





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.200 కోట్ల బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ పై క్రేజీ అప్‌డేట్.. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్
మరో బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్ల కు పైగా కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే వారమే స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రేజీ అప్‌డేట్ ఫ్యాన్స్ ను ఎక్సైట్ చేస్తోంది.
ఓటీటీలోకి డిఫరెంగ్ కంటెంట్ ఉన్న మూవీస్ వస్తూనే ఉన్నాయి. కొన్ని డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అయితే.. మరికొన్ని థియేటర్లలో రిలీజైన తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఇలాగే థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. వచ్చే వారమే ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుందనే క్రేజీ బజ్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.
సూపర్ హిట్ మూవీ
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ మూవీ థియేటర్లలో అదరగొట్టింది. మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల దుమ్ము దులిపింది. ఏప్రిల్ 10న థియేటర్లకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది.
ఏ ఓటీటీలో అంటే?
అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు టైమ్ ఆస్నమైనట్లే కనిపిస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ మంచి ధరకే దక్కించుకుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే డేట్ పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ మూవీ మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. ఈ సూపర్ హిట్ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుందన్న మాట.
ఈ ఏడాది సెకండ్ ఫిల్మ్
అజిత్ కుమార్ కు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఈ ఏడాది సెకండ్ మూవీ. విదాముయార్చి తర్వాత ఈ ఏడాది గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ తో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టారు. ఈ చిత్రానికి ఫస్ట్ డే నుంచి మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.
ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఇప్పుడు క్రేజీ అప్ డేట్ వైరల్ అవుతోంది. మే 8న ఈ మూవీ డివిటల్ స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఈ మూవీలో అజిత్ గ్యాంగ్ స్టర్ గా యాక్ట్ చేశారు. త్రిష హీరోయిన్. అర్జున్ దాస్ విలనిజం పండించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు.
సంబంధిత కథనం