తండ్రితో వస్తుండగా తప్పిపోయిన బాలుడు.. ఒంటిపై గాయాలతో చెరువులో డెడ్ బాడీ లభ్యం!

Best Web Hosting Provider In India 2024

తండ్రితో వస్తుండగా తప్పిపోయిన బాలుడు.. ఒంటిపై గాయాలతో చెరువులో డెడ్ బాడీ లభ్యం!

HT Telugu Desk HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu

తండ్రితో కలిసి ఆటోలో వస్తున్న ఆరేళ్ల బాలుడు తప్పిపోయాడు. తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 2 రోజుల తర్వాత బాలుడు ఓ చెరువులో శవమై కనిపించాడు. ఒంటిపై గాయాలున్నాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగింది.

బాలుడు జాన్ పాల్ (ఫైల్ ఫొటో)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామ శివారు లక్ష్మణ్ తండాకు చెందిన వాంకుడోత్ కృష్ణమూర్తి.. ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. మండలంలోని ఆదివారంపేట గ్రామంలోని తన బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండగా.. బుధవారం ఉదయం తన ఆరేళ్ల కొడుకు వాంకుడోత్ జాన్ పాల్ ను తీసుకుని వెళ్లాడు. అక్కడ ఫంక్షన్ కు అటెండ్ అయిన తరువాత.. అదే రోజు మధ్యాహ్నం తన కొడుకును తీసుకుని రిటర్న్ అయ్యాడు.

ఆచూకీ దొరకలేదు..

ఆటోలో తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో నిద్ర రావడంతో ఆటోను రోడ్డు పక్కన ఆపి పడుకున్నాడు. లేచి చూసేసరికి బాలుడు కనిపించడం లేదు. దీంతో తన కొడుకు తప్పిపోయాడని అదే రోజు సాయంత్రం కృష్ణమూర్తి గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ వైపు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వగా.. మరోవైపు కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. గురువారం వరకు వెతికినా ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు.

చెరువులో శవమై..

ఈ క్రమంలోనే గూడూరు మండలంలోని భూపతిపేట గ్రామ సమీపంలోని ఓ చెరువులో గుర్తు తెలియని బాలుడి శవం ఉందని.. శుక్రవారం మధ్యాహ్నం స్థానికులు గుర్తించారు. ఈ మేరకు గూడూరు పోలీసులకు సమాచారం అందించగా.. ఎస్సై గిరిధర్ రెడ్డి, తన సిబ్బందితో కలిసి వెంటనే చెరువు వద్దకు చేరుకున్నారు. కృష్ణమూర్తి ఫిర్యాదు చేసిన వాంకుడోతు జాన్ పాల్ మృతదేహంగా గుర్తించారు. ఆ వెంటనే కృష్ణమూర్తి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు.

ప్రమాదమా.. హత్యా..?

గూడూరు పోలీసులు భూపతిపేట చెరువు నుంచి బాలుడు జాన్ పాల్ మృత దేహాన్ని బయటకు తీశారు. డెడ్ బాడీని పరిశీలించగా.. బాలుడి మృతదేహంపై గాయాలు కనిపించాయి. బాలుడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడా.. లేదా ఎవరైనా కొట్టి చంపారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకవేళ కొట్టి చంపి ఉంటే.. ఆ అవసరం ఎవరికి ఉంటుందనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న గూడూరు పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

HT Telugu Desk

సంబంధిత కథనం

టాపిక్

WarangalCrime TelanganaTs PoliceTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024