





Best Web Hosting Provider In India 2024

నితిన్ లేటెస్ట్ యాక్షన్ కామెడీ మూవీ టెలికాస్ట్ డేట్, టైమ్ ఫిక్స్.. ఓటీటీలోనూ అదే సమయానికి: వివరాలివే
రాబిన్‍హుడ్ సినిమా టీవీ ప్రీమియర్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. అదే సమయానికి ఈ చిత్రం ఓటీటీలోనూ అడుగుపెట్టనుంది. కాస్త ఆలస్యంగానే ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఈ సినిమా టీవీ ప్రీమియర్, ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
తెలుగు కామెడీ యాక్షన్ మూవీ ‘రాబిన్‍హుడ్’కు బాక్సాఫీస్ వద్ద నిరాశ ఎదురైంది. నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఈ ఏడాది మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ రాబిన్‍హుడ్ సినిమా టీవీ ఛానెల్‍లోకి వచ్చేస్తోంది. అదే సమయానికి ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. డేట్, టైమ్ కూడా ఖరారయ్యాయి.
టీవీ ప్రీమియర్ వివరాలివే
రాబిన్‍హుడ్ సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్‍లో మే 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ విషయంపై జీ తెలుగు నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. అంటే వచ్చే శనివారం మే 10న సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ టెలికాస్ట్ కానుంది.
అదే సమయానికి ఈ ఓటీటీలో..
జీ నెట్‍వర్క్ ఇటీవల కొత్త స్ట్రాటజీ అమలు చేస్తోంది. చిత్రాలను టీవీ ప్రీమియర్, ఓటీటీ స్ట్రీమింగ్‍కు ఒకేసారి తెస్తోంది. టీవీలో మంచి టీఆర్పీల కోసం ఈ ప్లాన్ ఫాలో అవుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో దీన్ని అమలు చేసి సక్సెస్ అయింది. ఇప్పుడు రాబిన్‍హుడ్ సినిమా కూడా టీవీ ప్రీమియర్ టైమ్‍లోనే జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. అంటే ఈ మూవీ ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.
రాబిన్‍హుడ్ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. గతంలో నితిన్ – వెంకీ కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అవటంతో మంచి బజ్ ఏర్పడింది. కానీ రాబిన్‍హుడ్ మాత్రం బోల్తా కొట్టింది. ఈ సినిమాలో నితిన్, శ్రీలీలతో పాటు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, కేతిక శర్మ కీలకపాత్రలు పోషించారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చేశారు.
బాక్సాఫీస్ డిజాస్టర్
రాబిన్‍హుడ్ సినిమా కలెక్షన్ల విషయంలో తీవ్రంగా నిరాశపరించింది. ఈ చిత్రం సుమారు రూ.50కోట్ల బడ్జెట్‍తో రూపొందిందని అంచనాలు వెలువడ్డాయి. ఈ సినిమా ఓవరాల్‍గా రూ.15కోట్ల కలెక్షన్ల మార్క్ కూడా దాటలేకపోయింది. కమర్షియల్‍గా భారీ డిజాస్టర్ అయింది. మరి టీవీ ప్రీమియర్, జీ5 ఓటీటీ స్ట్రీమింగ్‍లో రాబిన్‍హుడ్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
రాబిన్‍హుడ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ప్రొడ్యూజ్ చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి కోటి ఎడిటింగ్ చేశారు.
సంబంధిత కథనం