




Best Web Hosting Provider In India 2024

ఓటీటీల్లో ఈ వారం తెలుగులో వచ్చిన 4 సినిమాలు, ఓ రొమాంటిక్ సిరీస్.. ఈ వీకెండ్ చూసేయండి!
ఓటీటీల్లో తెలుగులో ఈ వారం కొన్ని సినిమాలు అడుగుపెట్టాయి. థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు వివిధ జానర్లలో వచ్చాయి. ఓ చిత్రం నేరుగా అడుగుపెట్టింది. ఓ మలయాళ మూవీ తెలుగు డబ్బింగ్లో అందుబాటులోకి వచ్చింది.
ఓటీటీల్లో ఈ వారం తెలుగులో కొత్త కంటెంట్ చూడాలనుకుంటున్నారా.. అయితే తాజాాగా కొన్ని ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈవారం (ఏప్రిల్ 28 – మే 3) తెలుగులో నాలుగు చిత్రాలు వివిధ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. నవీన్ చంద్ర హీరోగా నచించిన ఓ థ్రిల్లర్ మూవీ ఇందులో ఉంది. ఓ తెలుగు మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. ఓ మలయాళ సినిమా డబ్బింగ్లోనూ వచ్చింది. ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 4 లేటెస్ట్ సినిమాలు, ఓ సిరీస్ ఇవే..
28 డిగ్రీ సెల్సియస్
తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం 28 డిగ్రీస్ సెల్సియస్ సినిమా ఏప్రిల్ 29వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెట్టింది. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 4న థియేటర్లలో రిజైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అనుకున్న రేంజ్లో కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది. థియేటర్లలో రిలీజైన నెలలోగానే 28 డిగ్రీస్ సెల్సియస్ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ మూవీకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.
ముత్తయ్య
తెలుగు రూరల్ డ్రామా మూవీ ముత్తయ్య నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇచ్చింది. మే 1వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సినిమాలో బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకు భాస్కర్ మౌర్య దర్శకత్వం వవహించారు. నటుడు కావాలని 70ఏళ్ల వయసులోనూ పట్టుదలగా ఉండే ఓ వృద్ధుడి ప్రయత్నాల చుట్టూ ముత్తయ్య సినిమా సాగుతుంది.
బ్రొమాన్స్
మలయాళ అడ్వెంచర్ కామెడీ మూవీ బ్రొమాన్స్ ఏప్రిల్ 30వ తేదీన సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్లోనూ అడుగుపెట్టింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీలో సోనీలివ్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాలో మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రలు పోషించగా.. డైరెక్టర్ అరుణ్ జీ జోస్ తెరకెక్కించారు. థియేటర్లలోనూ ఈ బ్రొమాన్స్ మూవీ మంచి హిట్ అయింది. ఇప్పుడు సోనీలివ్ ఓటీటీ చూసేయవచ్చు.
గ్రాఫ్టెడ్
ఇంగ్లిష్ బాడీ హారర్ థ్రిల్లర్ మూవీ ‘గ్రాఫ్టెడ్’ ఏప్రిల్ 29వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్కు వచ్చింది. ఇంగ్లిష్తో పాటు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్లోనూ అడుగుపెట్టింది. జెయేనా సన్, జెన్ హాంగ్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది.
ష్
తమిళ వెబ్ సిరీస్ ‘ష్’ (Sshhh) ఈ వారమే ఆహా ఓటీటీలో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ రొమాంటిక్ ఆంథాలజీ సిరీస్లో శ్రీకాంత్, సోనియా అగర్వాల్, ఇనయా, ఐశ్వర్య దత్తా, క్రిషా కురుప్, మైమ్ గోపీ ప్రధాన పాత్రలు పోషించారు. నాలుగు కథలో ఉండే ఈ సిరీస్కు పృథ్వి ఆదిత్య, వాలి మోహన్ దాస్, హరీశ్, కార్తికేయన్ దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం