




Best Web Hosting Provider In India 2024

విజయ్ దేవరకొండతో రష్మిక మరోసారి? ఆ ట్వీట్లు, రిప్లై అర్థమిదేనా!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మరోసారి కలిసి నటించనున్నారనే రూమర్లు బయటికి వచ్చాయి. దర్శకుడు, ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ చేయడం, రష్మిక రిప్లై ఇవ్వడంతో ఇవి జోరందుకున్నాయి. ఏం జరిగిందంటే..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా మధ్య ప్రేమ ఉందని కొన్నేళ్లుగా రూమర్లు ఉన్నాయి. ఈ విషయంపై ఇద్దరూ స్పందించకపోయినా చాలాసార్లు హింట్స్ ఇచ్చారు. ఈ జోడీకి స్పెషల్ క్రేజ్ ఉంది. గతంలో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో విజయ్, రష్మిక హీరోహీరోయిన్లుగా కలిసి నటించారు. వీరి జోడీ చాలా ఆకట్టుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి ఓ చిత్రంలో నటించనున్నారనే రూమర్లు బయటికి వచ్చాయి. ట్వీట్లు, రిప్లైతో మరింత పెరిగిపోయాయి.
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శక్వంలో విజయ్ దేవరకొండ ఓ మూవీ చేయనున్నారు. కింగ్‍డమ్ పూర్తయిన వెంటనే ఆ మూవీ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే షూటింగ్ ముందు పనులను రాహుల్ వేగంగా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటిస్తుందంటూ జోరుగా జరుగుతోంది. కొన్ని ట్వీట్లే ఈ రూమర్లకు కారణంగా ఉన్నాయి.
దర్శకుడు, మేత్రీ మూవీ మేకర్స్, ట్వీట్స్
#HmmLetsSee అంటూ రష్మిక మందన్నాను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. విజయ్ – రాహుల్ కాంబోలో సినిమాను నిర్మించనున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ కూడా #HmmLetsSee అంటూ రష్మికను ట్యాగ్ చేసి పోస్ట్ చేసింది. ఇది తప్ప ఏ వివరాలు ఆ ట్వీట్‍లో చెప్పలేదు.
రష్మిక రిప్లై
మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్‍కు రష్మిక మందన్నా రిప్లై ఇచ్చారు. హమ్ గాయ్స్ అంటూ కామెంట్ చేశారు. ఇది నిజమే అన్నట్టుగా రియాక్ట్ అయ్యారు. డైరెక్టర్ రాహుల్, మైత్రీ మూవీ మేకర్స్ ఒకే హ్యాష్ ట్యాగ్‍తో ట్వీట్ చేయడం, నిజమే అనేలా రష్మిక స్పందించడంతో విజయ్ దేవరకొండ సినిమా గురించే అనే అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇంకా రాని క్లారిటీ!
ఈ ట్వీట్లీ, రిప్లైలతో విజయ్ దేవరకొండ – రష్మిక ముచ్చటగా మూడోసారి జత కట్టనున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇంకా మూవీ టీమ్ నుంచి స్పష్టమైన ఫుల్ క్లారిటీ రాలేదు. మరి ఇది మూవీ గురించేనా.. మరేదైనా అనేది కూడా చూడాలి. ఒకవేళ విజయ్, రష్మిక మళ్లీ కలిసి నటిస్తే క్రేజ్ మరో రేంజ్‍లో ఉంటుంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న కింగ్‍డమ్ చిత్రం ఈనెల మే 30వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత రాహుల్ సంకృత్యాన్‍తో మూవీకి విజయ్ మొదలుపెడతారు. ఇది పీరియడ్ యాక్షన్ చిత్రంగా ఉండనుంది. భారీ బడ్జెట్‍తో నిర్మించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది. గతంలో విజయ్ – రాహుల్ కాంబోలో వచ్చిన ట్యాక్సీవాల్ సూపర్ హిట్ అయింది.
సంబంధిత కథనం