పంచాయ‌త్ వెబ్ సిరీస్‌ సీజ‌న్ 4 వ‌చ్చేస్తోంది – టీజ‌ర్ రిలీజ్ – ఈ సారి డ‌బుల్ డోస్ కామెడీ

Best Web Hosting Provider In India 2024

పంచాయ‌త్ వెబ్ సిరీస్‌ సీజ‌న్ 4 వ‌చ్చేస్తోంది – టీజ‌ర్ రిలీజ్ – ఈ సారి డ‌బుల్ డోస్ కామెడీ

Nelki Naresh HT Telugu

పంచాయ‌త్ వెబ్‌సిరీస్ సీజ‌న్ 4 ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. సీజ‌న్ 4 టీజ‌ర్‌ను మేక‌ర్స్ శ‌నివారం రిలీజ్ చేశారు. ఫులేరా గ్రామ పంచాయ‌తీ ఎలెక్ష‌న్స్ నేప‌థ్యంలో ఈ టీజ‌ర్ ఫ‌న్నీగా సాగింది. పంచాయ‌త్ సీజ‌న్ 4 జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

పంచాయ‌త్ వెబ్‌సిరీస్ సీజ‌న్ 4

పంచాయ‌త్ వెబ్‌సిరీస్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండియాలోనే హ‌య్యెస్ట్ వ్యూస్‌ను ద‌క్కించుకున్న వెబ్‌సిరీస్‌ల‌లో ఒక‌టిగా పంచాయ‌త్ రికార్డులు నెల‌కొల్పింది. ఇప్ప‌టికే పంచాయ‌త్ వెబ్‌సిరీస్‌లో మూడు సీజ‌న్లు వ‌చ్చాయి. తాజాగా నాలుగో సీజ‌న్ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

టీజ‌ర్ రిలీజ్‌…

పంచాయ‌త్ సీజ‌న్ 4 టీజ‌ర్‌ను మేక‌ర్స్ శ‌నివారం రిలీజ్ చేశారు. ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు. జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో పంచాయ‌త్ సీజ‌న్ 4 స్ట్రీమింగ్ కాబోతోంది. పంచాయ‌తీ ఎలెక్ష‌న్స్ చుట్టూ సీజ‌న్ 4 సాగ‌నున్న‌ట్లు టీజ‌ర్‌లో చూపించారు.

ఫులేరా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన్ జీ, భూష‌ణ్ జీ పోటీ ప‌డిన‌ట్లుగా టీజ‌ర్‌లో చూపించారు. వారి ఎన్నిక‌ల ప్ర‌చారం, ఈ క్ర‌మంలో ఎదుర‌య్యే సంఘ‌ట‌న‌ల‌తో ఫ‌న్నీగా టీజ‌ర్ సాగింది. భూష‌ణ్‌, మంజు దేవి పాత్ర‌ధారుల‌కు సంబంధించిన డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇద్ద‌రు ద‌ర్శ‌కులు…

పంచాయ‌త్ సీజ‌న్ 4లో జితేంద్ర‌కుమార్‌, నీనా గుప్తా, ర‌ఘుభీర్‌యాద‌వ్‌, చంద‌న్ రాయ్‌, బిశ్వ‌ప‌తి స‌ర్కార్‌, సునీత రాజ్వార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. పంచాయ‌త్ సీజ‌న్ 4కు అక్ష‌త్ విజ‌య్ వ‌ర్గియా, దీప‌క్ కుమార్ మిశ్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సిరీస్‌కు చంద‌న్ కుమార్ క‌థ‌ను అందించారు.

పంచాయ‌త్ వెబ్ సిరీస్ క‌థ ఇదే…

అభిషేక్‌ త్రిపాఠి ఇంజినీరింగ్ పూర్తిచేస్తాడు. క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం రాదు. స్నేహితుల స‌ల‌హా మేర‌కు పంచాయ‌తీ సెక్ర‌ట‌రీలో ఉద్యోగంలో చేరుతాడు.ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఫులేరా అనే గ్రామంలో అడుగుపెట్టిన అభిషేక్‌కు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? సిటీలో పెరిగిన అభిషేక్ ప‌ల్లెటూళ్ల భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన‌ గ్రామ‌స్తుల మ‌ధ్య ఇమ‌డ‌లేక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్‌తో పంచాయ‌తీ వెబ్‌సిరీస్ తెర‌కెక్కింది.

మూడో సీజ‌న్‌…

పంచాయ‌తీ వెబ్‌సిరీస్ సీజ‌న్ 3 గ‌త ఏడాది మేలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సీజ‌న్ వ‌న్‌, టూల‌తో పోలీస్తే మూడో సీజ‌న్ ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఫులేరా నుంచి అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్) బ‌దిలీ అవుతాడు. అత‌డి స్థానంలో ఫులేరాకు కొత్త సెక్రటరీగా వ‌స్తాడు. అయితే, సర్పంచ్ మంజు దేవి (నీనా గుప్త), ఆమె భర్త బ్రిజ్ భూషణ్ దూబే (రఘువీర్ యాదవ్), ప్రహ్లాద్ సహా గ్రామస్తులు కొత్త సెక్రటరీని అడ్డుకుంటారు.

మళ్లీ ఫులేరాకు అభిషేక్ త్రిపాఠిని సెక్రటరీగా తిరిగి తెచ్చుకుంటారు. అభిషేక్ కార‌ణంగా ఎమ్మెల్యే చంద్రకిశోర్ సింగ్ (ప్రకాశ్ జా)తో ఫులేరా ప్రజలకు ఉన్న విభేదాలు మరింత పెరుగుతాయి. ఓ వృద్ధురాలికి ప్ర‌భుత్వ ప‌థ‌కం కింద ఇంటిని అభిషేక్ మంజూరు చేయటంతో ఫులేరాలో రాజకీయాలు మొదలవుతాయి.

ఆ త‌ర్వాత ఏమైంది. ఎమ్మెల్యేకు, గ్రామ‌స్తుల‌కు మ‌ధ్య గొడ‌వ‌ల‌లో అభిషేక్ ఎలా న‌గిలిపోయాడు అనే అంశాల‌తో మూడో సీజ‌న్ రూపొందింది. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు ఎలా ఉంటాయో మూడో సీజ‌న్‌లో ద‌ర్శ‌కుడు చూపించారు.

ఇఫీ అవార్డు…

పంచాయ‌త్ సీజ‌న్ 1, సీజ‌న్ 2 ఇండియాలోనే హ‌య్యెస్ట్ వ్యూస్‌ను ద‌క్కించుకున్న సిరీస్‌లుగా నిలిచాయి. సీజ‌న్ 2 ఇండియ‌న్ బెస్ట్ వెబ్‌సిరీస్‌గా ఇఫీ అవార్డును అందుకున్న‌ది. ఓటీటీ అవార్డుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన తొలిసారే రెండు అవార్డుల‌ను గెలుచుకున్న‌ది. సీజ‌న్ 1 కూడా ఫిలింఫేర్‌తో పాటు ప‌లు అవార్డుల‌ను ద‌క్కించుకున్న‌ది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024