





Best Web Hosting Provider In India 2024

బుల్లితెరపైకి ఓటీటీలో దంచికొట్టిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. రేపే టీవీ ప్రీమియర్.. ఏ ఛానెల్‌లో అంటే?
ఓటీటీ, థియేటర్‌లలో మంచి హిట్ అందుకున్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయనుంది. త్రిష, టొవినో థామస్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించి ఆకట్టుకున్న ఐడెంటిటీ ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత టీవీ ప్రీమియర్ కానుంది. మరి ఐడెంటిటీ టీవీ ప్రీమియర్ వివరాలు చూద్దాం.
ఇటీవల కాలంలో థియేటర్లలో సినిమాలు విడుదల కావడం, ఆ తర్వాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవడం, అనంతరం బుల్లితెరపై సందడి చేయడం జరుగుతోంది. థియేటర్లలో హిట్ ఫ్లాప్‌లు అంటూ సంబంధం లేకుండా ఓటీటీల్లో సినిమాలు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి.
పాపులర్ స్టార్స్
ఇక థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు మరింతగా ఓటీటీలో ఆదరణ పొందుతున్నాయి. ఆ తర్వాత టీవీ ప్రీమియర్‌కు వచ్చేసి ప్రేక్షకుల ఇంట్లోకి చేరుతున్నాయి. ఇప్పుడు అలానే ఓ సినిమా రానుంది. ఆ మూవీనే ఐడెంటిటీ. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, స్టార్ హీరోయిన్ త్రిష, హనుమాన్ విలన్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే ఐడెంటిటీ.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
ఒక జోనర్‌లో కాకుండా రెండు, మూడు జోనర్స్‌లో ఐడెంటిటీ ఆకట్టుకుంటుంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ప్రారంభమయ్యే ఐడెంటిటీ క్రమంగా యాక్షన్ మోడ్‌లోకి వెళ్తుంది. డ్రగ్స్, అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు, బ్లాక్ మెయిల్, దేశ రక్షణ వంటి అంశాలతో ఐడెంటిటీ మంచి హిట్ కొట్టింది.
జీ5 ఓటీటీలో
మలయాళంతోపాటు తెలుగులో విడుదలైన ఐడెంటిటీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత జీ5 ఓటీటీలో తెలుగులో ఐడెంటిటీ ఓటీటీ రిలీజ్ అయింది. ఓటీటీ టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో కొద్దిరోజులుపాటు కొనసాగింది. అలా ఓటీటీలో ఐడెంటిటీ మూవీ దంచికొట్టింది. అయితే, ప్రస్తుతం జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఐడెంటిటీ బుల్లితెరపై సందడి చేయనుంది.
బుల్లితెరపై ఐడెంటిటీ
ప్రముఖ టీవీ ఛానెల్ జీ తెలుగులో ఐడెంటిటీ టీవీ ప్రీమియర్ కానుంది. అది కూడా రేపు (మే 4) జీ తెలుగులో ఐడెంటిటీ ప్రసారం కానుంది. జీ తెలుగులో మే 3న మధ్యాహ్నం 3 గంటలకు ఐడెంటిటీ సమ్మర్ స్పెషల్‌గా టీవీ ప్రీమియర్ కానుంది. ఇప్పటి వరకు థియేటర్, ఓటీటీలో అదరగొట్టిన ఐడెంటిటీ బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.
ముగ్గురు డిఫరెంట్ వ్యక్తులు
ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.4 రేటింగ్ సాధించుకున్న ఐడెంటిటీ సినిమా ఒక మర్డర్, ముగ్గురు డిఫరెంట్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు, ఒకరిపై మరొకరికి అనుమానం వచ్చేలా ఇన్వెస్టిగేషన్, ఆ మర్డర్‌కు ఉన్న లింక్స్ వంటి ఆసక్తికర అంశాలతో సాగుతుంది.
గూగుల్ యూజర్స్
ఇక అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ఐడెంటిటీ చిత్రాన్ని 62 శాతం మంది గూగుల్ యూజర్స్ లైక్ చేశారు. మరి అడుగడుగునా వచ్చే ట్విస్టులు, థ్రిల్లింగ్ సీన్స్‌తో కట్టిపడేసే ఐడెంటిటీ మూవీని జీ5 ఓటీటీతోపాటు రేపు జీ తెలుగులో ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
సంబంధిత కథనం