





Best Web Hosting Provider In India 2024

నోటి చుట్టూ ఉన్న చర్మం నల్లగా మారిందా? ఈ ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి
నోటి చుట్టూ పిగ్మెంటేషన్ చాలా మందికి ఇబ్బంది పెడుతుంది. అలాగే అక్కడి చర్మం నల్లగా మారి అందవిహీనంగా మారుతాయి. ఆ నలుపును తగ్గించుకోవడానికి ప్రత్యేకమైన ఫేస్ ప్యాక్ ను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గి సాధారణంగా మారుతుంది.
చాలా మంది అమ్మాయిలకు పెదవుల చుట్టూ నలుపుగా మారుతుంది. ఈ సమస్యతో ఎంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. నోటి చుట్టూ పిగ్మెంటేషన్ ఉండి చర్మంతో నలుపుగా కనిపిస్తుంది.
ఈ సమస్యను ఎదుర్కోవవాలంటే మీరు ఈ హోం మేడ్ ఫేస్ మాస్క్ ను రెండు రోజులు ప్రయత్నించవచ్చు. ఇది చర్మం రంగును సమంగా చేయడానికి, సహాయపడుతుంది. వదిలించుకోవడానికి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
పెదవుల చుట్టూ ఉన్న చర్మం మిగిలిన ముఖం కంటే ముదురు రంగులో కనిపిస్తే ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండుసార్లు అప్లై చేయాలి. దీన్ని తయారు చేయడానికి, బంగాళాదుంపలు, శనగపిండి, నిమ్మకాయ, తేనె అవసరం.
ఫేస్ ప్యాక్ తయారీ
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి బంగాళాదుంపలను చిన్న ముక్కలుగా కోసి గ్రైండ్ చేసి రసం తీయాలి. ఇప్పుడు ఈ జ్యూస్ లో శెనగపిండి, నిమ్మరసం కలపాలి. అలాగే తేనెను కలపాలి. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసే గుణాలు తేనెలో ఉన్నాయి. దీనివల్ల చర్మంపై పొడిబారకుండా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ ను నోటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో అప్లై చేసి ఆరనివ్వాలి. పదిహేను నిమిషాల తర్వాత తడి టవల్ తో తేలికగా రుద్దుతూ ఈ ఫేస్ ప్యాక్ ను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న ప్యాక్ ను సులభంగా తొలగించడంతో పాటు డెడ్ స్కిన్ ను క్లియర్ చేస్తుంది. చాలాసార్లు నోటి చుట్టూ మృత కణాలు పేరుకుపోతాయి. అవి కూడా తొలగిపోతాయి.
తరచూ ఎండవల్ల కూడా నోటి చుట్టూ ఉన్న చర్మంపై నలుపు కనిపిస్తుంది. దీన్ని నివారించాలంటే సన్ స్క్రీన్ తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. వాస్తవానికి, నోటి చుట్టూ సన్ స్క్రీన్ అప్లై చేస్తే మంచిది. కానీ చాలాతక్కువ మంది మాత్రమే ఈ ప్రాంతంలో సన్ స్క్రీన్ అప్లై చేస్తారు. ఇక్కడున్న చర్మంపై టానింగ్ త్వరగా జరుగుతుంది. కాబట్టి పెదాల చుట్టూ సన్ స్క్రీన్ రాయాల్సిన అవసరం ఉంది.
ఇలా నోటి చుట్టు నలుపు చర్మాన్ని కలిగి ఉండే సమస్య ‘మంకీ మౌత్’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మహిళలకు ఇది ప్రధాన సమస్యగా మారింది. ఇక్కడ మేము చెప్పిన చిన్న చిట్కాతో ఆ సమస్యను వదిలించుకోవచ్చు.