




Best Web Hosting Provider In India 2024

మిస్ వరల్డ్ విజేతకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారో తెలుసా? జీవితం ఈ ఒక్క విజయంతో సెటిలైపోతుంది
మిస్ వరల్డ్ అందాల పోటీలకు హైదరాబాదే వేదికగా మారింది. అందుకే ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మిస్ వరల్డ్ పోటీలపై ఆసక్తి నెలకొంది. ఈ పోటీలో గెలిచిన విజేతకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారో తెలుసుకుందాం.
మిస్ వరల్డ్ పోటీలకు ఇప్పుడు ఎంతో ప్రజాభిమానం దొరికింది. కానీ ఒకప్పుడు అందాల పోటీలు అంటేనే అసహ్యించుకునేవారు. ఇప్పుడు అందాల పోటీల్లో పాల్గొనే వారిని చూసి అభిమానులు అయిపోతున్నారు.
మిస్ వరల్డ్ పోటీలు ఈ సంవత్సరం మే నెలలో హైదరాబాదులోనే జరగబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఈ నగరం వైపే దృష్టి పెట్టబోతున్నాయి.
మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందగత్తెలంతా హైదరాబాదు నగరానికి చేరుకున్నారు. ఆ కిరీటం కోసం పోటీ పడుతున్నారు. కేవలం మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే పేరు మాత్రమే కాదు, బహుమతిగా డబ్బు ఎంతో పేరు కూడా వస్తుంది. నిజానికి వారి లైఫ్ సెటిల్ అయిపోవచ్చని చెప్పుకోవచ్చు. ఒక మనిషి జీవితాంతం ఉద్యోగం చేస్తే ఎంత సంపాదించగలడో అంత నగదు ఒక్క మిస్ వరల్డ్ విజేతగా నిలిచి సంపాదించుకోవచ్చు. అంతేకాదు ఆ పేరు, కీర్తితో ఎన్నో అవకాశాలను దక్కించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణాలు కూడా చేయవచ్చు.
మిస్ వరల్డ్ ప్రైజ్ మనీ
మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన అందగత్తెకు అక్షరాలా మిలియన్ డాలర్లను అందిస్తారు. అంటే మన భారత రూపాయల్లో ఎనిమిదిన్నర కోట్ల రూపాయలకు పైగానే. ఒక భారత వ్యక్తి జీవితాంతం ఒక ఉన్నతోద్యోగం చేస్తే వచ్చే జీతం అది. అలాంటిది ఒక్క పోటీతోనే మిస్ వరల్డ్ విజేత సంపాదించేస్తుంది.
అంతేకాదు ఆమెకి ఎంతో ఖ్యాతి, పేరు కూడా వస్తుంది. ఆమెకు అడ్వర్వటయిమెంట్ల రూపంలో కూడా ఎన్నో అవకాశాలు డబ్బు సంపాదించేందుకు వస్తాయి. అలాగే మిస్ వరల్డ్ విజేతలు దాతృత్వ కార్యక్రమాల్లో కూడా ప్రపంచమంతా తిరుగుతారు. అలా తిరిగినందుకు ప్రతి రూపాయి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ లేదా స్పాన్సర్లు పెట్టుకుంటారు. ఈమెకు రూపాయి కూడా ఖర్చు కాదు. మిస్ వరల్డ్ కిరీటం గెలిచిందంటే ఆమె జీవితం సంతోషంగా సెటిల్ అయిపోయినట్టే.
బ్యూటీ విత్ ఎ పర్పస్
మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆ విజేత ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ అనే కార్యక్రమం మీద మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తరపున ప్రపంచ రాయబారిగా ఏడాది పాటు ముఖ్యపాత్రను పోషిస్తారు. ఆమె చాలా బిజీ షెడ్యూలులో ఉంటుంది. ఏడాది వరకు ఆమె ఏ దేశంలో ఉంటుందో కూడా చెప్పడం కష్టమే. దాతృత్వ కార్యక్రమాల్లో భాగంగా ఆరోగ్యం, విద్య, జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి అంతర్జాతీయ ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చేందుకు ప్రయాణం చేస్తుంది.
మిస్ వరల్డ్ పోటీలో 1951 నుండి జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాదులో జరగబోయే పోటీలకు భారతదేశం తరపున రాజస్థాన్ కు చెందిన నందిని గుప్తా పోటీ పడబోతోంది. చివరగా మిస్ వరల్డ్ టైటిల్ మనకు మానుషి చిల్లర్ 2017లో తీసుకొచ్చింది.
టాపిక్