




Best Web Hosting Provider In India 2024
షాకింగ్.. డ్రగ్ టెస్టులో దొరికిన స్టార్ పేసర్.. అందుకే ఐపీఎల్ కు దూరం.. సస్పెన్షన్ వేటు
ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ సత్తాచాటిన స్టార్ పేసర్ తాత్కాలిక సస్పెన్షన్ ఎదుర్కొన్నాడు. డ్రగ్ టెస్టులో దొరికిపోయిన ఈ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్ 2025 మధ్యలో దక్షిణాఫ్రికా వెళ్లిపోయాడు.
ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ఉన్నట్లుండి గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబడా స్వదేశం దక్షిణాఫ్రికా వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ ఫాస్ట్ బౌలర్ ఎందుకు వెళ్లాడో ఎవరికీ తెలియలేదు. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు రబాడ సీజన్ మధ్యలో వెళ్లిపోవడంపై ఓ క్లారిటీ వచ్చింది. డ్రగ్ టెస్టులో రబాడ పాజిటివ్ గా తేలడమే ఇందుకు కారణం.
డ్రగ్ టెస్టులో పాజిటివ్
ప్రొటీస్ పేసర్ కగిసో రబాడ ఎట్టకేలకు ఐపీఎల్ 2025కు దూరం కావడానికి గల కారణాన్ని వెల్లడించాడు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ గా తేలడంతో తాత్కాలిక సస్పెన్షన్ అనుభవిస్తున్నానని వెల్లడించాడు. అభిమానులను నిరాశపరిచినందుకు క్షమించాలని కోరాడు. క్రికెట్ ఆడే అవకాశాన్ని తానెప్పుడూ తేలిగ్గా తీసుకోనని పేర్కొన్నాడు. ఎస్ఏ20లో ఎంఐ కేప్‌టౌన్ తరఫున ఆడే సమయంలో అతను డ్రగ్స్ తీసుకున్నాడు. అయితే ఇది పనితీరును పెంచేది కాదు.
‘‘వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ మధ్యలో నుంచి ఇటీవల దక్షిణాఫ్రికాకు తిరిగొచ్చా. సరదాగా వినోదం కోసం డ్రగ్ తీసుకున్న. డ్రగ్ టెస్టులో పాజిటివ్ గా తేలింది. దీనికోసమే వెళ్లా. నిరాశపర్చిన ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్తున్నా. క్రికెట్ ఆడే అవకాశాన్ని నేనెప్పుడూ తేలిగ్గా తీసుకోను. తాత్కాలిక సస్పెన్షన్ అనుభవిస్తున్నా. తిరిగి ఆడేందుకు ఎదురుచూస్తున్నా’’ అని రబాడ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
ఇండియాలో పేసర్
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం.. ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్ ల కోసం రబాడ ఇండియాకు తిరిగొచ్చాడని తెలిసింది.
“నేను ఒంటరిగా ఈ సస్పెన్షన్ ను అనుభవించలేను. నా ఏజెంట్, సీఎస్ఏ, గుజరాత్ టైటాన్స్ అందించిన సహకారానికి ధన్యవాదాలు. నా న్యాయ బృందానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా నా స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రేమకు కృతజ్ఞతలు’ అని రబాడ తెలిపాడు.
రెండు మ్యాచ్ ల్లో
ఐపీఎల్ 2025లో శుభ్మ న్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తరఫున రెండు మ్యాచ్ లు ఆడిన రబాడ రెండు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఈ టీ20 టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్ ల్లో పాల్గొనేందుకు 10-12 రోజుల్లో ప్రొటీస్ పేసర్ రబాడ తిరిగి వస్తాడని ఫ్రాంచైజీ ఆశిస్తోందని గిల్ ఇటీవల చెప్పాడు. కానీ క్రిక్ ఇన్ఫో మాత్రం అతను ఇండియాకు తిరిగొచ్చాడని పేర్కొంది. 2024 నవంబర్‌లో సౌదీ అరేబియాలో జరిగిన మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ రబాడను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link