





Best Web Hosting Provider In India 2024

శుభం మూవీ నుంచి జన్మ జన్మల బంధం సాంగ్ రిలీజ్ – స్పెషల్ అట్రాక్షన్‌గా సమంత
సమంత శుభం మూవీ నుంచి జన్మ జన్మల బంధం అనే ప్రమోషనల్ సాంగ్ శుక్రవారం రిలీజైంది. ఈ సాంగ్‌లో ప్రధాన పాత్రధారులతో పాటు సమంత కూడా నటించింది. శుభం మూవీ మే 9న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతోనే నిర్మాతగా సమంత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
హీరోయిన్ సమంత నిర్మిస్తున్న శుభం మూవీ నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజైంది. జన్మ జన్మల బంధం పేరుతో సాగిన ఈ సాంగ్‌లో సమంత కూడా కనిపించింది. రెట్రో పాప్ స్టైల్‌లో సాగిన ఈ రీమిక్స్ పాటలో ప్రధాన పాత్రధారులతో పాటు సమంత కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కనిపించింది.
జన్మజన్మల బంధం సాంగ్‌ను బినాకా గోమ్స్, జైన్ బాక్స్‌వాలా ఆలపించారు. షోర్ పోలీస్, జైన్ బాక్సావాలా, అభిరామ్ మహాంకాలి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. షోర్ పోలీస్ మ్యూజిక్ అందించారు.
మే 9న రిలీజ్…
శుభం మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి కీలక పాత్రల్లో నటించారు. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేంగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది.మే 9న ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇటీవల రిలీజైన శుభం మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. నవ్వు, భయం తో పాటు అన్ని రకాల ఎమోషన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా ఈ ట్రైలర్ సాగింది. శుభం సినిమాకు వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తోండగా… క్లింటన్ సెరెజో పాటలకు మ్యూజిక్ అందిస్తున్నారు
ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌లతో…
శుభం మూవీతోనే సమంత చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతుంది. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌లు, ప్రయోగాత్మక కథాంశాలతో కూడిన చిన్న సినిమాలను నిర్మించేందుకు ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించింది సమంత.
ఖుషి తర్వాత గ్యాప్…
కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది సమంత. 2023లో రిలీజైన ఖుషి మూవీతో చివరగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. హిందీలో గత ఏడాది సిటాడెల్ వెబ్‌సిరీస్ చేస్తోంది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ అనే మరో వెబ్‌సిరీస్‌లో కనిపించబోతున్నది. ఈ హారర్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
శుభం…పరదా…
సినిమా బండి మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రవీణ్ కాండ్రేంగుల. శుభం మూవీతో పాటు పరదా మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
సంబంధిత కథనం