ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో 175 ఉద్యోగాలు, నెలకు రూ.60 వేల జీతం-ఇలా దరఖాస్తు చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో 175 ఉద్యోగాలు, నెలకు రూ.60 వేల జీతం-ఇలా దరఖాస్తు చేసుకోండి

Bandaru Satyaprasad HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu

ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 175 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు మే 13వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో 175 ఉద్యోగాలు, నెలకు రూ.60 వేలు జీతం-ఇలా దరఖాస్తు చేసుకోండి
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులు శుభవార్త చెప్పింది. ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో 175 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంబీఏ లేదా ఏదైనా పీజీ అర్హతతో పోస్టులను భర్తీ చేయనుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ పీ4 కార్యక్రమాన్ని సమన్వయం చేసేలా ఈ పోస్టులను భర్తీ చేయనుంది.

కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఏడాది కాలానికి మాత్రమే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అనంతరం పరిస్థితులను బట్టి పొడిగించే అవకాశం ఉండవచ్చు.

ముఖ్యాంశాలు

  • ఏపీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 175 పోస్టులను భర్తీ చేయనున్నారు.
  • ఎంబీఏ లేదా ఏదైనా పీజీ అర్హత కలిగిన యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్ల వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
  • ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60 వేల వేతనం ఇస్తారు.
  • ఈ పోస్టులకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తులకు మే 13 చివరితేదీ.
  • విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తుల వయోపరిమితి 2025 మే 1వ తేదీ నాటికి 40 ఏళ్లకు మించకూడదు.
  • ఈ పోస్టులు సంబంధించిన ఇతర వివరాల కోసం https://apsdpscareers.com/YP.aspx లో చూసుకోవచ్చు.
  • దరఖాస్తు సమయంలో పాస్ పోర్ట్ సైజు ఫొటో, రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ :

1. విద్యార్హతలు, అనుభవం

2. రాత పరీక్ష

3. వ్యక్తిగత ఇంటర్వ్యూ

ఉండాల్సిన నైపుణ్యాలు

  • డేటా ఎనాలసిస్, ప్రాజెక్ట్ అమలు, డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడంలో నైపుణ్యం.
  • ప్రభుత్వ సంస్థలు, మల్టీలెటరల్ సంస్థలు లేదా ప్రముఖ కన్సల్టింగ్ సంస్థలలో పాలన పరమైన విధులు నిర్వర్తించిన అనుభవం.
  • డేటా విశ్లేషణలు, GIS మ్యాపింగ్, డిజిటల్ డాష్‌బోర్డ్‌లు, ఇంపాక్ట్ అంచనా సాంకేతిక నైపుణ్యం
  • స్ట్రాంగ్ క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ పరిశోధన నైపుణ్యాలు
  • బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, బృందాలలో పని చేసే సామర్థ్యం, ​​మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్)లో ప్రావీణ్యం, స్థానిక సమస్యలు, సమాజ అభివృద్ధి, స్టేక్ హోల్డర్స్ నిర్వహణపై అవగాహన.
  • సమస్య పరిష్కార మనస్తత్వం, ఫలితాల-ఆధారిత విధానంతో ఒత్తిడి వాతావరణంలో పని చేయగల సామర్థ్యం.
  • తెలుగు, ఇంగ్లీష్ లో ప్రావీణ్యం

నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsJobsAp JobsTrending ApTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024