ చేసింది శ్రీరాజ్‌ను రఘురాం చూస్తాడు. తర్వాత వ్యాన్‌ను పక్కకు వెళ్లి ఆపుతాడు శ్రీరాజ్.

రక్తపు మడుగులో ఉన్న రఘురాంను అక్కడున్న వాళ్లు హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. ఇంకా కొన ఊపిరితో రఘురాం ఉంటాడు. అది తెలుసుకున్న శ్రీరాజ్ వాడు ఇంకా చావలేదా. ఇక్కడి నుంచి అయితే తప్పించుకోవాలి అనుకుంటాడు. అంబులెన్స్‌లో రఘురాంను తీసుకెళ్తారు. కట్ చేస్తే హాస్పిటల్‌కు జగదీశ్వరి ఏడుస్తూ వస్తుంది. చాలా పెద్ద యాక్సిడెంట్, చాలా గాయాలు అయ్యాయి, ఆపరేషన్ జరుగుతుంది అని రిసెప్షనిస్ట్ చెబుతుంది.

డాక్టర్ వచ్చి పేషంట్ స్పృహలో లేడని, తలకు బలంగా దెబ్బ తగిలిందని, రక్తం చాలా పోయిందని చెబుతుంది. దాంతో కుప్పకూలిపోతుంది జగదీశ్వరి. ఆయనకు యాక్సిడెంట్ అవడం ఏంట్రా అని జగదీశ్వరి బాధపడుతుంటే ఎవరో వ్యాన్‌తో గుద్దారట అని డాక్టర్ చెబుతుంది. ఇది నిజంగా యాక్సిడెంటేనా అని శాలినీ డౌట్ పడుతుంది. అది విన్న శ్రీరాజ్ భయంతో కంగారుపడుతాడు.

భయపడిపోయిన శ్రీరాజ్

వాడు బతికితే ఆ యాక్సిడెంట్ చేసింది నేనే అని చెప్పేస్తాడు అని భయపడిపోతాడు. ఇంతలో అక్కడికి చంద్రకళ వస్తుంది. ఈ సమయంలో నిజం చెప్పడం కరెక్ట్ కాదని చంద్రకళ అనుకుంటుంది. మీరు వచ్చారు, సమస్యలు మొదలయ్యాయి అని కామాక్షి అంటుంది. జగదీశ్వరి సర్ది చెబుతుంది. వాళ్లే చేసుంటారు అని నా అనుమానం, పగతో వరదరాజులు గారు ఏమైనా అని షాలిని అనుమానిస్తుంది.

ఇంతలో వరదరాజులు ఫ్యామిలీ వస్తుంది. అన్నయ్య అంటూ హగ్ చేసుకుని ఏడుస్తుంది జగదీశ్వరి. వరదరాజులు బాధపడుతున్నట్లు నటిస్తాడు. వరదరాజులు ధైర్యం చెబుతాడు. వరదరాజులు పక్కకు వెళ్లి శ్రీరాజ్‌కు కాల్ చేస్తాడు. అది చూసి షాక్ అయిన శ్రీరాజ్‌ను చంద్రకళ గమనిస్తుంది. ఫోన్ మాట్లాడుకుంటూ శ్రీరాజ్ వెళ్లిపోతాడు. తన వెంటే షాలిని వెళ్లి ఏదో తేడాగా కనిపిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు.

మీ మీద నాకు అనుమానంగా ఉంది. ఈ యాక్సిడెంట్ చేసింది మీరా మీ నాన్నగారా అని నిలదీస్తుంది శాలిని. పెళ్లి ఆపాలని చూస్తాం కానీ, ఇలా ఎందుకు చేస్తాం. ఇప్పటికే మా మీద పడి ఏడుస్తున్నారు. ఇదోటా అని వెళ్లిపోతాడు శ్రీరాజ్. ఎస్కేప్ అవుతున్నాడేంటీ, తేడాగా ఉందే అని శాలిని అనుమానిస్తుంది. మరోవైపు చంపిరమ్మంటే ఏం చేశావ్ అని శ్రీరాజ్‌ను వరదరాజులు తిడతాడు.

స్పృహలోకి వస్తేగానీ

రఘురాం బతికితే మనకు చాలా ప్రమాదం. నువ్ ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. ఆ రఘురాం స్పృహలోకి రాకముందే పైకి పోవాలి అని ఓ ప్లాన్ చెబుతాడు వరదరాజులు. సరేనని శ్రీరాజ్ వెళ్తాడు. వార్డు బాయ్ గెటప్‌లో శ్రీరాజ్ రఘురాం గదిలోకి వెళ్తాడు. రఘురాం స్పృహలోకి వచ్చాక గానీ ఏం చెప్పలేం అని, ఆయన్ను మానిటర్ చేయాలని, ఒక నర్సును ఉంచమని చెప్పమని పెద్ద డాక్టర్ చెబుతాడు.

రఘురాం కండిషన్ బాగానే ఉంది. స్పృహలోకి వచ్చాక పూర్తిగా తెలుస్తుంది అని లేడి డాక్టర్ చెబుతుంది. మరోవైపు రఘురాం గదిలోకి వెళ్లిన శ్రీరాజ్ ఇప్పుడు తప్పించుకోలేవ్ అని దిండు పెట్టి చంపాలనుకుంటాడు. ఆక్సిజన్ మాస్క్ తీసేసి దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేస్తాడు శ్రీరాజ్. మరోవైపు జగదీశ్వరి రఘురాంను ఓసారి చూస్తానని చెబుతుంది.

బతికిపోయామంటూ

డాక్టర్, వరదరాజులు ఆపిన ఆగకుండా ఐసీయూలోకి వెళ్తుంది. వాళ్లు రావడం గమనించిన శ్రీరాజ్ దిండు తీసేసి పక్కకు వెళ్లి దాక్కుంటాడు. శ్రీరాజ్‌ను వరదరాజులు చూస్తాడు. ఏడుస్తున్న జగదీశ్వరిని విరాట్ ఓదారస్తూ తీసుకెళ్తాడు. దాంతో బతికిపోయామని వరదరాజులు, శ్రీరాజ్ అనుకుంటారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024