నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చిన క‌న్న‌డ యాక్ష‌న్ కామెడీ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్ – గెస్ట్ రోల్‌లో పుష్ప విల‌న్‌

Best Web Hosting Provider In India 2024

నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చిన క‌న్న‌డ యాక్ష‌న్ కామెడీ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్ – గెస్ట్ రోల్‌లో పుష్ప విల‌న్‌

Nelki Naresh HT Telugu

థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే క‌న్న‌డ యాక్ష‌న్ కామెడీ మూవీ విద్యాప‌తి ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. నాగ‌భూష‌ణ‌, మ‌లైకా వాసుపాల్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ క‌న్న‌డంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

విద్యాప‌తి ఓటీటీ

క‌న్న‌డ యాక్ష‌న్ కామెడీ మూవీ విద్యాప‌తి ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. క‌న్న‌డంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కాక‌ముందే విద్యాప‌తి ఓటీటీలోకి రావ‌డం గ‌మ‌నార్హం.

పుష్ప యాక్ట‌ర్ గెస్ట్ రోల్‌…

విద్యాప‌తి మూవీలో నాగ‌భూష‌ణ‌, మ‌లైకావాసుపాల్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. పుష్ప లో విలన్ గా నటించిన డాలీధ‌నుంజ‌య…విద్యా పతి మూవీలో గెస్ట్ రోల్‌లో క‌నిపించాడు. ఈ మూవీకి ఈష‌మ్ – హ‌సీమ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏప్రిల్ 11న ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. ఈ మూవీలో కేజీఎఫ్ ఫేమ్ రామ‌చంద్ర‌రాజు విల‌న్‌గా న‌టించాడు.

ఈజీ మ‌నీ కోసం…

సిద్ధు ఈజీగా డ‌బ్బు సంపాదించి లైఫ్‌లో సెటిల్ కావాల‌ని క‌ల‌లు కంటుంటాడు. డ‌బ్బున్న వాడిగా అబ‌ద్ద‌మాడి సినిమా హీరోయిన్ విద్య‌కు ద‌గ్గ‌ర‌వుతాడు. సిద్ధు మంచిత‌నం, సింప్లిసిటీ చూసి విద్య అత‌డిని ఇష్ట‌ప‌డుతుంది. పెళ్లి త‌ర్వాత విద్య‌కు మేనేజ‌ర్‌గా ప‌నిచేయ‌డం మొద‌లుపెడ‌తాడు సిద్ధు.

జ‌గ్గు అనే వ్య‌క్తితో విద్య గొడ‌వ‌ప‌డుతుంది. అదే టైమ్‌లో ప్రేమ పేరుతో సిద్ధు ఆడిన నాట‌కం బ‌య‌ట‌ప‌డుతుంది. సిద్ధును త‌న ఇంట్లో నుంచి గెంటేస్తుంది విద్య‌. ఆ త‌ర్వాత ఏమైంది? విద్య‌కు తిరిగి సిద్ధు ఎలా ద‌గ్గ‌ర‌య్యాడు? త‌న త‌ప్పును ఎలా స‌రిదిద్దుకున్నాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌…

విద్యాప‌తి మూవీలో సినిమా హీరోగానే డాలీ ధ‌నుంజ‌య క‌నిపించాడు. కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌క‌ద్వ‌యం ఈ మూవీని తెర‌కెక్కించారు. కాన్సెప్ట్ బాగానే ఉన్నా కామెడీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఆశించిన స్థాయిలో పండ‌క‌పోవ‌డం ఈ మూవీకి మైన‌స్‌గా మారింది.

యూట్యూబ‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నాగ‌భూష‌ణ సంక‌ష్ట క‌ర గ‌ణ‌ప‌తి మూవీతో యాక్ట‌ర్‌గా శాండ‌ల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోయిన్‌గా మ‌లైకావాసుపాల్‌కు విద్యాప‌తి మొద‌టి సినిమా కావ‌డం గ‌మ‌నార్హం.

క‌న్న‌డ సినిమాలు….

ఈ వారం విద్యాప‌తితో పాటు కెరెబెటే, కాలాప‌త్త‌ర్‌తో పాటు మ‌రికొన్ని క‌న్న‌డ సినిమాలు ఓ టీటీలోకి వ‌చ్చాయి. కెరెబెటే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాగా…కాలాప‌త్త‌ర్ స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024